Dhandoraa Movie Review: దండోరా మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

న‌టీన‌టులు: శివాజీ, న‌వ‌దీప్‌, నందు, ర‌వికృష్ణ‌, మ‌నికా చిక్కాల‌, మౌనికా రెడ్డి, బిందు మాధ‌వి, రాధ్య‌, అదితి భావ‌రాజు త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం: ముర‌ళీకాంత్‌
నిర్మాత‌: ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్ప‌నేని
సినిమాటోగ్ర‌ఫి: వెంక‌ట్ ఆర్‌.శాఖ‌మూరి
ఎడిటింగ్: సృజ‌న అడుసుమిల్లి
మ్యూజిక్: మార్క్ కె.రాబిన్‌
ఆర్ట్ డైరెక్ట‌ర్‌: క్రాంతి ప్రియం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎడ్వ‌ర్డ్ స్టెవెన్‌స‌న్ పెరెజి
కాస్ట్యూమ్ డిజైన‌ర్‌: రేఖా బొగ్గార‌పు
లైన్ ప్రొడ్యూస‌ర్‌: కొండారు వెంక‌టేష్‌
బ్యాన‌ర్‌: లౌక్య ఎంట‌ర్‌టైన్మెంట్స్‌
రిలీజ్ డేట్: 2025-12-25

అగ్ర కులానికి చెందిన శివాజీ ( శివాజీ) ప్రాణం కంటే కులం పట్టింపే ఎక్కువ. అలాంటి శివాజీకి కొడుకు విష్ణు (నందు) కూతురు సుజాత (మణిక) ఉంటారు. కూతురు సుజాత అదే గ్రామానికి చెందిన తక్కువ కులానికి చెందిన రవి (రవికృష్ణ)తో ప్రేమలో ఉంటుంది. తన ఇష్టానికి వ్యతిరేకంగా తక్కువ కులానికి చెందిన యువకుడితో అఫైర్ పెట్టుకొన్న కూతురు విషయంలో తీవ్రమైన నిర్ణయం తీసుకొంటారు. శివాజీ కులానికి పెద్దలు రవికి దారుణమైన శిక్ష విధిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో తండ్రి శివాజీని విష్ణు అసహ్యించుకొంటూ దూరంగా ఉంటాడు. ఆ తర్వాత శివాజీ తాను చేసిన తప్పుకు కుమిలిపోతూ మరణిస్తాడు.

Dhandoraa Movie Review

కూతురు సుజాత ప్రేమ విషయంలో శివాజీ తీసుకొన్న నిర్ణయం ఏమిటి? శివాజీ కుల పెద్దలు రవికి ఎలాంటి శిక్ష విధించారు? కూతురు, కొడుకు దూరం కావడంతో శ్రీలత (బిందు మాధవి) అనే వేశ్యకు ఎలా దగ్గరయ్యారు? శ్రీలతతో బంధంతో శివాజీలో వచ్చిన మార్పు ఏమిటి? శివాజీ మరణం తర్వాత జరిగిన పరిణామాలు, సంఘటనలు ఏమిటి? ఈ వ్యవహారం మొత్తంలో గ్రామ సర్పంచ్ (నవదీప్) ఎలాంటి పాత్రను పోషించాడు? తండ్రి విషయంలో విష్ణు తీసుకొన్న నిర్ణయం ఏమిటి? శివాజీ మరణం గ్రామంలో ఎలాంటి మార్పులకు దారి తీసింది? గ్రామంలో కులాల అంతరాలు తగ్గాయా? అనే ప్రశ్నలకు సమాధానమే దండోరా సినిమా కథ.

అగ్ర కులాలు, తక్కువ కులాల మధ్య అంతరాలు, బేధాలు, ప్రేమలు, పెళ్లిళ్ల ఆధారంగా చాలా సినిమాలే వచ్చాయి. కానీ దండోరాలో దర్శకుడు మురళీకాంత్ ఎంచుకొన్న పాయింట్‌లో కొత్తదనం ఉంది. చాలా సినిమాల్లో కింది కులాలే బాధితులు. కానీ ఈ కథలో అగ్ర కులాలే బాధితులు కావడమనేది ఈ సినిమాకు నావెల్టీ పాయింట్. కథను, పాత్రలను ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు తొలి భాగంలో చాలా సమయం తీసుకొని తంటాలు పడ్డారు. ఫస్టాఫ్‌లో డైరెక్టర్ ఏం చెప్పాలనుకొంటాడో అర్ధం కాని పరిస్థితి ఉంటుంది. కథ కదలకుండా అక్కడక్కడే తిరగడం రొటీన్, రెగ్యులర్‌గా ఉండబోతుందా? అనే అనుమానం కలుగుతుంది. కానీ ఇంటర్వెల్ పాయింట్‌తో అనేక ప్రశ్నలు, సందేహాలకు సూటిగా, సుత్తి లేకుండా జవాబు చెప్పాడు. ఇంటర్వెల్‌తో సినిమా టేకాఫ్ తీసుకొన్న తర్వాత సరైన గాడిలో పడిందనే అభిప్రాయం కలుగుతుంది.

