Dhurandhar The Revenge Critic Review: ధురంధర్ ది రివెంజ్ మూవీ క్రిటిక్ రివ్యూ అండ్ రేటింగ్
ధురంధర్ 1 చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనాలు సృష్టించి రికార్డు విజయాన్ని అందుకొన్నది. ఆ సినిమాకు కొనసాగింపుగా రెండో భాగంగా ధురంధర్ ది రివేజ్ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమాకు ఆదిత్య ధార్ రచన, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తించారు. యాక్షన్, స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు.
ఈ చిత్రానికి వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ధురంధర్ 1 చిత్రం డిసెంబర్ 5వ తేదీ 2025 రోజున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా రెండో భాగం మార్చి 19వ ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది.

ఈ క్రమంలో ఇటీవల దుబాయ్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్నది. దుబాయ్‌లో సెన్సార్ రివ్యూ సందర్భంగా ఈ మూవీని చూసినట్టు చెప్పుకొంటున్న క్రిటిక్ తన రివ్యూను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆకాశాన్ని అంటే అంచనాలకు తగినట్టే ఈ సినిమా అంచనాలను అధిగమించిందా? ఈ సినిమా గురించి ఆ క్రిటిక్ వెల్లడించిన ఫీడ్‌బ్యాక్ ఏమిటి? ఈ చిత్రానికి ఆయన ఇచ్చిన రేటింగ్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..
ధురంధర్ ది రివెంజ్ సినిమాను దుబాయ్ సెన్సార్ సందర్భంగా చూశాను. ఈ తరం వారికి ఈ సినిమా మరో బాహుబలి2. సెన్సార్ బోర్డులో ఈ సినిమాను చూసిన తర్వాత నోటి నుంచి మాట రాలేదు. రణ్‌వీర్ సింగ్ పాత్ర బాగుంది. తన డైనమిక్ పెర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రజెన్స్‌తో కట్టిపడేసాడు. రణ్‌వీర్ కెరీర్‌కు ఈ సినిమా లైఫ్‌లైన్ అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. వీరోచితమైన పాత్రతో ఈ సినిమా నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లారు అని ఉమేర్ సంధూ తన రివ్యూలో పేర్కొన్నాడు.
ఈ సినిమాకు తన నటనతో రణ్‌వీర్ ఆయువుపుట్టుగా మారారు. కథ, కథనాలకు బలం చేకూర్చారు. స్క్రీన్ మీద కనిపించిన ప్రతీసారి ఫైర్ క్రియేట్ చేశాడు. ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శకుడు ఆదిత్య ధార్‌ను రణ్‌వీర్ జీవితంలో మరిచిపోడు. మరిచిపోలేనటు వంటి కమ్ బ్యాక్ ఇచ్చాడు. ధురంధర్ ది రివేజ్ సినిమాలో ఆయన లైఫ్‌టైమ్ పెర్ఫార్మెన్స్ చూడొచ్చు అని ఉమేర్ సంధూ రణ్‌వీర్‌ను ఆకాశానికి ఎత్తేశాడు.
ధురంధర్ 2 సినిమా ముందు పుష్ప, బాహుబలి సినిమాలు కూడా దిగదుడుపే. ఈ సినిమా విజయానికి, కలెక్షన్లకు ఆకాశమే హద్దు. ఈ చిత్రం 3000 కోట్లు వసూలు చేస్తుంది అని అని ఉమేర్ సంధూ జోస్యం చెప్పారు.ఇక ఈ సినిమాకు ఆయన 5/5 రేటింగ్ ఇచ్చి మరింత అంచనాలు పెంచేశాడు. ఈ సినిమాపై ఉన్న అంచనాలకు తగినట్టే ఉమేర్ సంధూ తన రివ్యూను మ్యాచ్ చేశాడు. అయితే కొన్నిసార్లు ఆయన రివ్యూపై జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అయితే ఈ మూవీ గురించిన ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications











