Dhurandhar 2 Public Talk: ధురంధర్ 2 పబ్లిక్ టాక్.. రణవీర్ సింగ్ సినిమా ఎలా ఉందంటే?

Dhurandhar The Revenge Public Talk: రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్. ఈ మూవీ గతేడాది డిసెంబర్‌లో విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు అదే చిత్రానికి సీక్వెల్‌గా ధురంధర్ 2: ది రివేంజ్ (Dhurandhar 2)ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ప్రత్యేకంగా కేవలం మూడు నెలల్లోనే ఈ సీక్వెల్ విడుదల కావడం విశేషం. మొదటి భాగాన్ని తెరకెక్కించిన ఆదిత్య ధర్ ఈ పార్ట్‌ను కూడా డైరెక్ట్ చేశారు. భారీ అంచనాల మధ్య ప్రీమియర్ షోలు ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు ఇండియాలోనూ ప్రారంభమయ్యాయి. ఈ సినిమాపై పబ్లిక్ టాక్ ఎలా ఉంది? ప్రేక్షకుల అభిప్రాయాలు, రివ్యూ వివరాల్లోకి వెళితే..

Dhurandhar The Revenge Public Talk  Ranveer Singh Shines in Action Thriller

బాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య విడుదలైన మూవీ ధురంధర్ 2. ఈ మూవీలో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ కీలక పాత్రల్లో నటించారు. ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ మూవీకి ఆదిత్య ధర్ కథ, దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలను నిర్వహించగా, జీ స్టూడియోస్ మరియు బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించారు. ధురంధర్ 1 బ్లాక్‌బస్టర్ తర్వాత వచ్చిన సీక్వెల్ కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకగా, ఆ అంచనాలను చాలా వరకు ఈ సినిమా అందుకుందని టాక్ వినిపిస్తోంది.

సినిమా ప్రారంభం నుంచే హై ఆక్టేన్ యాక్షన్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేస్తుందట. మొదటి భాగానికి సంబంధించిన కథను కనెక్ట్ చేస్తూ, హీరో హంజా అలీ (జస్‌ప్రీత్ సింగ్) బ్యాక్‌స్టోరీని త్వరగా ఎస్టాబ్లిష్ చేయడం ప్రేక్షకులను వెంటనే కథలోకి తీసుకెళ్తుందట. మొదటి 30 నిమిషాల్లోనే కీలక విషయాలను చూపించడం కొంతమందికి సర్‌ప్రైజ్‌గా అనిపించినా, ఆ తర్వాత కథను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్లడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని విశ్లేషణలు చెబుతున్నాయి.

ఫస్ట్ హాఫ్‌లో ఎమోషన్, యాక్షన్, డ్రామా మిక్స్ బాగా వర్క్ అయ్యింది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన హైప్ కనిపిస్తోంది. 'ఇంటర్వెల్ ట్విస్ట్ క్రేజీ', 'ఫస్ట్ పార్ట్‌కు పర్ఫెక్ట్ కనెక్ట్' అంటూ ప్రేక్షకుల అభిప్రాయపడుతున్నారు. కొందరు మాత్రం సబ్‌టైటిల్స్ లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది అనిపించిందని చెప్పినా, మొత్తం ఫస్ట్ హాఫ్ ఎంగేజింగ్‌గా ఉందని అభిప్రాయపడుతున్నారు.

సెకండాఫ్ విషయానికి వస్తే, ఇదే సినిమా ప్రధాన బలం అని చెప్పాలి. రణ్ వీర్ సింగ్ పూర్తిగా బీస్ట్ మోడ్‌లోకి వెళ్లి తన నటనతో సినిమా స్థాయిని పెంచేశాడని టాక్. యాక్షన్ బ్లాక్స్, ఇండియా vs పాకిస్థాన్ నేపథ్యం, టెర్రరిస్ట్ ట్రాక్ అన్ని కలిసి భారీ స్కేల్‌ను చూపించాయి. ట్విస్టులపై ట్విస్టులతో కథ పీక్స్‌కి వెళ్లడం ప్రేక్షకులను ఎడ్జ్ ఆఫ్ ది సీట్‌లో ఉంచుతుందని ప్రేక్షకులు అభిప్రాయం పడుతున్నారు.

ఇక నటీనటుల విషయానికి వస్తే, రణవీర్ సింగ్ ఈ సినిమాకు హార్ట్ అండ్ సౌల్‌గా నిలిచాడనీ, అతని స్క్రీన్ ప్రెజెన్స్, ఎనర్జీ, ఎమోషనల్ రేంజ్ అన్ని కలిసి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని ఫ్యాన్స్ అంటున్నారు. సంజయ్ తన స్టైల్‌తో ఆకట్టుకోగా, ఆర్. మాధవన్, అర్జున్ రామ్ పాల్ వంటి నటులు పార్మెన్స్ పీక్స్ కు చేరిందట. విలన్ క్యారెక్టర్లు కూడా స్ట్రాంగ్‌గా ఉండటం ప్లస్ పాయింట్‌గా మారింది. టెక్నికల్‌గా సినిమా హై స్టాండర్డ్‌లో ఉందని పబ్లిక్ టాక్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ కలిసి ఇంటర్నేషనల్ లెవెల్ ఫీలింగ్ ఇస్తున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా బీజీఎం ప్రతి సన్నివేశాన్ని లిఫ్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించిందట.

అయితే నెగటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సినిమా నిడివి (దాదాపు 3 గంటల 40 నిమిషాలు పైగా) కొంతమందికి లాంగ్‌గా అనిపించిందని టాక్. కొన్ని చోట్ల కథ స్లో అవుతుందని, ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే కొంచెం తక్కువ రక్తపాతం ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయినప్పటికీ, ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే వల్ల బోర్ అనిపించదని చాలామంది చెబుతున్నారు. క్లైమాక్స్ విషయంలో మాత్రం దాదాపు అందరూ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ఊహించని ట్విస్ట్‌తో ముగించడం, దేశభక్తి ఎలిమెంట్స్‌ను బలంగా చూపించడం ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. 'పైసా వసూల్ ఎంటర్‌టైనర్', 'బ్లాక్‌బస్టర్ మెటీరియల్' అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక ఫైనల్ గా ధురంధర్ 2 పబ్లిక్ టాక్ చాలా వరకు పాజిటివ్ వైపే ఉంది. మాస్, యాక్షన్, దేశభక్తి అంశాలు కలిసి ఈ సినిమాను పెద్ద హిట్‌గా నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికీ, రణవీర్ సింగ్ పెర్ఫార్మెన్స్, స్క్రీన్‌ప్లే, ట్విస్టులు అన్ని కలిసి సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇలా పాజిటివ్ అందుకున్న ధురంధర్ 2 ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో కలెక్షన్స్ అందుకుంటుందో? ఈ సారి ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తాదో వేచి చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X