Dhurandhar 2 Censor Review Report: ధురంధర్ 2 సెన్సార్ రివ్యూ రిపోర్ట్.. రన్‌టైమ్ ఎంత? సర్టిఫికెట్ ఏమిటి అంటే?
బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ నటించిన తాజా భారీ బడ్జెట్ చిత్రం దురంధర్. ఈ సినిమాకు ఆదిత్య ధార్ రచన, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. యాక్షన్, స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు.
ఈ చిత్రానికి వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకొన్న ఈ చిత్రం డిసెంబర్ 5వ తేదీ 2025 రోజున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా రెండో భాగం మార్చి 19వ తేదీన మరోసారి సెన్సషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నది.

ధురంధర్ 2 మూవీ కథ విషయానికి వస్తే.. రెహ్మాన్ డెకాయిట్ డామినేషన్ తగ్గిన తర్వాత కరాచీని హమ్జా ఆలీ మజారీ ఎలా హస్తగతం చేసుకొన్నాడు? కరాచీ, ఇతర ప్రాంతాల్లో ఆయుధ విక్రయాల మాఫియాను, ఐఎస్ఐ గ్రూపులను ఎలా దెబ్బ తీశాడు. కరాచీ సామ్రాజ్యాన్ని తన కనుసైగలతో ఎలా కంట్రోల్ చేశాడు అనే విధంగా రణ్‌వీర్ సింగ్ పాత్రను అత్యంత పవర్‌ఫుల్‌గా చూపించే ప్రయత్నం చేసినట్టు టీజర్‌లో కనిపించింది. ఇక ఈ టీజర్‌లో యలీనా జమాలీ (సారా అర్జున్) పాత్రను కనిపించకుండా దాచి పెట్టారు. ఎస్పీ చౌదరీ (సంజయ్ దత్), అజయ్ సన్యాల్ (ఆర్ మాధవన్) పాత్రలు కీలకంగా కనిపించబోతున్నాయి.
అయితే ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్నది. ఈ చిత్రాన్ని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెన్సార్ బోర్డు (CBFC) రివ్యూ చేసింది. అయితే ఈ సినిమాకు ఫైనల్‌గా యూఏ (UA16+) సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ సర్టిఫికెట్ ప్రకారం.. 16 ఏళ్లకు పైబడిన ప్రేక్షకులు నిరభ్యంతరంగా మూవీని చూడొచ్చు. అంతకు తక్కువ వయసు ఉన్న వారు తల్లిదండ్రుల మార్గదర్శకత్వంలో చూడాల్సి ఉంటుంది అని సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది.
ధురంధర్ సినిమా నిడివి విషయానికి వస్తే.. ఈ చిత్రం రన్ టైమ్ అప్పట్లో భారీ చర్చకు దారి తీసింది. ధురంధర్ పార్ట్ 1 మూవీ నిడివి 3 గంటల 35 నిమిషాలు. ఈ సినిమా నిడివిపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ సినిమాను ప్రేక్షకుల బ్రహ్మండంగా ఆదరించి 1400 కోట్ల రూపాయల కలెక్షన్లను అందించారు.
ఇక ధురంధర్ 2 సినిమా నిడివి ఎంత ఉండబోతుందనే ప్రేక్షకుల ఆసక్తికి చిత్ర యూనిట్ తెర దించింది. ఈ సినిమా రన్‌టైమ్‌ను 3 గంటల 28 నిమిషాలుగా ఫిక్స్ చేశారు. అంటే 208 నిమిషాలు రన్‌టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ఏ విధంగా ఆదరిస్తారో అనే విషయాన్ని వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉండగా, భారీ అంచనాలతో వస్తున్న ధురంధర్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ పోటీకి తెర లేపింది. రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ చిత్రం కూడా మార్చి 19వ తేదీనే రానున్నది. దాంతో ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా లెవెల్‌లో సెన్సేషనల్ వార్‌కు రెడీ అవుతున్నాయి. ఈ రెండు సినిమాల పోటీలో ఏ చిత్రం పై చేయి సాధిస్తుందనే విషయం ప్రేక్షకుల్లోను, సినీ వర్గాల్లోను ఆసక్తిని రేపుతున్నది.


Click it and Unblock the Notifications











