Dhoom Dhaam Movie Review; ధూమ్ ధామ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating: 2.75/5

నటీనటులు: చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్, సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ, సాయి శ్రీనివాస్, ప్రవీణ్, నవీన్ నేని, గిరిధర్, భద్రమ్ తదితరులు

డైలాగ్స్: ప్రవీణ్ వర్మ
కొరియోగ్రఫీ: విజయ్ బిన్ని, భాను
లిరిక్స్: సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి
ఫైట్స్: రియల్ సతీష్
పబ్లిసిటీ డిజైనర్స్: అనిల్, భాను
ఆర్ట్ డైరెక్టర్: రఘు కులకర్ణి
ఎడిటింగ్: అమర్ రెడ్డి కుడుముల
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ రామస్వామి
మ్యూజిక్: గోపీ సుందర్
స్టోరీ స్క్రీన్ ప్లే: గోపీ మోహన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శివ కుమార్
పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా(సురేష్: శ్రీనివాస్)
ప్రొడ్యూసర్: ఎంఎస్ రామ్ కుమార్
డైరెక్టర్: సాయి కిషోర్ మచ్చా

కార్తీక్ (చేతన్ కృష్ణ) జల్సాగా ఫ్రెండ్స్ కలిసి లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు. సుహానా(హెబ్బా పటేల్)ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు. మనసులో ప్రేమ ఉన్నా సుహానా లవ్‌ చేయడానికి నిరాకరిస్తుంది. కానీ పొలెండ్‌కు జాలీ ట్రిప్‌కు వెళ్లిన కార్తీక్‌కు సుహానా కూడా జతకలుస్తుంది. అయితే తన ప్రేమను అంగీకరించడానికి ఓ పరీక్ష పెట్టిందనే కారణంతో సుహానాకు కార్తీక్ బ్రేకప్ చెప్పి.. మరో యువతితో నిశ్చితార్థానికి సిద్దమవుతాడు. అయితే పొలెండ్ అమ్మాయితో కూడా కార్తీక్ ఎంగేజ్‌మెంట్ చేసుకోకుండానే బ్రేకప్ అవుతుంది. ఆ తర్వాత తమ మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించుకొని కార్తీక్, సుహానా ఒక్కటవుదామని అనుకొంటారు. కానీ వారి ప్రేమకు కార్తీక్ తండ్రి (సాయికుమార్)పై పాత పగ కారణంగా సుహానా నాన్న, పెద్దనాన్నలు (వినయ్ వర్మ, బెనర్జీ) అడ్డుగా నిలుస్తారు.

తొలుత కార్తీక్ ప్రేమను సుహానా ఎందుకు నిరాకరించింది? పొలెండ్‌లో కుదిరిన సంబంధాన్ని కార్తీక్ ఎందుకు బ్రేకప్ చేసుకొంటాడు? హెబ్బా గురించి కార్తీక్ ఏం తెలుసుకొని ఆమె ప్రేమను అంగీకరిస్తాడు? కార్తీక్ తండ్రిపై సుహానా ఫాదర్‌కు ఉన్న పాత పగ ఏంటి? ఇక కార్తీక్ ఫ్రెండ్స్ (ప్రవీణ్, నవీన్)పై సుహానా పెదనాన్నలకు ఎందుకు కోపం ఉంది? ఇలాంటి ప్రతికూల పరిస్థితులను సానుకూలంగా మార్చుకొని కార్తీక్, సుహానాలు తమ పెళ్లికి మార్గం సుగమం చేసుకొన్నారనే ప్రశ్నలకు సమాధానమే ధూం ధాం సినిమా కథ.

Dhoom Dhaam Movie Review in Telugu  Hebbah Patel  Chetan Krishna lovely chemistry With Vennela Kishore comedy

