Dhadak 2 Movie Twitter Review: ధడక్ 2 మూవీ ట్విట్టర్ రివ్యూ
ధర్మా ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ బ్యానర్‌పై కరణ్ జోహార్, అదర్ పూనావాలా సంయుక్తంగా నిర్మించిన చిత్రం ధడక్ 2. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ తృప్తి దిమ్రి, సిద్ధాంత్ చతుర్వేదిలు హీరో హీరోయిన్లుగా నటించారు. జాకీర్ హుస్సేన్, సౌరబ్ సచ్‌దేవా, దీక్షా జోషి తదితరులు కీలకపాత్ర పోషించారు.
ఇంకా ఈ చిత్రంలో విపిన్ శర్మ, సాడ్ బిలిగ్రామి, హరీష్ ఖన్నాలు నటిస్తున్నారు. తనుజ్ టికూ ఈ చిత్రానికి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తుండగా.. రోచక్ కోహ్లి, తనిష్క్ బాగ్చి, జావెద్ మోహిసిన్, శ్రేయాస్ పుర్నిక్‌లు స్వరాలు సమకూర్చారు. సిల్వస్టర్ ఫోన్సెకా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ధడక్ 2 చిత్రం ఆగస్ట్ 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఓవర్సీస్ తదితర ప్రాంతాల్లోని ప్రీమియర్ల తర్వాత ఈ సినిమాపై నెటిజన్లు వెల్లడించిన అభిప్రాయాల్లోకి వెళితే..

సామాజిక సమస్యల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. కథ చెప్పడంలో ధైర్యం, నటనలో నిజాయితీ కనిపించింది. నటీనటుల పర్ఫార్మెన్స్, సంభాషణలు, ఎమోషన్ అన్నీ బాగున్నాయని ఓ యూజర్ రాసుకొచ్చాడు.
కొన్ని కథలు మీ హృదయాన్ని తాకుతాయి. మరికొన్ని మీ మనసును తాకుతాయి. ధడక్ 2 ఈ రెండింటిని చేస్తుంది. నగరాల్లో కులం లేదు. అది నైతిక మసుగు వెనుక దాగి ఉంటుంది. ఈ ధడక్ 2 ఆ ముసుగును చీల్చేస్తుందని రివ్యూ ఇచ్చిన ఓ యూజర్..ఈ చిత్రానికి త్రీస్టార్ రేటింగ్ ఇచ్చాడు.
తృప్తి దిమ్రి మరోసారి అద్భుత నటనను అందించారు. సిద్ధాంత్‌తో పోలిస్తే తృప్తికి స్క్రీన్ టైమ్ తక్కువగా ఉన్నప్పటికీ.. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో తన అద్బుత నటనతో ఆ లోటును తీర్చుకున్నారని ఓ నెటిజన్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఇంటర్వెల్ షాకింగ్‌గా ఉంది. ప్రీ క్లైమాక్స్ బాగుంది, ఎండ్ కార్డ్ కూడా శక్తివంతంగా ఉంది. ధడక్ 2లో కొన్ని మైనస్‌లు కూడా ఉన్నాయి. ఫస్టాఫ్ బాగానే ఉంది.. సెకండాఫ్‌లోని కొన్ని సీన్స్ నెమ్మదిగా సాగుతాయి. సంగీతం ఆశించినంత స్థాయిలో లేదు.. సిద్ధాంత్ చతుర్వేది అలవోకగా తన పాత్రలో జీవించాడు అని ఆ యూజర్ రివ్యూ ఇచ్చాడు.
గ్రామీణ భారతదేశంలో జరిగే ప్రేమగాథ ధడక్ 2. కులాల అడ్డుగోడలు, నిషేధించిన ప్రేమను ఈ సినిమా హైలైట్ చేస్తుంది. సినిమా నిండా లోతైన సంఘర్షణ కనిపించింది. మనసును కదిలించే పాటలు, బలమైన నేపథ్య సంగీతం కలిపి ఎమోషనల్ సీన్స్‌ను ఎలివేట్ చేస్తున్నాయి. టైటిల్ ట్రాక్ ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉంది.
దర్శకుడు వాస్తవిక గ్రామీణ నేపథ్యాలను ప్రదర్శిస్తూ లవ్, డ్రామాను సమర్ధవంతంగా బ్యాలెన్స్ చేశాడు. ఫస్టాఫ్ మొత్తం యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఉండగా.. సెకండాఫ్ మొత్తం కుటుంబ వ్యతిరేకత, ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామాగా నడిచింది. క్లైమాక్స్ ఎవ్వరూ ఊహించని విధంగా ట్రాజెడి ఎండింగ్ ఇచ్చింది. సిద్ధాంత్ చతుర్వేది, తృప్తి దిమ్రిలు అద్భుతంగా నటించారు. ఈ సినిమా యూత్‌కు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుందని ఓ యూజర్ రివ్యూ ఇచ్చాడు. ధడక్ 2కు అతను 4 స్టార్ రేటింగ్ ఇచ్చాడు.
జైభీమ్ సినిమా మాదిరిగా హార్డ్ హిట్టింగ్ సోషల్ డ్రామా ఈ ధడక్ 2. యువత ప్రేమ పోరాటాన్ని, ఈ సందర్భంగా ప్రేమ జంట ఎదుర్కోనే సంఘటనను తెరపై ఎంజాయ్ చేయాల్సిందే. ధడక్ 2 ఈ ఏడాది అత్యంత ప్రభావవంతమైన చిత్రం. సిద్ధాంత్ చతుర్వేది శక్తివంతమైన నటనకు తృప్తి దిమ్రి బాగా సహకరించింది. దర్శకుడు షాజియాల్ ఇక్బాల్ థియేటర్లలో చప్పట్లు కొట్టే సన్నివేశాలను అందించాడు అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.


Click it and Unblock the Notifications











