twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'ధైర్యం' కావాలి

    By Staff
    |

    Dhairyam
    సినిమా: ధైర్యం
    నటీనటులు: నితిన్‌, రైమాసేన్‌, తనికెళ్ల భరణి, రాజ్యలక్ష్మి,
    రెహ్మాన్‌, ఐశ్వర్య, అరుణ్‌ పాండ్యన్‌, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం,
    అలీ, రాళ్లపల్లి, సుమన్‌ సెట్టి, యం.యస్‌. నారాయణ తదితరులు
    సంగీతం: అనూప్‌
    ఫోటోగ్రఫీ: సమీర్‌ రెడ్డి
    కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: తేజ
    నిర్మాత: నారాయణ దాస్‌ నారంగ్‌, సుధాకర్‌ రెడ్డి

    'కాలేజీ ప్రేమ! డబ్బున్న అమ్మాయిని ప్రేమించిన పేదింటి కుర్రాడు. ఈ ప్రేమను అంగీకరించని హీరోయిన్‌ తలిదండ్రులు. ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలనే హీరోగారి ఆరాటం' ఇలాంటి 'సిండ్రిల్లా సిండ్రోమ్‌' కథలను గంతలో తెలుగు ప్రేక్షకులు చాలా ఆదరించే ఉండవచ్చు. కాని తరం మారిన నేపథ్యంలో కొత్తదనం కోరుకునే తెలుగువారికి పాత చింతకాయ పచ్చడి రుచించదు. 'జయం' తర్వాత విజయం లభించక తేజ వంటి క్రియేటిట్‌ స్పార్క్‌ ఉన్న డైరెక్టర్‌ 'కంఫర్ట్‌ జోన్‌'లోకి వెళ్లాలని చేసిన 'ధైర్యం' హర్షించదగింది కాదు.

    కథ: చెత్త తీసుకువెళ్లే మున్సిపల్‌ ట్రక్‌ డ్రైవర్‌ బిక్షపతి (తణికెళ్ల భరణి) కొడుకు శ్రీను (నితిన్‌) కాలేజీ లెక్చరర్లను ఏడిపిస్తూ, ఫ్రెండ్స్‌తో షికార్లు కొట్టే శ్రీను సరదా ప్రపంచంలోకి కాలేజీలో కొత్తగా చేరిన మల్లిక (రైమాసేన్‌) ప్రవేశిస్తుంది. 'లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌' ప్రేమ ప్రపోజల్స్‌ అయిపోయాక ఆమె ఈ తల్లి ఈ ప్రేమకథకు విలన్‌లా దాపురిస్తుంది. డబ్బు అంతరాల్ని చూపి శ్రీనును చంపాలని చూస్తుంది. బతికి బయటపడ్డ శ్రీను ఇంటికి వచ్చి వార్నింగ్‌ ఇస్తుంది. శ్రీను తల్లిదండ్రులు వెంటనే ఆ అమ్మాయిని తీసుకొని పోలీసు స్టేషన్‌కు వెళ్లే అక్కడ ఆమె తండ్రి ప్రత్యక్షమై పెళ్లి చేస్తానని ప్రామిస్‌ చేస్తాడు.

    అయితే, రోటీన్‌ కథలో లాగే హీరోయిన్‌ తండ్రి హీరో శ్రీనును దొంగతనం కేసులో ఇరికించి జైలు కథను నడిపించి, అక్కడ పోలీసులను మేనేజ్‌ చేనసి శిక్షను కూడా పొడిగింపచేసి మెయిన్‌ విలన్‌గా మారిపోతాడు. జైలు నుంచి శ్రీను ఎలా తప్పించుకుని బయటపడి తన ప్రేమను బతికించుకుంటాడనేది తెరపై చూడాల్సిందే.

