Dhandoraa First Review: దండోరా మూవీ ఫస్ట్ రివ్యూ
బెదురులంక 2012 లాంటి ఫీల్‌గుడ్ చిత్రాన్ని అందించిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పానేి రూపొందించిన చిత్రం దండోరా. తెలుగు సినిమా పరిశ్రమలోని పాపులర్ యాక్టర్లు శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మనికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య, అదితి భావరాజు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. సామాజిక సృహ, కులం వివక్ష లాంటి అంశాలతో ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు మురళీకాంత్ దర్శకత్వం వహించారు.
ఈ మూవీ సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. వెంకట్ ఆర్ శాఖమూరి సినిమాటోగ్రఫిని, సృజన అడుసుమిల్లి ఎడిటర్‌గా, మార్క్ కే రాబిన్ మ్యూజిక్, క్రంతి ప్రియం ఆర్ట్ డైరెక్టర్‌గా, రేఖా బొగ్గారపు కాస్టూమ్ డిజైనర్‌గా పనిచేశారు. ఇప్పటికే మంచి అంచనాలు పెంచుకొన్న ఈ చిత్రం డిసెంబర్ 23న అమెరికాలో ప్రీమియర్లతో, డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాను ఇటీవల సెన్సార్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) రివ్యూ చేసింది. ఈ సినిమాకు లభించిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైమ్ ఏంత? ఈ సినిమాపై వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..

సమాజంలో అన్ని రంగాల్లోను ప్రజలు చైతన్యాన్ని, అభివృద్ధిని సాధిస్తున్నారు. అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేసి చూపిస్తున్నారు. కానీ సమాజాన్ని ఇంకా కులం అనే విషయం పట్టి పీడిస్తున్నది. పరువు హత్యలు, చావు, పుట్టుక లాంటి అంశాలను సమాజం ఆలోచింపజేసే విధంగా ఈ సినిమాను తెరకెక్కించారు. వినోదం ఏ మాత్రం తగ్గకుండా ప్రజలను చైతన్య పరిచే విధంగా సామాజిక సందేశాన్ని అందించారనే విషయం బయటకు వచ్చింది.
తెలుగు సినిమా పరిశ్రమ ప్రస్తుత పోకడలు, ట్రెండ్‌కు భిన్నంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం, సామాజిక చైతన్యాన్ని స్పూర్తించే విధంగా ఈ సినిమాను తెరకెక్కించడంపై చిత్ర యూనిట్‌ను సెన్సార్ సభ్యులు, ప్రతినిధులు ప్రశంసించారు. ఈ చిత్రంలో నటీనటులు పెర్ఫార్మెన్స్ సినిమాను సజీవంగా మార్చడమే కాకుండా సమాజంలో ప్రతిబింబించే పరిస్థితులను తెరమీద ఆవిష్కరించేలా చేసిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఇక ఈ సినిమాలోని కొన్ని క్లిష్టమైన సీన్లపై కొన్ని అభ్యంతరాలు సెన్సార్ అభ్యంతరం తెలియజేశారు. అయితే కథ డిమాండ్ ఎలా చేసిందనే విషయాన్ని తమదైన రీతిలో చెప్పి సెన్సార్‌ను కన్విన్స్ చేశారు. సెన్సార్ సలహాలు, సూచనలతో కొన్ని మార్పులు చేర్పులు చేయడం ద్వారా సెన్సార్ ఫార్మాలిటీస్ ముగించారు. అన్ని రకాలుగా ఈ సినిమాపై సెన్సార్ సంతృప్తిని వ్యక్తం చేశారు అని చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఈ సినిమాకు యూఏ (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ మూవీని 12 ఏళ్లకుపై బడిన వారు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో చూడొచ్చని సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్‌లో తెలిపారు. ఈ మూవీ నిడివి 2 గంటల 16 నిమిషాలు అంటే.. 136 నిమిషాల రన్‌టైమ్‌ను ఫిక్స్ చేశారు అని చిత్ర యూనిట్ తెలిపారు.


Click it and Unblock the Notifications











