Dhurandhar Movie Twitter Review: దురంధర్ ట్విట్టర్ రివ్యూ
జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మిస్తోన్న చిత్రం దురంధర్. బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తున్నారు. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ, సౌమ్య టాండన్, నవీన్ కౌశీక్, మానవ్ గోహిల్, క్రిస్టల్ డిసౌజా తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. యాక్షన్, స్పై థ్రిల్లర్‌గా దురంధర్ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు.
రణవీర్ సింగ్ లుక్, గెటప్, టీజర్, ట్రైలర్లు, ప్రమోషనల్ కార్యక్రమాలతో దురంధర్ సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. డిసెంబర్ 5వ తేదీన దురంధర్ మూవీ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన పెయిడ్ ప్రీమియర్లు డిసెంబర్ 4వ తేదీ రాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో నెటిజన్లు, క్రిటిక్స్, సినీ ప్రమఖుల అభిప్రాయాల్లోకి వెళితే...

దురంధర్ పూర్తిగా రణవీర్ సింగ్ షో. అతని పర్ఫార్మెన్స్ ఓ ఫైర్. రణవీర్ పాత్ర పద్మావత్ మాదిరిగా గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ప్రతి నటుడు అద్భుతమైన నటనతో, దృఢమైన కథగా సాగింది. యానిమల్, కే సింగ్ తరహా సినిమాలను ఇష్టపడే ప్రతి ఒక్కరికీ ఇది నచ్చుతుందని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.
దురంధర్ ఫస్టాఫ్ అద్భుతంగా ఉంది. ఆదిత్య ధార్ తీవ్రమైన సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించాడు. అక్షయ్ ఖన్నా తన స్థాయికి తగిన విధంగా నటించాడు. మాధవన్ అత్యుత్తమ నటనను కనబరిచాడు. ఫస్టాఫ్‌లో యాక్షన్ సన్నివేశాలు తక్కువగానే ఉన్నాయి. అయినప్పటికీ ఆదిత్య ధార్ కేవలం డైలాగ్స్‌తోనే స్క్రీన్ ప్లేను అసక్తికరంగా మార్చాడు అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.
దురంధర్ ఫస్టాఫ్ గుడ్, మొత్తం క్యాస్ట్ బాగుంది. మ్యూజిక్, బీజీఎం పవర్‌ఫుల్ ఫీల్ తీసుకొచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.. కాస్త స్లో అయినప్పటికీ ఎంగేజింగ్‌గా ఉంది. స్టోరీ సూపర్.. సెకండాఫ్ ఈ సినిమా మొత్తానికి కీ వంటిది అని ఓ యూజర్ రివ్యూ ఇచ్చాడు.
ఫస్టాఫ్‌లో పాత్రలను పరిచయడం చేయడం బాగుంది. సెకండాఫ్‌లో ఎక్కువగా సంఘర్షణపై దృష్టి పెట్టారు. మొదటి 30 నిమిషాలు, క్లైమాక్స్ భాగాలు హైలైట్‌గా నిలిచింది. సినిమా మొత్తం రణవీర్ సింగ్ మెరిసిపోయాడు.. క్యాస్టింగ్ నుంచి ఆయనకు మద్ధతు లభించింది. సారా అర్జున్‌తో రొమాంటిక్ సన్నివేశాలు కాస్త నెమ్మదిగా అనిపించాయి. అది తప్పించి ఓవరాల్‌గా సినిమా బాగుంది. 3 గంటల 34 నిమిషాల రన్‌టైమ్ అనేది కాస్త ఇబ్బందిగా అనిపించింది. గ్రాండ్ మేకింగ్, బలమైన విజువల్స్, సాలిడ్ మ్యూజిక్ సినిమాను ఎలివేట్ చేశాయి. సెకండాఫ్, పోస్ట్ క్లైమాక్స్‌లో సన్నివేశాలు రణవీర్‌ను కొత్తగా చూపించాయి. ఓవరాల్‌గా దురంధర్ ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.
దురంధర్ యాక్షన్ ప్యాక్డ్ దేశభక్తి సినిమా. రణవీర్ సింగ్ సూపర్ స్పైగా డామినేట్ చేశాడు. అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్‌లు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. విలన్లంతా తీవ్రంగా దెబ్బలు తిన్నారు. యాక్షన్ రియలిస్టిక్‌గా ఉంది. భావోద్వేగాలు, పర్ఫెక్ట్‌గా దిగాయి. తప్పకుండా చూడాల్సిన సినిమా అని ఓ నెటిజన్ రివ్యూ ఇచ్చాడు.
సినిమా ప్రారంభం చాలా బాగుంది. పాత్రల పరిచయాలు అద్భుతంగా ఉన్నాయి. కానీ ఫస్టాఫ్‌లో సినిమా కొంచెం లెంగ్తీగా అనిపించింది. సెకండాఫ్‌లో కథ బాగా పుంజుకుంటుంది.. అస్సలు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. దురంధర్ మిమ్మల్ని పూర్తిగా అవహించి.. సీక్రెట్ ఆపరేషన్లు, ద్రోహం, ఉద్రిక్తతలతో నిండిన క్రూరమైన ప్రపంచంలోకి ఆదిత్య ధార్ లోతుగా లాక్కెళ్తాడు.
రణవీర్ సింగ్ స్క్రీన్ ప్రెజెన్స్‌ని తెరపై చూస్తూ ఉండిపోవాల్సిందే. మాధవన్ ప్రశాంతంగా కూర్చొని ప్రతి ఫ్రేమ్‌ని నడిపిస్తాడు. అర్జున్ రాంపాల్ అనే పాత్ర ఓ అయస్కాంతంలా ఆకర్షిస్తూ.. స్టైలీష్‌గా ఉంటుంది. అక్షయ్ ఖన్నా ఎందుకు విభిన్నంగా ఉంటాడో.. పదునుగా సినిమాను నడిపిస్తాడో మరోసారి నిరూపించాడు. సంజయ్‌దత్ పాత్ర ప్రతి సన్నివేశంలో శక్తిని నింపుతుంది. మొత్తం మీద రణవీర్ సింగ్ తర్వాత అక్షయ్ ఖన్నా పాత్ర గుర్తుండిపోతుంది. చివరిగా 2026 మార్చి 19న దురంధర్ 2 రాబోతోంది అని ఓ నెటిజన్ తెలిపాడు.


Click it and Unblock the Notifications