    ఈ కథలో మొత్తం ప్రతి సన్నివేశం ప్రేక్షకుడు ఊహించినట్లే ముందుకు సాగుతుంది. ఇదే సినిమా నడకలోని లోపం. కాగా హీరో సినిమా టైటిల్‌కు తగినట్లు ధైర్యం చూపక 'పాసివ్‌'గా మారి అతను ప్రదర్శించే సహనం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. స్క్రీన్‌ప్లే అంతంత మాత్రమే. ప్లాట్‌ పాయింట్స్‌ విభజన సరిగా జరగలేదు. యాంటి క్లయిమాక్స్‌ అసలే లేదు. పాటలు కథా ప్రవాహానికి అడ్డుకట్టలు వేస్తుంటాయి. ఇంటర్వెల్‌ దాటాక సెకండ్‌ హాఫ్‌లో హీరో పాత్రను కామెడీ డామినేట్‌ చేసింది.

    పడి లేస్తూ కొట్టి, కొట్టించుకుంటూనే ఎత్తుకు పైయెత్తులుగా కథ సాగి హీరోలో తనను తాను చూసుకునే ప్రేక్షకుడు సంతృప్తి చెందుతాడు. ఎప్పుడూ పడిపోతూ, విలన్‌ వేసే ఎత్తులకు చిత్తయిపోతుంటే భరించడం కష్టంగానే వుంటుంది. అలాగే హీరో జైలు నుంచి పారిపోయే సీన్లు కన్విన్సింగ్‌గా లేవు. హీరోహీరోయిన్ల మధ్య న్న ప్రేమను బేసు చేసుకుని హీరో రైజ్‌ కావడం ఇలాంటి కథలకు ప్రాణం. ఇది ఎస్టాబ్లిష్‌ కాలేదు. హీరో కథానాయికను చూసీ చూడగానే ఏం నచ్చి ప్రేమలో పడ్డాడో (ప్రేమ గుడ్డిదని సరిపెట్టుకుంటే పోతుందేమో) తెలియదు. కొడుకు చస్తాడని తెలిసిన హీరో తల్లిదండ్రులు ఎంకరేజ్‌ చేయడం వాస్తవానికి ఆమడంత దూరంలో ఉంది. తల్లిదండ్రుల సహజ లక్షణానికి విరుద్ధంగా ఉంది. ఇది ప్రేక్షకులను ఆకట్టుకునే సెంటిమెంట్‌ కాదు.

    కథలో ఒక లోపం ప్రధానమైంది: తాను నీకు సీనియర్‌నని హీరో హీరోయిన్‌తో చెప్పుకుంటాడు, మరి ఇద్దరూ ఒకే క్లాసులో ఎందుకుంటారో! ప్రేమించుకోవడానికి, డ్యూయెట్లు పాడుకోవడానికి ఒకే క్లాసులో బంధించాల్సి వచ్చిందేమో మరి! ఈ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.

    తేజా మార్కు ప్రేమ కెమిస్ట్రీ సీన్లు పండటం చిన్న అసెట్‌. ధర్మవరపు తిరిగి లెక్చరర్‌ పాత్రలో యధావిధిగానే నవ్వించాడు. కెమెరా పనితనం ఫరవాలేదు. మూడు పాటలు బాగున్నాయి. కథ మాటెలా ఉన్నా తేజ డైరెక్టోరియల్‌ టచ్‌ క్లియర్‌గా కనిపిస్తుంది. రాళ్లపల్లి, అలీ, బ్రహ్మానందం సహజసిద్ధంగా నవ్వులు కురిపించారు.

    ఇలాంటి పాత చింతకాయ పచ్చడి కథను డీల్‌ చేయాలంటే కొంత 'ధైర్యం' అవసరమే. తేజ లాంటి డైరెక్టర్‌కు ఈ విషయం తెలుసని అనుకుంటే తప్పు లేదు. తన మూసను తానే బద్దలు కొట్టిన సమయం వచ్చిందనే విషయం తేజ గ్రహిస్తే మరో ట్రెండ్‌కు ప్రారంభకుడు కాగలడేమో!

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X