Dhurandhar First Review: దురంధర్ మూవీ ఫస్ట్ రివ్యూ
బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ నటించిన తాజా భారీ బడ్జెట్ చిత్రం దురంధర్. ఈ సినిమాకు ఆదిత్య ధార్ రచన, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. యాక్షన్, స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకొన్న ఈ చిత్రం డిసెంబర్ 5వ తేదీ 2025 రోజున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాను ఇటీవల సెన్సార్ బోర్డు రివ్యూ చేసింది. ఈ సినిమాకు ఇచ్చిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ సినిమా రన్ టైమ్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

దురంధర్ సినిమా కథ విషయానికి వస్తే.. 1999 సంవత్సరంలో IC 814 ఫ్లయిట్ హైజాకింగ్ ఘటన, పార్లమెంట్‌పై దాడి సంఘటన తర్వాత.. భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ పాకిస్థాన్‌లోని టెర్రరిస్ట్ నెట్‌వర్క్‌ను విచ్చిన్నం, విధ్వంసం చేయాలని, అలాగే కరాచీలోని అండర్ వరల్డ్ మాఫియాను దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తారు. అజయ్ సన్యాల్ ప్లాన్ వర్కవుట్ అయిందా? పాక్ టెర్రిరస్ట్ స్థావరాలను దెబ్బ తీశాడా? అనే ప్రశ్నలకు సమాధానమే దురంధర్ మూవీ కథ.
దురంధర్ సినిమా సెన్సారింగ్ విషయంలో అధికారులు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ సినిమాలోని సన్నివేశాలను తొలగించాలని పట్టుబట్టారు. అలాగే మరికొన్ని సన్నివేశాలను మార్చాలని సూచనలు ఇచ్చారు. యాంటీ డ్రగ్స్, స్మోకింగ్ సన్నివేశాలపై అభ్యంతరాలు తెలిపారు. కొన్ని సన్నివేశాల్లో హిందీ డిస్‌క్లైమర్‌ను పెట్టాలని సూచించారు. కొన్ని సీన్లను మార్చారు. మరికొన్ని సీన్లలో హింస నిడివిని తగ్గించారు.చాలా డైలాగ్స్‌ను మ్యూట్ చేశారు. మినిస్టర్ పేరు మార్చేశారు. మేజర్ మోహిత్ శర్మ తల్లిదండ్రులు తన కొడుకు జీవితంలోని సంఘటనలు తెరకెక్కించారని ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్ విషయంలో భారీగా గందరగోళమే జరిగింది అనేది చిత్ర యూనిట్ వెల్లడించింది.
దురంధర్ సినిమా అనేక ఆంక్షలు, సెన్సార్ నిబంధనలు దాటుకొని విడుదలకు అనుమతిని సంపాదించింది. ఈ సినిమాకు A సర్టిఫికెట్ జారీ చేశారు. దీని ప్రకారం ఈ చిత్రం 18 ఏళ్లకుపై పడిన వారు మాత్రమే చూడటానికి అనుమతి ఇచ్చారు. హింస, అడల్డ్ కంటెంట్, మితిమీరిన డైలాగ్స్ కారణంగా పిల్లలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో హిందీలో ఏ రేటింగ్ సొంతం చేసుకొన్న తక్కువ చిత్రాల్లో ఈ మూవీ ఒకటి అని చెప్పుకొంటున్నారు.
ఇక ఈ సినిమా బాలీవుడ్ సినిమా రంగంలో అతి పెద్ద నిడివి ఉన్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. 17 ఏళ్ల క్రితం వచ్చిన జోధా అక్బర్ సినిమా నిడివి 3 గంటల 33 నిమిషాలు. ప్రస్తుతం ఆ సినిమా రన్ టైమ్‌ను దురంధర్ అధిగమించింది. సెన్సార్ సర్టిఫికెట్ తెలిపిన ప్రకారం.. ఈ చిత్రం నిడివి 214 నిమిషాలు. అంటే.. 3 గంటల 34 నిమిషాల 1 సెకండ్ అని తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలు, ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఫిలింబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











