ధూల్‌పేట ధూమ్‌ సగమే!

By Staff

Dhoolpet
సినిమా: ధూల్‌పేట
నటీనటులు: ధనుష్‌, స్నేహ, సోనీ అగర్వాల్‌ తదితరులు
సంగీతం: యవన్‌ శంకర్‌ రాజా
మాటలు: శశాంక వెన్నెలకంటి
కెమెరా: అరవింద్‌ కృష్ణ
పాటలు: భువనచంద్ర, మేడిశెట్టి
నిర్మాతలు: యన్‌.వి. ప్రసాద్‌, పారాస్‌జైన్‌, కె. మురళీధరన్‌,
వి. స్వామినాథన్‌, జి. వేణుగోపాల్‌
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీరాఘవ

మరో తమిళ దర్శకుడు తెలుగు తెరను పలకరించాడు. సెవెన్‌ బై జీ బృందావన్‌ కాలనీ ఘన విజయం తర్వాత తన తమ్ముడు ధనుష్‌ హీరోగా తమిళ, తెలుగు భాషల్లో శ్రీరాఘవ చేసిన ద్విభాషా చిత్రం ఇది. గాడ్‌ ఫాదర్‌, నాయకుడు, సత్య వంటి గ్యాంగస్టర్‌ చిత్రాల స్ఫూర్తితో తయారైన కథ ఇది. ఫస్టాఫ్‌ని తన ప్రతిభతో అద్భుతంగా చేసినా సెకండాఫ్‌ డాక్యుమెంటరీలా తయారు చేశాడు. దాంతో వినోదపు విలువలు తగ్గి విసుగుకు దారి తీసింది. దానికితోడు దారుణమైన హింసాత్మక దృశ్యాలను అడుగడుగునా పేర్చడం కొన్ని వర్గాలను అలరించినా పూర్తి స్థాయి ప్రేక్షకులను సంతృప్తిపరచడం కష్టం.

కుమార్‌ (ధనుష్‌) తల్లి అతని తండ్రి చేతిలో హత్యకు గురవుతుంది. దాంతో ఇంట్లోంచి పారిపోయిన కుమార్‌ కొంత కాలం బిచ్చగాడిగా బతుకు వెళ్లదీస్తాడు. అనుకోని స్థితిలో గంజాయి అమ్మే వారితో పోలీసులకు చిక్కుతాడు. ఒళ్లు హూనం అయ్యేలా లాఠీదెబ్బలు తిని ధూల్‌పేట గంజాయి గ్రూప్‌ నాయకుడు శంభు సానుభూతి సంపాదిస్తాడు. అతని గ్రూప్‌లో చేరుతాడు. అక్కడే వేశ్య కృష్ణవేణి (స్నేహ)తో పరిచయం ప్రేమగా మారుతుంది. పెళ్లి చేయనన్న శంభూను చంపి ధూల్‌పేట దందా సంపాదిస్తాడు. ఆమెను పెళ్లాడుతాడు. రామకృష్ణా రెడ్డి అనే రాజకీయ నాయకుడు ఈ గ్రూప్‌లను మెయింటెన్‌ చేస్తుంటాడు. అతని కూతుర్ని పోర్నో వీడియో గొడవ నుంచి కాపాడి అతని ప్రాపకం సంపాదిస్తాడు కుమార్‌. అలా ఎదుగుతూ తన అనుచరుడు చెల్లె శ్రావణి (సోనీ అగర్వాల్‌) బలవంతంగా రెండో పెళ్లి చేసుకుంటాడు. దాంతో అతని అనుచరుడు కుమార్‌పై కక్ష గడతాడు. మరో పక్క సిటీలో ఉన్న మూర్తికి చెందిన గ్రూప్‌ మనుషులు అతన్ని చంపడానికి తిరుగుతూ వుంటారు. అలా అతని పతనం ప్రారంభమై దేనికి దారి తీస్తుందనేది తెరపై చూడాల్సిందే.

స్టోరీలైన్‌కు సరిపడని కథ ఇది. కుమార్‌ ధూల్‌పేట దాదాగా ఎదిగాడో ఎలా పతనమయ్యాడు అనేది ముఖ్యాంశమైనా కత్తి పట్టినవాడు ఆ కత్తికే బలి అవుతాడనే అండర్‌ కరెంట్‌ సందేశాన్ని అందించడం అభినందనీయం. తెలుగు స్ట్రెయిట్‌ సినిమాల్లో ఆ స్ఫూర్తి కొరవడింది. గూండాలు, దాదాలను హీరోలుగా హైప్‌ చేస్తే యువతను తప్పు దారి పట్టిస్తుందనే విషయం తెలిసిందే. ఇక స్క్రీన్‌ప్లే ఫ్లాష్‌బ్యాక్‌ నెరేషన్‌లో చేశారు. కానీ ఫస్టాప్‌ కథ ఇంటర్వెల్‌కే ఒక కొలిక్కి వచ్చేసింది. ఛత్రపతి లాగానే ఇంటర్వెల్‌ సమయానికే హీరో డాన్‌గా మారటంతో మిగతా సగం సరైన సంఘర్షణ కొరవడింది. హీరో పాత్ర పూర్తి పాసివ్‌గా మారింది. దాంతో ఫస్టాఫ్‌ ముందు సెకండాఫ్‌ తేలిపోయింది. తల్లి సెంటిమెంట్‌ నేపథ్యంతో మొదలైన ఈ కథ అప్పటికే పెళ్లయి వున్నా రెండో హీరోయిన్‌ను బలవంతంగా వివాహం ఆడడం నెగెటివ్‌ టచ్‌ వచ్చి పాత్ర ఔన్నత్యం కోల్పోయింది. దర్శకత్వ పరంగా ప్రథమార్థం పోయెటిక్‌ టచ్‌తో నడిపిన తీరు, లైటింగ్‌ స్కీమ్‌ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ధనుష్‌ అభినందించాల్సిన మంచి నటన ప్రదర్శించాడు. ఓవర్‌ కాకుండా పాత్రలో లీనమై జీవించాడు. స్నేహ పరిధి మేరకు సీన్లను పండించింది. ఎడిటింగ్‌, కెమెరా ఈ చిత్రానికి ఆయువుపట్లు. పాటలు ఒకటి రెండు మాత్రమే బాగున్నాయి. సెకండాఫ్‌ని అన్ని చిత్రాల్లాగే ట్రిమ్‌ చేస్తే భరించే అవకాశం ఉంది. మెయిన్‌ టార్గెట్‌ అయిన బిసి సెంటర్లు సెకండాఫ్‌ సమస్యను అధిగమిస్తాయా అనేది సందేహమే.

గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X