twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రకాష్ రాజ్ ’ధోనీ’ రివ్యూ...

    By Bojja Kumar
    |

    సంస్థ: డ్యూయెట్ మూవీస్
    నిర్మాత, కథ, దర్శకత్వం: ప్రకాష్ రాజ్
    సంగీతం: ఇళయరాజా
    సినిమాటో గ్రఫీ: కెవి గుహన్
    ఎడిటింగ్: కిషోర్
    లిరిక్స్: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
    తారాగాణం: ప్రకాష్ రాజ్, ముగ్దా గాడ్సే, ఆకాష్ పూరి, రాధిక ఆప్టే, నాజర్, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, మురళి శర్మ, గొల్లపూడి మారుతీరావు, హేమ, తలైవాసల్ విజయ్, శ్రీతేజ, కస్తూరి సుచి, ప్రభుదేవా(గెస్ట్ రోల్), మహేంద్ర సింగ్ ధోనీ(అతిథి పాత్ర)

    ఆకాశమంత సినిమా ద్వారా ఇప్పటికే సినీ నిర్మాతగా ప్రకాష్ రాజ్ తాజాగా 'ధోని' సినిమా ద్వారా తెలుగు, తమిళంలో ఒకే సారి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

    కథ: సుబ్రమణ్యం(ప్రకాష్ రాజ్) ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి. పిల్లలకు ఆస్తులు ఇవ్వక పోయినా వారి భవిష్యత్ బాగుండాలంటే మంచి చదువు చెప్పించాలని భావించే వ్యక్తి. పిల్లలను చదివించడానికి చాలా కష్ట పడుతుంటాడు. కూతురు కావేరి(శ్రీతేజ), కొడుకు కార్తీక్(ఆకాష్)లను మంచి స్కూల్లో చేర్పిస్తాడు. కార్తీక్ కు మాత్రం చదువుపై ఆసక్తి ఉండదు. మహేంద్ర సింగ్ ధోనీలా గొప్ప క్రికెటర్ కావాలని కలలు కంటుంటాడు. ఈ క్రమంలో పరీక్షల్లో ఫెయిల్ అవుతూ ఉంటాడు. క్రికెట్ టోర్నమెంటులో మేజర్ రోల్ పోషించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కార్తీక్ కు కోచ్ (నాజర్) ప్రోత్సాహం కూడా ఉంటుంది.

    అయితే తరచూ కార్తీక్ చదువులో ఫెయిల్ అవుతుండటంతో అతని తండ్రి సుబ్బును పిలిపించిన ప్రిన్సిపాల్ ఇలా అయితే స్కూల్ నుంచి తీసేస్తాం అని వార్నింగ్ ఇస్తాడు. దీంతో కార్తీక్ తో క్రికెట్ కోచింగ్ మాన్పించి ట్యూషన్లో చేర్పిస్తాడు సుబ్బు. అయినప్పటికీ కార్తీక్ పరీక్షల్లో ఫెయిల్ అవుతూ ఉండటంతో సహనం కోల్పోయిన సుబ్బు కొడుకుపై చేయి చేసుకుంటాడు. దీంతో కార్తీక్ తలకు బలమైన గాయం అవుతుంది. దీంతో సుబ్రహ్మణ్యాన్ని పోలీసులు అరెస్టు చేస్తారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? అనేది తెరపై చూడాల్సిందే.

    పెర్ఫార్మెన్స్: ప్రకాష్ రాజ్ తనదైన నటనా కౌశలంతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఆకాష్ పూరి అద్భుతంగా నటించాడు. రాధిక ఆప్టే, ముగ్దా గాడ్సే, గొల్లపూడి మారుతిరావు, తలైవాసల్ విజయ్, తదితరులు వారి వారి పాత్రల మేరకు రాణించారు. ప్రభుదేవా స్పెషల్ సాంగుతో ప్రేక్షకులను అలరించాడు. క్రికెటర్ ధోనీ ప్రత్యేక పాత్రలో కనిపించాడు. మురళి శర్మ, నాజర్ టీచర్, క్రికెట్ కోచ్ గా ముఖ్యమైన పాత్రల్లో బాగా నటించారు.

    టెక్నికల్ అంశాలు: ఇళయరాజా సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యమంగా మెలోడీ పాటలు బాగా ఆకట్టుకున్నాయి. పాట పూర్తయిన తర్వాత కూడా ప్రేక్షకుల నోటిలో హమ్మింగ్ కొనసాగుతుంది. కెవి గుహన్ కొరియోగ్రఫీ, కిషోర్ ఎడిటింగ్ చక్కగా ఉంది. నటుడిగానే కాదు, సినిమాకు కెప్టెన్‌గా దర్శకత్వ బాధ్యతలు నిర్వహించడంలోనూ ఎక్సలెంట్ అని నిరూపించాడు ప్రకాష్ రాజ్.

    మొత్తం మీద 'ధోనీ' సినిమా సగటు ప్రేక్షకుడిని ఎంటర్‌టైన్ చేస్తుంది. టిక్కెట్టుకు కోసం ఖర్చు పెట్టిన డబ్బులకు సంతృప్తిని పొందుతారు.

    English summary
    Many know Prakash Raj as a versatile artiste but a very few of them know that he is a passionate filmmaker, who loves to deliver good films. To his credit, he had earlier produced Abhiyum Nanum (Akasamantha in Telugu) and made his directorial debut in Kannada film industry by remaking it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X