Dhootha Review షాకింగ్ ట్విస్టులతో సాగే సస్సెన్స్ థ్రిల్లర్.. దూత వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

Rating:
3.0/5

నటీనటులు: నాగచైతన్య అక్కినేని, పార్వతి తిరువోతు, ప్రాచీ దేశాయ్, ప్రియా భవానీ శంకర్, పశుపతి, రోహిణి, తరుణ్ భాస్కర్ దాస్యం, రవీంద్ర విజయ్, తనికెళ్ల భరణి, అనీష్ కురువిల్లా, జయప్రకాశ్ తదితరులు
దర్శకత్వం: విక్రమ్ కే కుమార్
నిర్మాత:శరత్ మరార్, విక్రమ్ కే కుమార్
మ్యూజిక్: ఇషాన్ చాబ్రా
రిలీజ్ డేట్: 2023-11-30

యువ పారిశ్రామిక వేత్త సాగర్ వర్మ (నాగచైతన్య అక్కినేని) ఓ పత్రిక యజమాని. తన పత్రికను ప్రారంభించిన రోజే సాగర్ జీవితంలో ఊహించని సంఘటనలు చోటు చేసుకోవడం మొదలవుతాయి. పత్రిక ఆరంభమైన రోజు భారీ వర్షంలో తన భార్య ప్రియ (ప్రియా భవానీ శంకర్), కూతురుతో కలిసి ఇంటికి వెళ్తుండగా పెట్రోల్ అయిపోవడంతో రోడ్డుపై కారు ఆగిపోతుంది. అంతలోనే ఓ లారీ వచ్చి ఢీకొట్టడంతో తాను ప్రాణంగా పెంచుకొన్న పెంపుడు కుక్క మరణిస్తుంది. అయితే యాక్సిడెంట్‌కు ముందు ఓ పత్రికలో వచ్చిన పజిల్ చదువుతుండగా తన కుక్క మరణం గురించిన ఓ ప్రశ్న షాక్ గురిచేస్తుంది.

 Dhootha Web Series Review

తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా న్యూస్ పేపర్‌ను సాగర్ వర్మ ఎందుకు ప్రారంభించాలనుకొన్నాడు? సాగర్ వర్మకు న్యూస్ పేపర్ పజిల్స్‌కు సంబంధం ఏమిటి? న్యూస్ పేపర్‌లో వచ్చే పజిల్స్‌లో భవిష్యత్‌లో జరుగబోయే విషయాలు తెలిసినప్పుడు ఎలాంటి ఫీలింగ్‌కు సాగర్ వర్మ లోనయ్యాడు. న్యూస్ పేపర్ బిజినెస్‌కు ఛార్లెస్‌ (శ్రీకాంత్ మురళి)ను ఎందుకు దూరం ఉంచాడు? ఛార్లెస్‌కు ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే దూత వెబ్ సిరీస్‌ కథ.

దర్శకుడు విక్రమ్ కే కుమార్ రాసిన కథ, కథనాలు చాలా గ్రిప్పింగ్‌గా ఉన్నాయి. తొలి ఎపిసోడ్‌లోనే వెబ్ సిరీస్‌పై ఆసక్తిని కలిగించేలా ఉన్నాయి. ట్విస్టులతో కథలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్లిన విధానం బాగుంది. థ్రిల్లింగ్ అంశాలు, సస్సెన్స్‌ను కొనసాగించిన విధానం వల్లే ఫర్‌ఫెక్ట్ సిరీస్‌గా మార్చింది. ప్రతీ ఎపిసోడ్‌ నుంచి మరో ఎపిసోడ్‌కు తీసుకెళ్లిన దర్శకుడి ప్రతిభకు అద్దం పట్టింది.

సాగర్ వర్మ పాత్రలో యువ పారిశ్రామిక వేత్తగా నాగచైతన్య నటించిన తీరు బాగుంది. కొత్త గెటప్, సరికొత్త పాత్రలో విభిన్నంగా కనిపించారు. ఇంతకు ముందు ఎన్నడూ కనిపించని బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకొన్నాడు. ఎమోషనల్ సీన్లలో పరిణతితో కూడిన ఫెర్ఫార్మెన్స్‌తో మెప్పించే ప్రయత్నం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X