Dheera Review ఏపీ పవర్ పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్‌తో.. లక్ష్ చదలవాడ ఎలా చేశాడు? ధీర సమీక్ష

Rating: 2.5/5

నటీనటులు: లక్ష చదలవాడ, నేహ పఠాన్, సోనియా భన్సల్, సుమన్, బాబీ బేడీ, హిమజ, సామ్రాట్ రెడ్డి, మిర్చి కిరణ్ తదితరులు
దర్శకత్వం: విక్రాంత్ శ్రీనివాస్
నిర్మాత: లక్ష్ చదలవాడ, పద్మావతి చదలవాడ
మ్యూజిక్ం సాయి కార్తీక్
సినిమాటోగ్రఫి: కన్నా పీసీ
ఎడిటర్: వినయ్ రామాస్వామి వీ
సమర్పణ: చదలవాడ బ్రదర్స్
బ్యానర్: శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిల్మ్స్
రిలీజ్ డేట్: 2024-02-02

రణధీర్ (లక్ష్ చదలవాడ)కు డబ్బే సర్వస్వం. డబ్బు కోసం ఎలాంటి పనిచేయడానికి సిద్దపడుతాడు. భారీగా డబ్బు ఆఫర్ చేయడంతో కోమాలో ఉన్న రాజ్ గురు (భూషణ్ కల్యాణ్) వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు తీసుకెళ్లే పనిని భుజాన వేసుకొంటాడు. రాజ్‌గురును తరలించే అంబులెన్స్‌లో ధీరతోపాటు డాక్టర్ అమృత (నేహ పఠాన్) కూడా వెళ్తుంది. అయితే అంబులెన్స్‌ హైదరాబాద్ చేరకుండా ఓ గ్యాంగ్ శతవిధాల ప్రయత్నిస్తుంది.

Dheera Telugu Movie Review

తన జీవితంలో ప్రియురాలిని ధీర ఎందుకు వదులుకొన్నాడు? రాజ్ గురు కోమాలోకి ఎందుకు వెళ్లాడు? కోమాలో ఉన్న రాజ్‌గురును హైదరాబాద్‌కు ధీర చేర్చాడా? రాజ్‌గురు అంబులెన్స్‌పై గ్యాంగ్ ఎందుకు దాడి చేయడానికి ప్రయత్నించింది? ఏపీకి చెందిన రాజకీయ నాయకురాలు హంసలేఖ (హిమజ) ఓ పాపను అప్పగించాలని పోలీస్ ఆఫీసర్‌ను ఎందుకు నియమించింది? పాపకు రాజకీయ నాయకురాలికి ఏం సంబంధం? అనే ప్రశ్నలకు సమాధానమే ధీర సినిమా కథ.

ఏపీ రాజకీయాలు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త బ్యాక్ డ్రాప్‌తో అల్లుకొన్న యాక్షన్ థ్రిల్లర్ ధీర. అలాగే ధీరకు సంబంధించి రెండు ప్రేమకథలతో ఇంట్రెస్టింగ్ కథను చెప్పేందుకు దర్శకుడు విక్రాంత్ శ్రీనివాస్ ప్రయత్నించిన తీరు ఆకట్టుకొంటుంది. అయితే స్క్రిప్టులో కొన్ని లోపాలను సవరించుకొంటే ఇంకా బెటర్ మూవీగా మారేదనిపిస్తుంది. రాజ్ గురు, పాపకు సంబంధించి ట్విస్టులు స్టోరీకి బలంగా మారాయని చెప్పవచ్చు.

ధీరగా (లక్ష్ చదలవాడ) మరోసారి నటుడిగా తనకు తాను ప్రూవ్ చేసుకొనేందుకు ప్రయత్నించారు. యాక్షన్, లవ్, రొమాంటిక్, ఎమోషనల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో ఒదిగిపోయాడు. గత చిత్రాలతో పోల్చుకొంటే అన్ని కోణాల్లో మెచ్యుర్డ్ ఫెర్పార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. మాస్ లుక్‌తో తనదైన శైలిలో మెప్పించారనే చెప్పాలి. నేహా పఠాన్, సోనియా గ్లామర్ పరంగా, నటనపరంగా ఆకట్టుకొన్నారు. హంసలేఖగా హిమజ, ఏసీపీ కర్ణగా భరణి శంకర్, రాజకీయ నేత కృష్ణమూర్తిగా సుమన్, అలెక్స్ పాత్రలో సమ్రాట్ రెడ్డి తమ పాత్రల పరిధి మేరకు రాణించారు.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సాయి కార్తీక్ మ్యూజిక్ బాగుంది. రీరికార్డింగ్ సినిమాలోని కొన్ని సీన్లను బాగా ఎలివేట్ చేసింది. కన్నా అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్, ఆర్ట్ విభాగాల పనితీరు బాగుంది. చదలవాడ ఫ్యామిలీ అందించిన నిర్మాణ విలువలు సినిమాను మరింత క్వాలిటీగా, రిచ్‌గా మార్చాయి. మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో లవ్ స్టోరీ, యాక్షన్‌గా సాగే సినిమాలను ఇష్టపడే వారికి ధీర తప్పకుండా నచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X