Dhurandhar 2 Celebrity Review: ధురంధర్ 2పై హీరోయిన్ ఫస్ట్ రివ్యూ .. రణ్‌వీర్ మూవీ హిట్టా? ఫట్టా?
ఆదిత్య ధార్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై, యాక్షన్ మూవీ ధురంధర్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా 1300 కోట్లకు పైగా వసూళ్లతో అత్యధిక కలెక్షన్స్ సాధించిన భారతీయ చిత్రాల్లో 4వ స్థానంలో నిలిచింది. ఈ సినిమా థియేటర్స్‌లో ఉండగానే.. ధురంధర్ 2 రిలీజ్ ఎప్పుడో కూడా చిత్ర యూనిట్ ప్రకటించింది. 2026 మార్చి 19న రణ్‌వీర్ సింగ్ మూవీకి సీక్వెన్స్ రిలీజ్ అవుతుందని తెలిపారు.
దాంతో బాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ సైతం ధురంధర్ 2 కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఫస్ట్ పార్ట్‌లో సమాధానాలు దొరకని అనేక ప్రశ్నలకు దర్శకుడు సెకండ్ పార్ట్‌లో ఆన్సర్ ఇచ్చే అవకాశం ఉంది. భారీ అంచనాల నేపథ్యంలో ధురంధర్ 2 చిత్రం తొలిరోజున భారీ ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ధురంధర్ 2 ఎలా ఉండబోతోంది అనే దానిపై సోషల్ మీడియాలో ఎవరికి తోచిన అభిప్రాయాలు వారు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో రణ్‌వీర్ సింగ్ మూవీపై స్టార్ హీరోయిన్ ఒకరు రివ్యూ ఇచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే..

ధురంధర్ 2 తారాగణం
ధురంధర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి ధురంధర్ : ది రివెంజ్ అనే టైటిల్ ఖరారు చేశారు. జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్‌పై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండేలు సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్‌లు హీరో హీరోయిన్‌లుగా నటించారు. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, రాకేష్ బేడీ, సౌమ్య టాండన్, గౌరవ్ గెరా, మానవ్ గోహిల్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. వికాస్ నౌలఖ సినిమాటోగ్రాఫర్‌గా, శివకుమార్ వి పానికర్ ఎడిటర్‌గా సేవలందించారు. శాశ్వత్ సచ్‌దేవ్ సంగీత దర్శకత్వం వహించారు. తొలి భాగం కేవలం ఒక్క హిందీలో మాత్రమే విడుదల కాగా.. సెకండ్ పార్ట్ విషయంలో అలాంటి తప్పు చేయకుండా తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ధురంధర్ 2 వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది.
దురంధర్ 2 బడ్జెట్ ఎంత?
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి ధురంధర్ 2 మూవీకి 475 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు (మొదటి భాగంతో కలిపి) బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలోనూ సరికొత్త రికార్డులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ధురంధర్ 2 డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 150 కోట్ల రూపాయలు వెచ్చించి దక్కించుకున్నట్లుగా బాలీవుడ్ టాక్. అలాగే శాటిలైట్ రైట్స్ 50 కోట్ల రూపాయలకు, మ్యూజిక్ రైట్స్ 45 కోట్ల రూపాయల మేర మొత్తంగా ఈ చిత్రం ఇప్పటి వరకు 250 కోట్ల రూపాయల నాన్ థియేట్రికల్ బిజినెస్ చేసినట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. రిలీజ్ నాటికి ధురంధర్: ది రివెంజ్ మూవీ థియేట్రికల్ బిజినెస్ వివరాలు బయటకు రానున్నాయి.
దురంధర్ 2పై హీరోయిన్ రివ్యూ
భారత్ సమ్మిట్ 2026లో పాల్గన్న దర్శకుడు ఆదిత్య ధార్ సతీమణి, హీరోయిన్ యామీ గౌతమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఇప్పటికే సినిమా చూశాను, ఈ సందర్భంగా చెప్పేది ఒక్కటే.. ఇక్కడ భావోద్వేగానికి గురైతే బాగోదు కానీ ఈ చిత్రం అసాధారణం. ఆరోజు విమానంలో ప్రయాణిస్తుండటం వల్ల నా భర్తతో ఏం చెప్పలేకపోయాను. కేవలం బై మాత్రమే చెప్పాను. విమానంలో ప్రయాణిస్తూ.. ఏదో చూడాలనుకున్నా, ఏమీ చూడలేకపోయా, కిటికీలోంచి చూస్తుండగా అది అందమైన సూర్యాస్తమయం అని యామీ గౌతమ్ గుర్తుచేసుకున్నారు.
విమానం ఎప్పుడు ల్యాండ్ అవుతుంది. ఎయిరో ప్లేన్ మోడ్‌ని ఎప్పుడు ఆఫ్ చేసి ఆదిత్యకు ఫోన్ చేయాలని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నా. ధురంధర్ 2లో నేను ఏం చూశానో, ఏం ఫీలయ్యానో నా భర్తకు ఏం చెప్పాలో ఆలోచిస్తున్నాను. సినిమాపై నాది ఫలానా అభిప్రాయం చెప్పాలనుకున్నా. ఆదిత్య తన ప్రేక్షకులను, ఈ దేశాన్ని ఎప్పటికీ ప్రేమిస్తాడు. ధురంధర్‌ను తెరకెక్కించేందుకు ఆదిత్య ఎంతో కష్టపడ్డారు. నిజానికి ఆర్టికల్ 370 షూటింగ్‌లో ఉన్నప్పుడే 40 పేజీల ధురంధర్ స్క్రిప్ట్‌ను చదివా. అది చదువుతున్నంత సేపు నా కళ్లు చెమర్చాయి. నా కన్నీటిని బట్టే నా స్పందన ఏంటో ఆదిత్య గ్రహించేశారు. ధురంధర్ ఖచ్చితంగా చరిత్ర సృష్టిస్తుందని అప్పుడే ఊహించా. ఈ సినిమాను ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోలేదు. ప్రతి భారతీయుడి మనసు ఉప్పొంగుతుంది, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గర్వపడతారు. ధురంధర్ 2 అంతకుమించి అనేలా ఉంటుందని అని యామిని తెలిపారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ధురంధర్ 2పై ఇప్పటికే ఉన్న అంచనాలను యామీ గౌతమ్ వ్యాఖ్యలు మరింత పెంచేశాయి.


Click it and Unblock the Notifications











