Dhurandhar Movie Critic Review and Rating: దురంధర్ మూవీ క్రిటిక్ రివ్యూ అండ్ రేటింగ్
బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ నటించిన తాజా భారీ బడ్జెట్ చిత్రం దురంధర్. ఈ సినిమాకు ఆదిత్య ధార్ రచన, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. యాక్షన్, స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకొన్న ఈ చిత్రం డిసెంబర్ 5వ తేదీ 2025 రోజున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు ఇటీవల దుబాయ్‌లో ముగిసాయి. ఈ సందర్భంగా మూవీని చూసిన దుబాయ్ క్రిటిక్ ఈ మూవీపై తన రివ్యూను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేశారు. ఈ మూవీ గురించి ఆయన వెల్లడించిన అభిప్రాయం ఏమిటంటంటే?

దురంధర్ సినిమా కథ విషయానికి వస్తే.. 1999 సంవత్సరంలో IC 814 ఫ్లయిట్ హైజాకింగ్ ఘటన, పార్లమెంట్‌పై దాడి సంఘటన తర్వాత.. భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ పాకిస్థాన్‌లోని టెర్రరిస్ట్ నెట్‌వర్క్‌ను విచ్చిన్నం, విధ్వంసం చేయాలని, అలాగే కరాచీలోని అండర్ వరల్డ్ మాఫియాను దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తారు. అజయ్ సన్యాల్ ప్లాన్ వర్కవుట్ అయిందా? పాక్ టెర్రిరస్ట్ స్థావరాలను దెబ్బ తీశాడా? అనే ప్రశ్నలకు సమాధానమే దురంధర్ మూవీ కథ.
దురంధర్ సినిమా గురించి క్రిటిక్ ఉమేర్ సంధూ తన సోషల్ మీడియాలో రివ్యూ చేస్తూ.. ఈ చిత్రం అవుటాఫ్ సిలబస్. పవర్‌ఫుల్‌గా పవర్ ప్యాక్డ్‌గా సినిమాను రూపొందించారు. తూటాల్లా పేలే డైలాగ్స్‌తో మూడు గంటలకుపైగా ఫుల్ బ్లాస్టింగ్‌లా సినిమా సాగుతుంది. యాక్షన్ సీన్లు మాస్‌గా, రెగ్యులర్‌గా ఉంటాయి. కానీ స్క్రీన్ ప్లే ఎంగేజింగ్‌గా ఉంటుంది అని ఉమేర్ సంధూ తన రివ్యూలో పేర్కోన్నాడు
దురంధర్ సినిమాకు ముందు ఫ్లాపులు ఎదుర్కొంటున్న రణ్‌వీర్ సింగ్ ఈ సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వడం గ్యారెంటీ. ఈ సినిమాలో నటించిన అండర్ రేటేడ్ యాక్టర్లందరూ బాగా నటించారు. ముఖ్యంగా సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, రెహ్మాన్ డెకాయిట్ లాంటి బాగా పెర్ఫార్మ్ చేశారు. ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ హై రేంజ్‌లో ఉన్నాయి. ఈ సినిమా క్వాలిటీని అందరూ అప్రిషియేట్ చేస్తారు అని ఉమేర్ తెలిపాడు.
సినిమా చివరి 30 నిమిషాలతోపాటు క్లైమాక్స్ మీకు షాక్ కలిగిస్తుంది. క్లైమాక్సే ఈ సినిమాకు ప్రధాన బలంగా కనిపిస్తుంది. ఈ సినిమా ఫుల్ మాస్ సినిమా. తేరే ఇష్క్ మే సినిమా తర్వాత బాలీవుడ్‌కు మరో హిట్ పడటం ఖాయం. ఈ సినిమాను థియేటర్‌లోనే చూడాలి. ఈ సినిమాకు నా రేటింగ్ 5 పాయింట్లకు గాను 4 రేటింగ్ అని ఉమేర్ సంధూ తన రివ్యూలో పేర్కొన్నాడు.


Click it and Unblock the Notifications











