Dhamaal 4 First Review: ధమాల్ 4 హిందీ మూవీ ఫస్ట్ రివ్యూ
బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, రితేష్ దేశ్‌ముఖ్, అర్షద్ వార్సీ నటించిన తాజా కామెడీ ఎంటర్‌టైనర్ ధమాల్ 4. ధమాల్ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందిన ఈ సినిమాకు ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు భూషణ్ కుమార్, అజయ్ దేవగన్, కిషన్ కుమార్, అశోక్ థకేరియా, ఇంద్ర కుమార్, ఆనంద్ పండిట్, కుమార్ మంగత్ పాథక్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో జావెద్ జాఫ్రీ, రవికిషన్, సంజయ్ మిశ్రా, ఉపేంద్ర లిమియే, ఈషా గుప్తా, అంజలి ఆనంద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కేతిక శర్మ, గురు రాంధ్వా, నీల్ కమల్ సింగ్, సంజు రాథోడ్ స్పెషల్ సాంగ్స్‌లో ఎట్రాక్షన్‌గా మారనున్నారు.
ఈ చిత్రానికి సంబంధించి సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. సినిమాటోగ్రఫి: సుధీర్ కే చౌదరీ, ఎడిటింగ్: సంజయ్ సంక్లా, మ్యూజిక్: తనిష్క్ బాగ్చీ, ఆదిత్య దేవ్, నీల్ కమల్ సింగ్, సంజూ రాథోడ్, గురు రాంధ్వా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: అమర్ మొహిలే తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. టీ సిరీస్ ఫిల్మ్స్, పనోరమా స్టూడియోస్, దేవగణ్ ఫిలింస్, మారుతి ఇంటర్నేషనల్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ సినిమా జూలై 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాను ఇటీవల సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ చిత్రానికి జారీ చేసిన సర్టిఫికెట్ ఏంటి? ఈ సినిమా రన్ టైమ్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

ధమాల్ 4 సినిమా కథ విషయానికి వస్తే.. గుడ్డు రస్తోగి (అజయ్ దేవగన్), దేశబంధు లల్లన్ రాయ్ (రితేష్ దేశ్‌ముఖ్), ఆదిత్య శ్రీవాస్తవ్ (అర్షద్ వార్సీ), మానవ్ శ్రీవాస్తవ్ (జావెద్ జాఫ్రీ) నలుగురు క్లోజ్ ఫ్రెండ్స్. వారి జీవితంలో దురదృష్టం తప్పా అదృష్టం అనేది ఏ కోశానా కనిపించదు. దాంతో లైఫ్‌లో సుఖ: సంతోషాలు, డబ్బు వేటలో పడుతారు. ఈ నలుగురి జీవితాలను దురదృష్టం ఎలా వెంటాడింది? వారికి జీవితంలో ఎదురైన సమస్యలు ఏమిటి? వాటికి వారు ఎలా రియాక్ట్ అయ్యారు? చివరకు వారి జీవితంలో ఏదైనా ఊహించని మార్పులు జరిగి పాజిటివ్‌గా మారిందా? అనే ప్రశ్నలకు హస్యంతో కూడిన సమాధానమే ధమాల్ 4 సినిమా కథ.
గత మూడు ధమాల్ ఫ్రాంచైజీలకు అనూహ్యమైన రెస్పాన్స్ బాక్సాఫీస్ వద్ద కనిపించింది. అదే పంథాలో బెటర్ ఫన్, కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్‌తో ప్లాన్ చేసిన ఈ సినిమాను సెన్సార్ ప్రతినిధులు, అధికారులు రివ్యూ చేశారు. ఈ చిత్రంలో సన్నివేశాలకు పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. రెండు సీన్లలోని అసభ్యకరమైన సైగలు, డైలాగ్స్ విషయంలో మార్పులు, చేర్పులు సూచించారు. వాటికి చిత్ర యూనిట్ సానుకూలంగా స్పందించి వాటికి మార్పులు చేయడంతో ఈ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఇక ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ వివరాల్లోకి వెళితే.. వినోద ప్రధానంగా సాగే ఈ మూవీకి యూఏ (UA13+) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ సర్టిఫికెట్ ప్రకారం.. 13 ఏళ్లకుపైబడిన వారంతా ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో చూడాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమాను ఎక్కువగా సాగదీయకుండా కథ, కథనాల డిమాండ్ మేరకు 2 గంటల 23 నిమిషాల నిడివితో ముగించారు. అంటే ఈ చిత్రం రన్ టైమ్ 143 నిమిషాలుగా ఫిక్స్ చేశారు.
ధమాల్ 4 సినిమా విషయానికి వస్తే.. అజయ్ దేవగన్, రితేష్, అర్హద్ వార్సీ కామెడీ ట్రాక్ ఫన్ లవింగ్‌గా ఉంటాయి. వినోదంతోపాటు కథలో భావోద్వేగాలు ఆకట్టుకోనేలా ఉంటాయి. ఈ సినిమాలో స్టోరీ పరంగా పెద్దగా అంచనాలు ఉండవు కానీ.. ఈ సినిమా పైసా వసూల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది అనే ఫీడ్ బ్యాక్ వినిపిస్తున్నది. ఈ సినిమా గురించిన ఎక్స్‌క్లూజివ్ రివ్యూ, ఇతర కథనాల కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications



