twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jagame Maya Review: ధన్య బాలకృష్ణ సాఫ్ట్ వేర్ క్రైమ్ డ్రామా 'జగమే మాయ'.. ఎలా ఉందంటే?

    |

    రేటింగ్: 2.0/5

    టైటిల్: జగమే మాయ
    నటీనటులు: ధన్య బాలకృష్ణ, చైతన్య రావు, తేజ ఐనంపూడి, బబ్లూ పృథ్వీరాజ్, రాకింగ్ రాకేష్ తదితరులు
    సినిమాటోగ్రఫీ: రాహుల్ మాచినేని
    కథ, దర్శకత్వం: సునీల్ పుప్పాల
    సంగీతం: అజయ్ అరసాడ
    నిర్మాతలు: ఉదయ్ కోలా, శేకర్ అన్నే
    సమర్పణ: మురళి లాలుకోట
    విడుదల తేది: డిసెంబర్ 15, 2022
    ఓటీటీ వేదిక: డిస్నీ ప్లస్ హాట్ స్టార్

    మహిళా ప్రాధాన్యత పాత్రలతోపాటు సహాయ పాత్రలు చేస్తూ తనదైన శైలీని అవలంబించే హీరోయిన్ ధన్య బాలకృష్ణ. ఇటీవల అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి ఫీమేల్ లీడ్ సినిమా చేసి ఆకట్టుకున్న ధన్య సుడిగాలి సుధీర్ హీరోగా చేసిన సాఫ్ట్ వేర్ సుధీర్ చిత్రంలో హీరోయిన్ గా అలరించింది. ఇప్పుడు మరోసారి మెయిన్ లీడ్ రోల్ లో 'జగమే మాయ' సినిమాతో ఓటీటీ ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ధన్యాతోపాటు 30 వెడ్స్ 21 వెబ్ సిరీస్, ముఖచిత్రం ఫేమ్ చైతన్య రావు, తేజ మైనంపూడి మరో ప్రధానపాత్రధారులుగా నటించారు. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డిసెంబర్ 15 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

    కథ

    కథ

    ఆనంద్ (తేజ మైనంపూడి) బెజవాడలో పనేం చేయకుండా ఐపీఎల్ బెట్టింగ్ ద్వారా డబ్బు సంపాదించాలనుకుంటాడు. కానీ ఆ బెట్టింగ్ లో లక్షలు పోగోట్టుకుంటాడు. అప్పు ఇచ్చిన వాళ్లు ఆనంద్ పై ఒత్తిడి తీసుకొస్తారు. దీంతో ప్రేమికులు, అఫైర్స్ పెట్టుకున్నవాళ్ల ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు సంపాందిస్తాడు. అప్పుల వాళ్ల నుంచి పూర్తిగా తప్పించుకునేందుకు హైదరాబాద్ కు షిఫ్ట్ అవుతాడు. అక్కడ ఎవరైనా డబ్బు ఉన్న అమ్మాయిని లైన్ లో పెట్టాలని ప్లాన్ వేస్తాడు.

    ఈ క్రమంలోనే డిప్రెషన్ క్లాస్ లకు అటెండ్ అవుతాడు. అక్కడ చిత్ర (ధన్య బాలకృష్ణ) పరిచయం అవుతుంది. ఆ తర్వాత ఏమైంది? అనాథ అయిన ధన్య బాలకృష్ణ డిప్రెషన్ క్లాస్ కి ఎందుకు వస్తోంది? ఆమె భర్త అజయ్ (చైతన్య రావు)కు ఏమైంది? మరి తను అనుకున్నట్లు ఆనంద్ డబ్బు సంపాదించాడా? ఎవరు ఎవరినీ మోసం చేశారు? వంటి ఆసక్తికర అంశాల సమ్మేళనమే 'జగమే మాయ'.

    విశ్లేషణ

    విశ్లేషణ

    ఇది ఒక సాఫ్ట్ వేర్ నేపథ్యంలో తెరకెక్కిన క్రైమ్ అండ్ మిస్టరీ స్టోరి. ఆనంద్ ఐపీఎల్ బెట్టింగ్ సీన్ తో ప్రారంభమైన ఈ సినిమా ప్రారంభంలో ఇంట్రెస్టింగ్ గానే ప్రారంభం అవుతోంది. కానీ రాను రాను సన్నివేశాల్లో నెమ్మదనం కాస్తా బోరింగ్ ఫీలింగ్ తెప్పిస్తుంది. కానీ ఆనంద్ వేసిన స్కెచ్ కోసం చేసే పనులు, ఏంట్రీ ఇంత ల్యాగ్ ఉంది అని అతనే చెప్పుకోవడం ఫన్నీగా ఉంటుంది. ధన్య బాలకృష్ణ మెప్పు కోసం చేసే చర్యలు కామెడీగా అనిపించిన కొత్తగా అనిపించదు. దాదాపుగా గంట తర్వాత కానీ అసలు కథలోకి తీసుకెళ్లకుండా సాగదీతలా అనిపించింది. కథలో మెయిన్ ట్విస్ట్ రివీల్ అయ్యే వరకు అంత ఆసక్తిగా ఉండదు.

    మెయిన్ ట్విస్ట్ రివీల్ అయ్యాకా ఆనంద్ తనగురించి మనసులో మాట్లాడుకునే మాటలు నవ్వు తెప్పిస్తాయి. ఆ కామెడీ సినిమాలో బాగా వర్కౌట్ అయింది. ఆ కామెడీ మినహా సినిమాలో పెద్దగా నచ్చే అంశాలు ఏం లేవు. ట్విస్టులు కూడా ముందుగానే ఊహించవచ్చు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. సినిమాకు అదొక ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.

    ఎవరెలా చేశారంటే..

    ఎవరెలా చేశారంటే..

    ధన్య బాలకృష్ణ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ఆకట్టుకుంది. అమాయకత్వంతోపాటు గ్రే షేడ్స్ చూపించారు. చైతన్య పాత్ర కనిపించేది తక్కువైన ఆయన పాత్ర పరిధి మేరకు నటించారనే చెప్పవచ్చు. ఇక తేజ మైనంపూడి నటన బాగుంది. ఆయన డైలాగ్ డెలివరీతో కామెడీని బాగా పండించాడు. ఇందులో మరో కీలక పాత్రలో పెళ్లి సినిమా ఫేమ్ బబ్లూ పృథ్వీరాజ్ నటించారు.

    కానీ ఆయనకు పెట్టిన నత్తి అంతగా వర్కౌట్ కాలేదు. ఏదో ఎఫెక్ట్ కోసం పెట్టినట్లు ఉన్నారు కానీ, అదంతా సెట్ కాలేదు. దానివల్ల కథకు ఒరిగిందేం లేదు. ఇక ఫైనల్ గా చెప్పాలంటే సాఫ్ట్ వేర్ క్రైమ్ కథతో వచ్చిన 'జగమే మాయ' సినిమాను టైమ్ పాస్ కి చూడొచ్చు. చివర్లో సీక్వెల్ ట్విస్ట్ ఇచ్చి ఆసక్తి నింపారు.

    English summary
    Dhanya Balakrishna Chaitanya Rao Teja Mynampudi Starrer OTT Movie Jagame Maya Review And Rating In Telugu
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X