అయితే సెకండాఫ్‌లో కూడా కొంత సమయం నిదానంగా సాగడం మళ్లీ మొదటికొచ్చిందా? అనే అనుమానం కలుగుతుంది. శివాజీ, బిందుమాధవి మధ్య సీన్లు కథను సాగదీసినట్టుగా అనిపిస్తాయి. అయితే కోర్టు సీన్ ఎపిసోడ్ తర్వాత శివాజీ పాత్ర చెలరేగిపోవడం.. ఆ తర్వాత అన్ని పాత్రలను అదే రీతిలో నడిపించడం.. ఫుల్లుగా ఎమోషన్స్ జొప్పించడంతో కథ ఊహించని మలుపులు తిరుగుతంది. హృదయాన్ని కదిలించేలా.. సమాజాన్ని ఆలోచింపజేసే విధంగా దర్శకుడు సినిమాను నడిపించిన విధానం ఈ సినిమా సక్సెస్‌ బాట పట్టించేలా చేసింది.

పాజిటివ్ పాయింట్స్:

యాక్టర్ల పెర్ఫార్మెన్స్
సెకండాఫ్‌లో ఎమోషన్స్
చివరి 20 నిమిషాల్లో కథ నడిపించిన విధానం
సమాజాన్ని ఆలోచింపజేసే క్లైమాక్స్

నెగిటివ్ పాయింట్స్
ఫస్టాఫ్‌లో స్లో నేరేషన్
స్క్రీన్ ప్లే

నటీనటులు విషయానికి వస్తే.. శివాజీ మరోసారి పవర్‌ఫుల్ పాత్రలో చెలరేగిపోయాడు. సినిమా భారాన్నంత తన భుజాలపై మోశాడు. నవదీప్ 2.0 ఈ మూవీకి స్పెషల్ ఎట్రాక్షన్. ఇప్పటి వరకు తన ఇమేజ్‌కు భిన్నంగా కనిపించి తన పాత్రలో ఒదిగిపోయాడు. నందూ విషయానికి వస్తే.. కొత్త నందూని చూస్తాం. యాక్టర్‌గా అద్బుతమైన మెచ్యురిటీని ప్రదర్శించాడు. ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్ వరకు సినిమాను తన జోన్‌లోకి లాగేసుకొన్నాడు. మణిక, బిందుమాధవి, మౌనిక రెడ్డి, ఈ చిత్రంలో కనిపించిన అందరూ గుర్తుండిపోయేలా నటించి మెప్పించారు.

ఈ సినిమాకు సినిమాటోగ్రఫి, మ్యూజిక్ అదనపు బలంగా నిలిచాయి. వెంకట్ తన కెమెరాలో సన్నివేశాలను చక్కగా బంధించడమే కాకుండా ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌ను యాడ్ చేశారు. మార్క్ కే రాబిన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సృజన ఎడిటింగ్ బాగుంది. ఇంకా షార్ఫ్‌గా కట్ చేయాల్సిందనిపిస్తుంది. ఆర్ట్ విభాగం పనితీరు విషయంలో క్రాంతి ప్రియం వర్క్ తెర మీద కనిపిస్తుంది. క్యాస్టూమ్ విషయంలో రేఖా బోగ్గారపు టేస్ట్ ప్రతీ పాత్రలోను కనిపిస్తుంది. లౌక్య ఎంట‌ర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్ప‌నేని భేష్‌గా ఉండటమే కాకుండా సినిమా అంటే తనకు ప్యాషన్ అని మరోసారి నిరూపించుకొన్నారు.

సామాజిక అసమానతలు, కులం కంపును తరమికొట్టాలనే తపనతో రూపొందించిన చిత్రం దండోరా. ప్రస్తుతం జనరేషన్‌ ఆలోచనలకు భిన్నంగా సొసైటికి కనువిప్పు కలిగిలా ఈ సినిమాను దర్శకుడు అందించారు. సినిమా ఓపెనింగ్‌తోపాటు క్లోజింగ్‌ను నవదీప్ మీద కనెక్ట్ చేసిన విధానం బాగుంది. చక్కటి కథ, సామాజిక సందేశాలు, పవర్‌ఫుల్ ఫెర్ఫార్మెన్స్‌ చూడాలనుకొంటే ఈ వారం దండోరాను మీరు థియేటర్లలో నిస్పందేహంగా చూడొచ్చు.

Read more about: Dhandoraa shivaji navdeep
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X