Dhurandhar The Revenge Movie Review: ధురంధర్ ది రివెంజ్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: రణ్‌వీర్ సింగ్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, సారా అర్జున్, రాకేష్ బేడీ, అక్షయ్ ఖన్నా, యామీ గౌతమ్ తదితరులు
రచన, దర్శకత్వం: ఆదిత్య ధార్
నిర్మాతలు: ఆదిత్య ధార్, జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ ధార్
సినిమాటోగ్రఫి: వికాశ్ నౌలాఖ
మ్యూజిక్: శాశ్వత్ సచ్‌దేవ్
ఎడిటింగ్: శివకుమార్ వీ పానికర్
బ్యానర్: జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్
రిలీజ్ డేట్: 2026-03-19
పాకిస్థాన్‌లోని కరాచీ ప్రాంతంలోని లైయారీ పట్టణంలో ఇండియన్ ఏజెంట్‌గా పనిచేసే హమ్జా ఆలీ మజారీ అలియాస్ జస్కిరాత్ సింగ్ రాంగీ (రణ్‌వీర్ సింగ్). కరాచీ, లాహోర్ రాజకీయాల్లోకి అండర్ డాగ్‌గా చేరి అక్కడి నేతలను శాసించే స్థాయికి చేరుకొంటాడు. ఇక రెహ్మత్ డెకాయిట్ (అక్షయ్ ఖన్నా)ను హతమార్చిన తర్వాత అతడి సామ్రాజ్యాన్ని చేజిక్కించుకొంటాడు. కరాచీ కేంద్రంగా భారత్‌ను విచ్చిన్నం చేసే కుట్రలకు చెక్ పెట్టేందుకు సిద్దమవుతాడు. భారత్‌లోకి అక్రమంగా చొరబాటు చేసే లష్కరే తోయిబా, మొజాహిద్దీన్ తీవ్రవాదులను, అలాగే ఫేక్ కరెన్సీ సరఫరా, అక్రమ ఆయుధాలను చేరే వేసే వారికి సహకారం అందించే భారత్‌లోని స్థానిక నేతలను మట్టుబెట్టే కార్యక్రమాన్ని చేపడుతారు. ఈ క్రమంలో కరాచీలో అక్రమ ఆయుధాలు, డ్రగ్స్ వ్యాపారం చేయడానికి వచ్చిన తన చిన్ననాటి స్నేహితుడు.. జస్కిరాత్ సింగ్‌ను గుర్తిస్తాడు.

హమ్జా ఆలీ మజారీ అలియాస్ జస్కిరాత్ సింగ్ రాంగీ గతం ఏమిటి? జస్కిరాత్ సింగ్ రాంగీ ఎందుకు హమ్జా ఆలీ మజారీగా మారాడు. సైన్యంలో పనిచేయాలని కోరికతో ఉండే జస్కిరాత్ సింగ్ హత్య కేసులో దోషిగా ఎందుకు మారాడు? దాదాపు 12 హత్యలు ఎందుకు చేశాడు? హత్య కేసులో దోషిగా ఉన్న జస్కిరాత్‌ను హమ్జాగా ఐబీ చీఫ్ అజయ్ సన్యాల్ ఎందుకు మార్చాడు? ఇండియన్ ఏజెంట్‌గా పనిచేస్తూ ఉత్తర ప్రదేశ్ రాజకీయాలను ఎలా ప్రభావితం చేశాడు? భారత్‌లో నోట్ల రద్దు వెనుక జస్కిరాత్ సింగ్ పాత్ర ఏమిటి? కరాచీలో తలదాచుకొన్న దావూద్ ఇబ్రహీంను ఇండియన్ సీక్రెట్ ఏజెంట్స్ ఎలా శిక్షించారు? కరాచీలో స్పెషల్ మిషన్ మీద వెళ్లిన జస్కిరాత్ సింగ్ వ్యవహారం బయటపడిన తర్వాత ఏం జరిగింది? తనకు అప్పగించిన మిషన్‌ను హమ్జాగా జస్కిరాత్ సింగ్ ఎలా పూర్తి చేశాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ధురంధర్ ది రివేంజ్ సినిమా కథ.
హమ్జా ఆలీ మజారీగా కరాచీలో ఇండియన్ సీక్రెట్ ఏజెంట్‌గా పనిచేసే జస్కిరాత్ సింగ్ రాంగీ ఫ్యామిలీ ఎపిసోడ్‌తో హై యాక్షన్ డ్రామాగా పీక్స్‌లో కథ మొదలవుతుంది. మొదటి 30 నిమిషాల్లోనే బ్లాక్ బస్టర్ సినిమాకు కావాల్సిన వాతావారణాన్ని సన్నివేశాల రూపంలో దర్శకుడు సెట్ చేసిన విధానం ఎక్సలెంట్ ఉంటుంది. అలా కథకు కనెక్ట్ చేసి నేరుగా సినిమాలోకి తీసుకెళ్తాడు. తొలి గంటలో గ్రిప్పింగ్‌గా కథ చెప్పిన తర్వాత కథలో వేగం కొంత మందగించినట్టు అనిపిస్తుంది. సన్నివేశాలను సాగదీసినట్టు చెప్పడంతో స్టోరీ మీద పట్టు జారిపోతుందా? అనే అనుమానం కలుగుతుంది. కానీ ఇంటర్వెల్ బ్యాంగ్‌తో సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లి సెకండాఫ్‌పై ఆసక్తిని రేపడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఫస్టాఫ్‌లో ఫ్యామిలీ డ్రామా, ఎస్పీ చౌదరీ అస్లాం (సంజయ్ దత్) పాయింట్ ఆఫ్ వ్యూ సీన్లు హైలెట్ అనిపిస్తాయి.
ఇక సెకండాఫ్‌లో అసలు కథను మొదలుపెట్టి కేక పుట్టించాడు. దావూద్ ఇబ్రహీం ఎపిసోడ్, అలాగే భారత్‌లోకి నకిలీ కరెన్సీ, అక్రమ ఆయుధాలు, ప్రధాని మోదీ నోట్ల రద్దు వ్యవహారం కథలో కీలకంగానే కాకుండా సినిమాను బ్లాక్ బస్టర్ మూవీగా మార్చేందుకు దోహదపడ్డాయి. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో క్రిమినల్స్ పాత్రను చాలా విపులంగా చూపించారు. అలాగే ఐఎస్ఐ, లష్కరే ట్రైనింగ్ స్థావరాలను ధ్వంసం చేయడం లాంటి అంశాలు సినిమాలో ఎమోషన్స్, దేశభక్తిని పెంచేలా చేశాయి. ఇలాంటి అంశాలు ఆసక్తికరంగా సాగడంతో సుమారు నాలుగు గంటలపాటు సాగే సినిమాలో ఒక్క సీన్ కూడా బోర్ అనిపించకుండా దర్శకుడు తీసుకొన్న జాగ్రత్తలు హ్యాట్సాప్ అని చెప్పాలి.
ఇక ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ నట విశ్వరూపం చూపించాడు. హమ్జాగా బీస్ట్ మోడ్‌లో పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి చెలరేగిపోయాడు. యాక్షన్, ఎమోషన్స్, డ్రామాను అద్బుతంగా పండించాడు. రణ్‌వీర్ పూర్తిగా వన్ మ్యాన్ షోతో అద్బుతంగా తెర మీద రాణించాడు. రణ్‌వీర్ ఎలివేషన్స్ బాగున్నాయి. డైనమిక్ పెర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రజెన్స్‌తో కట్టిపడేస్తాడు. ఇక సంజయ్ దత్ తన పాత్ర న్యాయం చేశాడు. సారా అర్జున్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. కనిపించనంత సేపు ఫుల్ మార్కులు కొట్టేసింది. ఇక ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ తర్వాత గొప్పగా చెప్పుకోవాల్సిన వారిలో జమీల్‌గా రాకేష్ బేడీ, అజయ్ సన్యాల్‌గా ఆర్ మాధవన్, మేజర్ ఇక్బాల్‌గా అర్జున్ రాంపాల్ తమ పెర్ఫార్మెన్స్‌తో ఇరుగదీశారు. చిన్న పాత్రల్లో కనిపించిన వారు కూడా గుర్తుండిపోయేలా నటించారు.
సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్బుతంగా ఉంది. నాలుగు గంటల సినిమాను ఎక్కడా ల్యాగ్ లేకుండా ఎడిటర్ తన పనితనాన్ని చూపించిన విధానం ఈ సినిమాకు అత్యంత బలంగా మారింది. పలు సన్నివేశాలను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ భారీగా హైప్ చేసింది. సినిమాటోగ్రఫి బాగుంది. వీఎఫ్ఎక్స్ నాసిరకంగా ఉన్నాయి. కానీ సన్నివేశాలను డీ గ్రేడ్ చేసే విధంగా లేకపోవడం పాజిటివ్ అంశం. నిర్మాణ విలువలు హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి.
ధురంధర్ సినిమా ఇప్పటికే కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకొన్న విషయం తెలిసిందే. దానికి కొనసాగింపుగా వచ్చిన ఈ సినిమా అన్ని రకాల అంచనాలు అధగించేలా కథ, కథనాలు ఉన్నాయి. బలమైన డైలాగ్స్, సీన్లు ఈ సినిమాను సూపర్ హిట్ సినిమాగా మార్చబోతున్నాయని చెప్పవచ్చు. దర్శకుడు అదిత్య ధార్ రాసిన స్క్రీన్ ప్లే, కథను ఎగ్జిక్యూట్ చేసిన తీరు మాటల్లో చెప్పలేం. అనుక్షణం కొత్త అనుభూతిని, ట్విస్టులను రివీల్ చేసిన విధానం ఈ సినిమాకు బ్యూటీగా మారాయి. ప్రతీ ట్విస్ట్ గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సినిమా అనడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు. డోంట్ మిస్. తప్పకుండా థియేటర్లలోనే చూడండి.


Click it and Unblock the Notifications