దర్శకుడు సాయి కిషోర్ మచ్చా తన సినిమాకు పాత కథనే ఎంచుకొని కొత్తగా ఇచ్చిన ట్రీట్‌మెంట్ బాగుంది. ప్రేమ కథ రొటీన్‌గా ఉన్న కొత్తగా రాగోసుకొన్న సీన్లు, ఆ కథ మూడ్‌ను ఎలివేట్ చేసుకొనేందుకు వాడుకొన్న లోకేషన్లు కొత్తదనం తెచ్చిపెట్టాయి. ఇక సెకండాఫ్‌లో వెన్నెల కిషోర్ క్యారెక్టర్‌ను పరిచయం చేసి నవ్వుల నావపై ప్రయాణించేలా చేశాడు. సెకండాఫ్‌లో వెన్నెల కిషోర్ తన డైలాగ్స్, యాక్టింగ్, ఫన్‌తో నవ్వులు పూయించాడు. క్లీన్ కామెడీతో ఆద్యంత సినిమాకు సగం బలంగా నిలిచాడు. అయితే సాయి కిషోర్ అనుసరించిన కామెడీ ట్రాక్ బాగా వర్కవుట్ అయింది. పలు రకాల క్యారెక్టరతో ఈవీవీ, శ్రీను వైట్ల సినిమాలను గుర్తుకు చేశాడనిపిస్తుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే.. చేతన్ కృష్ణ తొలి పరిచయం ద్వారా ఆకట్టుకొనే ప్రయత్నం చేశాడు. కొత్త హీరోకు ఉండే కొన్ని లోపాలను అధిగమించాడనే చెప్పాలి. నూతన పరిచయమనే ఫీలింగ్ రాకుండా.. ఫస్ట్ సినిమాలో ఉండే బెరుకును కనిపించకుండా చాలా జాగ్రత్తలు పడ్డాడు. లుక్ వైజ్, యాక్టింగ్ వైజ్ ఫర్వాలేదు. నటనపరంగా, ఈజ్ పరంగా తన ప్రతిభకు మెరుగు పెట్టుకొంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి హీరో అవుతాడనే ఫీలింగ్‌ను తన సినిమా ద్వారా కల్పించాడు. ఇక హెబ్బా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె ఇప్పటికే ఎన్నో హిట్ సినిమాల్లో గ్లామర్ కాకుండా పెర్ఫార్మెన్స్ రుచిని చూపించింది. కొత్త హీరోతో కలిసి మంచి కెమిస్ట్రీని పండించింది. కేవలం అందచందాలకే పరిమితం కాకుండా కొంత సినిమా భారాన్ని కూడా తన భుజాల మీద మోసాననే ఫీలింగ్ కలిగించింది.

Dhoom Dhaam Movie Review in Telugu  Hebbah Patel  Chetan Krishna lovely chemistry With Vennela Kishore comedy

ఇక సెకండాఫ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుల, కమెడియన్లదే హావా ఈ సినిమాలో కనిపిస్తుంది. వెన్నెల కిషోర్ చెలరేగిపోతే.. ప్రవీణ్,నవీన్ ఆయనకు తోడుగా నిలిచారు. ఇక శ్రీనివాసరావు, బెనర్జీ, గోపరాజు రమణ, వినయ్ వర్మ సీరియస్ పాత్రలతో కామెడీని జనరేట్ చేసి నవ్వించారు. ఈ సినిమాలో నటించిన రతిక రోజ్, యాంకర్ హర్షిణి, ఇతర నటీనటులు ప్రతీ ఒక్కరు తమ పాత్రల పరిధి మేరకు పూర్తిగా న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. ఈ సినిమాకు గోపి సుందర్, సిద్దార్థ్ రామస్వామి, గోపి మోహన్, ప్రవీణ్ వర్మ పనితీరు ప్లస్ పాయింట్. పొలెండ్ ఎపిసోడ్, అలాగే సెకండాఫ్‌లో పెళ్లి ఎపిసోడ్‌ను చాలా రిచ్‌గా తెరకెక్కించడంలో సిద్దార్థ్ తన ప్రతిభను చూపించాడు. అలాగే గోపి సుందర్ పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఫ్రెష్‌నెస్‌ను తెచ్చిపెట్టింది. అమర్ రెడ్డి ఎడిటింగ్ బాగుంది, శాస్త్రి గారి సాహిత్యంతో పాటలు మెలోడిగా మారాయి. ఇక ఎంఎస్ రామ్ కుమార్ అనుసరించిన నిర్మాణం సినిమా చాలా రిచ్‌గా అనిపించింది. క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా సినిమాను మంచి ఫీల్‌గుడ్ సినిమాగా రూపొందించారు. తన కుమారుడిపై ప్రేమ కాకుండా సినిమాపై తనకు ఉండే అభిరుచిని రామ్ కుమార్ చూపించుకొన్నారనిస్తుంది.

Dhoom Dhaam Movie Review in Telugu  Hebbah Patel  Chetan Krishna lovely chemistry With Vennela Kishore comedy

ధూమ్ ధామ్ సినిమా విషయానికి వస్తే.. పాత కథను కొత్తగా ప్రజెంట్ చేశారని చెప్పాలి. కానీ కథ, కథనాల్లో ఉండే స్పీడ్, సన్నివేశాల్లో ఉండే రొమాన్స్, లవ్, కామెడీ మూవీని ఫ్రెష్‌గా కనిపించేలా చేశాయి. సాయి కుమార్ మచ్చా దర్శకత్వం, గోపి మోహన్ స్క్రీన్ ప్లే ఫార్మూలా తెలుగు ఆడియెన్స్ నచ్చేలా ఉంటుంది. రెండు గంటలపాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా నవ్వుకునే అంశాలు ఉన్నాయి. కొత్తదనం, వెరైటీ సినిమాల కోరుకొనే వారిని పక్కన పెడితే.. రెగ్యులర్ ఆడియెన్స్ ఈ సినిమా నచ్చేలా ఉంటుంది. ఫన్, కామెడీని చూడాలనే వారు ధూమ్ ధామ్ సినిమాపై ఈ వారం థియేటర్‌లో ఓ కన్నేయండి.

More from Filmibeat

Read more about: dhoom dhaam hebbah patel
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X