Rajamouli Review on Dhurandhar 2: ధురంధర్ 2 మూవీపై రాజమౌళి రివ్యూ

బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన ధురంధర్ 2 చిత్రం రికార్డు విజయం వైపు దూసుకెళ్తున్నది. రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ నటించిన చిత్రం ధురంధర్ ది రివెంజ్ సాధారణ ప్రేక్షకులను మాత్రమే కాకుండా సినీ ప్రముఖులను ఆకట్టుకొంటున్నది. యాక్షన్, స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు.

ఈ చిత్రానికి వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ధురంధర్ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమా రెండో భాగం మార్చి 19వ ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజైంది. ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్, రాంచరణ్ లాంటి హీరోలు ఈ సినిమాపై ప్రశంసలు గుప్పించారు. ఇక ఈ సినిమాపై దర్శక ధీరుడు రాజమౌళి ట్విట్టర్‌లో తన రివ్యూను పోస్ట్ చేశారు. ఆయన వెల్లడించిన విషయాల్లోకి వెళితే..

Dhurandhar 2 Review by SS Rajamouli

ధురంధర్ 1 సినిమాను చూసి చాలా ఇష్టపడ్డాను. అయితే ధురంధర్ ది రివెంజ్ చిత్రం కథపరంగా, స్కేల్ పరంగా దానిని బీట్ చేసింది. ఈ సినిమా విషయంలో రైటింగ్, నటీనటుల ఎంపిక, టెక్నికల్ ఎగ్జిక్యూషన్, మ్యూజిక్, స్టోరీ వరల్డ్‌ను డిజైన్ చేసిన తీరు, డైరెక్షన్ లాంటి అంశాల్లో ఎక్కడా చిన్న లోపం లేకుండా తెరకెక్కించారు. ఎమోషనల్ కంటెంట్‌ను కూడా బాగా జొప్పించారు అని రాజమౌళి తన రివ్యూలో వెల్లడించారు.

కథలో ట్విస్టులను వెల్లడిస్తూ ఎమోషన్స్‌త టెన్షన్ క్రియేట్ చేసిన తీరు బాగుంది. ఆదిత్య ధార్ కొట్టిన బంతి స్టేడియం దాటి పార్కులో పడింది. నాలుగు గంటలపాటు సినిమా తీసి రిలీజ్ చేయాలంటే నిజంగా గట్స్ ఉండాలి. చివరి ఫ్రేమ్ వరకు ఆడియెన్స్ సీట్లకు అతుక్కుపోయి చూస్తున్నారు అని ఆయన తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

ఈ సినిమాలో హమ్జా పాత్రను పోషించిన రణ్‌వీర్ సింగ్ పెర్ఫార్మెన్స్‌పై ప్రశంసలు గుప్పించారు. మీ నటన అద్బుతంగా ఉంది. సోదరితో కలిసి ఉన్న సీక్వెన్స్‌లో నీ యాక్టింగ్ మాస్టర్ క్లాస్. జస్క్రిత్, హమ్జా పాత్రల్లో తొలి సీన్ నుంచి గుండెను పిండేసే క్లైమాక్స్ వరకు నీవు నటనతో మైమరిపించావు అంటూ జక్కన్న ఆశాకానికి ఎత్తేశాడు.

ఆర్ మాధవన్ యాక్టింగ్‌పై కూడా రాజమౌళి ప్రశంసించారు. దేశ ప్రజల చేతగానీ తనాన్ని, ప్రస్టేషన్‌ను నీ పాత్ర ద్వారా ప్రతిబింబించావు. నా పాత్ర ద్వారా మేము విజయం సాధించామని ఫీలయ్యాం. ఇలాంటి గొప్ప సినిమాను అందించిన చిత్ర యూనిట్‌కు, భారీ సక్సెస్ అందుకొంటున్న వారికి నా కంగ్రాట్యులేషన్స్ అంటూ రాజమౌళి ఈ సినిమా గురించి తన అభిప్రాయాలను పంచుకొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X