Dhadak 2 First Review: ధడక్ 2 ఫస్ట్ రివ్యూ అండ్ రేటింగ్
యానిమల్ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీని సంపాదించుకొన్న యువ తార తృప్తి డిమ్రీ ఓవర్‌నైట్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయారు. బాలీవుడ్ యువ హీరో సిద్దాంత్ చతుర్వేదితో కలిసి ఆమె నటించిన చిత్రం ధడక్ 2. హిందీ సినిమా పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, క్లౌడ్ 9 పిక్చర్స్ రూపొందించిన సినిరమాకు షాజియా ఇక్బాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను పాపులర్ నిర్మాతలు కరణ్ జోహర్, ఆదార్ పూనావాలా, అపూర్వ మెహతా, ప్రగతి దేశ్‌ముఖ్ నిర్మించారు. ఈ సినిమా ఆగస్టు 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమాకు సంబంధించి క్రిటిక్ రివ్యూ వివరాల్లోకి వెళితే..
జాన్వీ కపూర్ సినిమా రంగానికి పరిచయమై రూపొందిన ధడక్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన ధడక్ 2 చిత్రంలో త్రిప్తి డిమ్రీ, సిద్దాంత్ చతుర్వేదితోపాటు జాకీర్ హుస్సేన్, సౌరభ్ సచ్‌దేవా, దీక్షా జోష్ తదితరులు నటించారు. ఈ సినిమాకు సిల్వెస్టర్ ఫోన్సేకా సినిమాటోగ్రఫి, తనుజా టీకూ సంగీతం అందించారు. రోచక్ కోహ్లీ, తనిష్క్ బాగ్చీ, జావెద్ మోహిసిన్, శ్రేయాస్ పురానిక్ పాటలు అందించారు. ఈ సినిమా గురించి దుబాయ్ క్రిటిక్ ఉమేర్ సంధూ అందించిన రివ్యూ వివరాల్లోకి వెళితే..

ధడక్ 2 సినిమాను దుబాయ్ సెన్సార్ బోర్డులో చూశాను. ఈ సినిమాపై నా ఫస్ట్ రివ్యూ. ఈ మూవీ పవర్ ప్యాక్డ్‌గా రూపొందింది. ఈ సినిమాను తృప్తి డిమ్రి, మూవీ క్లైమాక్స్ కోసం తప్పకుండా చూడాలి. ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీసింది. సిద్దార్థ్ చతుర్వేది కూడా బాగా నటించాడు. ఈ మధ్యకాంలో థ్రిల్లింగ్ రొమాంటిక్ మూవీగా చెప్పుకోవచ్చు అని ఉమేర్ సంధూ ట్వీట్ చేశాడు.
ధడక్ సినిమాపై ప్రశంసలు కురిపించిన ఉమేర్ సంధూ తనదైన శైలిలో రివ్యూను అందించడమే కాకుండా రేటింగ్ కూడా భారీగానే ఇచ్చాడు. ఈ సినిమాకు 5 పాయింట్లకు గాను.. 3.5 పాయింట్లను కేటాయించాడు. దాంతో బ్లాక్ బస్టర్ అనే ఫీలింగ్‌ను కలిగించే ప్రయత్నం తన రివ్యూ ద్వారా చేశాడు. అయితే సైయారా సినిమా తర్వాత యూత్‌లో లవ్ స్టోరీలకు గిరాకీ పెరగడంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి.
ఇక ఉమేర్ సంధూ రివ్యూల విషయానికి వస్తే.. కొంత అటు ఇటుగా ఉంటాయి. కొన్ని సినిమాలపై ఆయన ఇచ్చిన రివ్యూలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. కొన్ని సినిమాలకు జెన్యూన్‌గా రివ్యూను ఇస్తుంటారు. కాబట్టి ధడక్2 సినిమాకు సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ రివ్యూను ఫిల్మీబీట్ అందించబోతున్నది. ఈ సినిమా రివ్యూ, బాక్సాఫీస్ నంబర్ల కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.
ఇదిలా ఉండగా, యానిమల్ సినిమా తర్వాత త్రిప్తి డిమ్రీ వరుసగా ఆఫర్లు అందుకొన్నది. గతేడాది బ్యాడ్ న్యూజ్, వికీ విద్య కా వో వాలా వీడియో, భూల్ భులయ్యా 3, చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలో ఆమె నటించిన సినిమాలకు బాక్సాఫీస్ వద్ద భారీగానే స్పందన కనిపిస్తున్నది. ఇక ఈ చిత్రం తర్వాత రోమియో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నది.


Click it and Unblock the Notifications











