Dhurandhar The Revenge First Review: ధురంధర్ ది రివేంజ్ మూవీ ఫస్ట్ రివ్యూ

బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ నటించిన తాజా భారీ బడ్జెట్ చిత్రం దురంధర్. ఈ సినిమాకు ఆదిత్య ధార్ రచన, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తించారు. యాక్షన్, స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు.

ఈ చిత్రానికి వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే భారీ అంచనాలు పెంచుకొన్న ఈ చిత్రం డిసెంబర్ 5వ తేదీ 2025 రోజున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా రెండో భాగం మార్చి 19వ ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్నది. ఈ సినిమా గురించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) ఫీడ్‌బ్యాక్ ఏమిటి? ఈ సినిమాకు లభించిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ చిత్రం రన్ టైమ్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Dhurandhar The Revenge Review by Censor Board

హమ్జా ఆలీ మజారీ‌ (రణ్‌వీర్ సింగ్) కరాచీలో అడుగుపెట్టిన భారతీయ గూఢచారి.. స్థానిక రాజకీయ నేతల వ్యూహాలను చిన్నాభిన్నం చేయడంలో కొంత మేరకు సక్సెస్ అవుతాడు? పాకిస్థాని యువతి, ప్రముఖ పొలిటిషియన్ కూతురు యలీనా జమాలీ (సారా అర్జున్)తో ప్రేమ వ్యవహారం నడిపిస్తుంటాడు. అయితే ఈ ధరుంధర్ 2 సినిమా విషయానికి వస్తే.. జస్కిరాత్ సింగ్ రాంగీ ఎందుకు హమ్జా ఆలీ మజారీ‌గా మారాడు అనే కోణంలో మెయిన్ ఫోకస్ ఉంటుంది.

జస్కిరాత్ సింగ్ గత జీవితంలో ఏం జరిగింది? కరాచీపై యుద్ధం చేయడానికి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉండటానికి కారణమేమిటనేది? రెహ్మాన్ డెకాయిట్ (అక్షయ్ ఖన్నా) డామినేషన్ తగ్గిన తర్వాత కరాచీని హమ్జా ఆలీ మజారీ ఎలా హస్తగతం చేసుకొన్నాడు? కరాచీ, ఇతర ప్రాంతాల్లో ఆయుధ విక్రయాల మాఫియాను, ఐఎస్ఐ గ్రూపులను ఎలా దెబ్బ తీశాడు. కరాచీ సామ్రాజ్యాన్ని తన కనుసైగలతో ఎలా కంట్రోల్ చేశాడు? ఎస్పీ చౌదరీ (సంజయ్ దత్), అజయ్ సన్యాల్ (ఆర్ మాధవన్) ఈ కథను ఎలా ప్రభావితం చేయబోతున్నారనేది ఈ సినిమా స్టోరీ.

ఇంటెన్స్ కథ, దేశభక్తి మూలలాను సృశించే స్పై థ్రిల్లర్ మూవీని ఇటీవల సెన్సార్ అధికారులు, ప్రతినిధులు వీక్షించారు. కొన్ని డైలాగ్స్, కొన్ని సన్నివేశాలపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. చాలా సన్నివేశాలను ముఖ్యంగా రక్తపాతం, హింసతో కూడిన సీన్లను మార్చాలని, డైలాగ్స్ విషయంలో బీప్స్ వేయాలని సూచించారు, కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. అయితే కంటెంట్ డిమాండ్ చేయడంతో వాటిని మార్చడానికి నిరాకరించారు. కొన్ని సీన్ల విషయంలో మార్పులు, చేర్పులు చేపట్టారు. అయినా సెన్సార్ అధికారులు పూర్తిగా సంతృప్తి చెందలేదు. దాంత ఈ సినిమా ఏ (A) సర్టిఫికెట్ జారీ చేశారు.

ధురంధర్ 2 సినిమా ఏ సర్టిఫికెట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నది. దాంతో ఈ సినిమాను చూడటానికి 18 ఏళ్లకుపై బడిన ఆడియెన్స్‌కు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ సినిమాను మైనర్లు చూడటానికి అవకాశం కల్పించడం లేదని సెన్సార్ తన సర్టిఫికెట్‌లో స్పష్టంగా వెల్లడించింది. అయితే ఈ సినిమా పార్ట్ 1 కంటే మరింత భావోద్వేగాలను పండిస్తుంది, దేశభక్తిని రగలించే సీన్లు ఉంటాయనే విషయం సెన్సార్ సందర్భంగా బయటకు వచ్చింది.

ధురంధర్ 2 సినిమా విషయానికి వస్తే.. ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యధిక నిడివి ఉన్న మూవీగా రికార్డుల్లో చేరడానికి సిద్దంగా ఉంది. ఈ చిత్రంలోని కంటెంట్ డిమాండ్ చేయడంతో నిడివి కూడా పెరిగింది. దాంతో ఈ సినిమాకు 3 గంటల 55 నిమిషాల నిడివిని అంటే.. 235 నిమిషాల రన్‌టైమ్‌ను ఫిక్స్ చేశారు. ఇంకా ఈ సినిమా గురించిన లేటేస్ట్ విషయాలు, ఎక్స్‌క్లూజివ్ రివ్యూ కోసం ఫిల్మీబీట్‌ను ఫాలో అవ్వండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X