twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ధడక్ మూవీ రివ్యూ: గుండెను మరోసారి పిండేసింది!

    By Rajababu
    |

    Recommended Video

    Dhadak Movie Review ధడక్ సినిమా రివ్యూ

    Rating:
    3.5/5
    Star Cast: జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్, అశుతోష్ రానా, శ్రీధర్ వాట్సర్
    Director: శశాంక్ ఖైతాన్

    అందాల తార, దివంగత శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ తెరంగేట్రం చేస్తున్న సినిమా కావడంతో ధడక్ చిత్రంపై మరింత ఆసక్తి పెరిగింది. ఈ చిత్రం 2016లో సంచలన విజయం సాధించిన మరాఠీ చిత్రం సైరత్‌కు రీమేక్. ఓ పక్క సైరత్ లాంటి చిత్రాన్ని రీమేక్ చేయడం, ఆ చిత్రం ద్వారా జాహ్నవి, బాలీవుడ్ నటుడు షాహీద్ కపూర్ సోదరుడు ఇషాన్ కట్టర్ హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయం కానుండటంతో భారీ అంచనాలు పెరిగాయి. పరువు హత్యల కథా నేపథ్యంలో వచ్చిన ధడక్ చిత్రం ఎలాంటి అనుభూతిని కలిగించింది. జాహ్నవి, ఇషాన్ జంట ఆకట్టుకున్నాదా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    ధడక్ స్టోరి

    ధడక్ స్టోరి

    పార్థవీ సింగ్ (జాహ్నవి కపూర్) ఉదయ్‌పూర్ ప్రముఖ రాజకీయవేత్త రతన్ సింగ్ (అశుతోష్ రాణా) కుమార్తె. ఓ సాధారణ కుటుంబానికి చెందిన మధుకర్ (ఇషాన్)‌తో ప్రేమలో పడుతుంది. ఓ ఫంక్షన్‌లో ముద్దు పెట్టుకొంటుండగా పార్థవీ, మధుకర్ ప్రేమ వ్యవహారం వారి కుటుంబం దృష్టిలో పడుతుంది. తన పలుకుబడితో మధుకర్‌ను రతన్ సింగ్ పోలీసులతో కొట్టిస్తాడు. జైలుకు పంపే సమయంలో పోలీసుల నుంచి పిస్టల్ తీసుకొని బెదిరిస్తూ ఇషాన్‌తో కలిసి పార్థవీ పారిపోతారు.

     కథలో ట్విస్టులు

    కథలో ట్విస్టులు

    ఉదయపూర్ నుంచి పారిపోయి కోల్‌కతాలో స్థిరపడిన పార్థవీ, మధుకర్ ప్రేమ జంటకు ఓ కుమారుడు పుడుతాడు. ఎంతో సంతోషంగా సాగుతున్న పార్థవీ జీవితంలో భయంకరమైన సంఘటన జరుగుతుంది. ఈ ప్రేమ జంటను ఇరు కుటుంబాలు ఆదరించాయా? వారి జీవితంలో చోటుచేసుకొన్న సంఘటనలేమిటి? పార్థవీ జీవితంలో చోటు చేసుకొన్న భయంకర సంఘటన ఏమిటి? అందుకు ఎవరు కారణమయ్యారు అనే ప్రశ్నలకు సమాధానమే ధడక్ చిత్ర కథ.

    క్లైమాక్సే కీలకం

    క్లైమాక్సే కీలకం

    ధడక్ చిత్ర క్లైమాక్స్ ఏమిటో ఇప్పటికే దేశవ్యాప్తంగా సినీ అభిమానులకు తెలుసు. క్లైమాక్సే ఈ చిత్రానికి ప్రాణం. అలాంటి కథ తెలిసిన తర్వాత కూడా ప్రేక్షకుడిని ధడక్ చిత్రం మరోసారి భావోద్వేగానికి గురిచేస్తుంది. కాకపోతే సైరత్‌ చిత్రంలో చూపిన విధంగా కాకుండా క్లైమాక్స్‌ను మరో విధంగా చూపి ప్రేక్షకులను థ్రిల్ చేశారు. అదే ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు.

    స్క్రిప్టు అనాలిసిస్

    స్క్రిప్టు అనాలిసిస్

    తొలి భాగంలో కథ సైరత్‌ చిత్రంలో చూపిన మాదిరిగానే ప్రేమలో పడటం, చాటుమాటుగా కలుస్తూ కుటుంబ సభ్యులకు దొరికిపోవడం లాంటి అంశాలు యధావిధిగా సాగిపోతాయి. తమను ప్రేమను రక్షించుకోవడానికి పార్థవీ, మధుకర్ పారిపోవడం, రకరకాల కష్టాలను అధిగమించి ఒక్కటవ్వడంలో ఏ మాత్రం మార్పుండదు. కాకపోతే జాహ్నవి, ఇషాన్ ఈ చిత్రాన్ని మరోస్థాయికి తీసుకుపోవడానికి విశేషంగా దోహదపడ్డారు.

     శశాంక్ ఖైతాన్ డైరెక్షన్

    శశాంక్ ఖైతాన్ డైరెక్షన్

    మరాఠీలో నాగరాజ్ మంజులే దర్శకత్వం వహిస్తే హిందీలో శశాంక్ ఖైతాన్ డైరెక్షన్ చేశారు. ఏ మాత్రం రిస్క్ చేసిన సినిమాపై దెబ్బ పడే ప్రమాదం ఉండటంతో కథలో పెద్దగా మార్పులు లేకుండానే తెరకెక్కించారు. శశాంక్‌కు స్క్రిప్టుపరంగా ఈ చిత్రం వడ్డించిన విస్తరి. తనవంతు బాధ్యతగా పనిని సమర్థవంతంగా పూర్తి చేశాడు. ఈ చిత్రం ద్వారా శశాంక్‌ ప్రతిభాపాటవాలు ఏంటో పూర్తిగా బేరీజు వేయడం సరికాదని చెప్పవచ్చు. కాకపోతే ఎమోషనల్‌గా మరోసారి కనెక్ట్ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.

    అదరగొట్టిన జాహ్నవి కపూర్

    అదరగొట్టిన జాహ్నవి కపూర్

    ధడక్‌ చిత్రంపై ఆసక్తిరేపిన జాహ్నవి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ చిత్రంలో ఆమెను చూస్తే ఎక్కడ తొలి చిత్ర హీరోయిన్‌గా కనిపించదు. రొమాంటిక్ సీన్లలో అవలీలగా మెప్పించింది. భావోద్వేగ సన్నివేశాలను అద్భుతంగా పండించింది. తెరపై అందంగా కనిపించింది. సెకండాఫ్‌లో ముఖ్యంగా జాహ్నవి అదరగొట్టింది. శ్రీదేవికి సరైన వారసురాలినని అనుపించుకొన్నది. పాటలు, డ్యాన్సులకు పెద్దగా అవకాశం లేకపోవడంతో ఈ సారి ఫెర్ఫార్మెన్స్‌తో సరిపెట్టింది.

     లవర్ బాయ్‌గా ఇషాన్

    లవర్ బాయ్‌గా ఇషాన్

    ఇషాన్ కట్టర్‌ లవర్‌ బాయ్‌గా ఆకట్టుకొన్నాడు. చలాకీగా, ఎనర్జిటిక్‌గా కనిపించాడు. పాటల్లోనూ, రొమాంటిక్ సన్నివేశాల్లోనూ ఆకట్టుకొన్నాడు. రెండో భాగంలో వచ్చే ఎమోషనల్ సన్నివేశాల్లో తన ప్రతిభను చాటుకొన్నాడు. బాలీవుడ్‌లో తనకు మంచి భవిష్యత్ ఉందని మధుకర్ పాత్ర ద్వారా ఇషాన్ చెప్పకనే చెప్పాడు.

     కామెడీ అంశాలు

    కామెడీ అంశాలు

    సీరియస్‌గా సాగే కథలో శ్రీధర్ వాట్సర్ కామెడీ బ్రహ్మండంగా పేలింది. పురుషోత్తం పాత్రలో అద్భుతమైన వినోదాన్ని అందించాడు. చూడటానికి నాలుగు ఫీట్లు లేని కమెడియన్ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాడు. బాలీవుడ్‌కు ఓ కొత్త కమెడియన్‌గా దొరికాడని చెప్పవచ్చు. ఓ దశలో జాహ్నవి, ఇషాన్‌ను డామినేట్ చేశాడా అనిపిస్తుంది.

    మిగితా పాత్రల్లో

    మిగితా పాత్రల్లో

    జాహ్నవి తండ్రిగా విలక్షణ నటుడు అశుతోష్ రాణా నటించాడు. ప్రతి నాయకుడి ఛాయలు ఉండే రతన్ సింగ్‌ పాత్రలో అలరించాడు. అధికారం, పరువు, ప్రతిష్ట కోసం పాకులాడే విలన్ పాత్రలో తనదైన నటనను ప్రదర్శించాడు. మిగితా నటులు తమ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.

    మ్యూజిక్ గురించి

    మ్యూజిక్ గురించి

    ధడక్ చిత్రానికి మ్యూజిక్ ఓ మ్యాజిక్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా రీరికార్డింగ్ సినిమాను నిలబెట్టింది. ఎమోషనల్‌గా కనెక్ట్ చేసింది. ఫీల్‌గుడ్, ఎమోషనల్ ఫ్యాక్టర్‌ను అందించడంలో అజయ్, అతుల్ సంగీతద్వయం ఆకట్టుకొన్నది.

     విష్ణురావు సినిమాటోగ్రఫర్‌గా

    విష్ణురావు సినిమాటోగ్రఫర్‌గా

    ధడక్ చిత్రానికి విష్ణురావు సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరించారు. రాజస్థాన్ అందాలను చక్కగా తన కెమెరాలో బంధించాడు. అలాగే కోల్‌కత్తా వాతావరణాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. జాహ్నవి, ఇషాన్‌ను చక్కటి జంటగా కనిపించేలా చేయడంలో తన ప్రతిభకు సాన పెట్టారు. మనిషా ఆర్ బల్దావా ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది.

     నిర్మాణ విలువలు

    నిర్మాణ విలువలు

    అందమైన ప్రేమ కథతో ఢడక్ చిత్రాన్ని దృశ్యకావ్యంగా కరణ్ జోహర్ బృందం మలిచింది. సాంకేతిక విలువలతో ఓ పెయింటింగ్‌లా కనిపిస్తుంది. కరణ్ జోహర్ నిర్మాణ విలువల గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది.

     ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    ధడక్ చిత్రం అందమైన ప్రేమకథే కాకుండా గుండెను పిండేసే విషాద గాథ. ఆహ్లాదకరంగా సాగిపోయే సముద్రయానంలో తుఫాన్‌లా కుదిపేసే భావోద్వేగమైన ముగింపు. ఈ అంశాలను ఏ భాషలో చూసినా గానీ కంటతడి, చక్కటి ఎమోషనల్ ఫీలింగ్ నింపే చిత్రం. యూత్‌కు తమకు తాము ఓన్ చేసుకొనే చిత్రమని చెప్పవచ్చు. ఫ్యామిలీ ఆడియెన్స్ వారాంతంలో మంచి సినిమా చూశామనే అనుభూతిని కలిగించే చిత్రం ధడక్.

    బలం

    బలం

    ప్లస్ పాయింట్స్
    కథ, కథనం
    జాహ్నవి కపూర్, ఇషాన్
    ప్రొడక్షన్ వ్యాల్యూస్
    సినిమాటోగ్రఫి, మ్యూజిక్
    కామెడీ

     బలహీనతలు

    బలహీనతలు

    తెలిసిన నటులు లేకపోవడం
    సెకండరీ గ్రేడ్ ఆర్టిస్టులు ఉండటం

    నటీనటులు, సాంకేతిక నిపుణులు
    తెర ముందు, తెర వెనుక
    నటీనటులు: జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్, అశుతోష్ రానా, శ్రీధర్ వాట్సర్
    దర్శకత్వం: శశాంక్ ఖైతాన్
    కథ: నాగరాజు మంజులే
    నిర్మాత: కరణ్ జోహర్ తదితరులు
    సంగీతం: అజయ్, అతుల్
    ఎడిటింగ్: మనీషా ఆర్ బల్దవా
    రిలీజ్: 2018-07-20

    English summary
    Dhadak is a 2018 musical tragic romance film directed by Shashank Khaitan, produced by Dharma Productions and Zee Studios and stars Janhvi Kapoor and Ishaan Khatter and Ashutosh Rana in lead roles. The film is a remake of the 2016 Marathi language film Sairat. It was released worldwide on 20 July 2018.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X