Dhurandhar 2 Twitter Review: ధురంధర్ 2 మూవీ ట్విట్టర్ రివ్యూ

బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్‌వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్, రాకేశ్ బేడీ నటించిన చిత్రం ధురంధర్ ది రివెంజ్. ఈ సినిమాకు ఆదిత్య ధార్ రచన, నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తించారు. యాక్షన్, స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాను జీ స్టూడియోస్, బీ62 స్టూడియోస్ బ్యానర్లపై ఆదిత్య ధార్, లోకేష్ ధార్, జ్యోతి దేశ్‌పాండే నిర్మించారు.

ఈ చిత్రానికి వికాస్ నౌలాఖ సినిమాటోగ్రఫి, షాష్వత్ సచ్‌దేవ్ మ్యూజిక్, శివకుమార్ వీ పానికర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ధురంధర్ 1 చిత్రం డిసెంబర్ 5వ తేదీ 2025 రోజున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజై సంచలన విజయం సాధించింది. ఈ సినిమా రెండో భాగం మార్చి 19వ ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రీమియర్స్ ప్రపంచవ్యాప్తంగా మార్చి 18వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి భారీగా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఈ సినిమా గురించి వస్తున్న కామెంట్స్, రివ్యూలు, ఓపినియన్ వివరాల్లోకి వెళితే..

Dhurandhar 2 Twitter Review

ధురంధర్ 2 మూవీ కచ్చితంగా మాస్టర్ పీస్. నేను పెట్టుకొన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను దాటింది. సెకండాఫ్‌లో రణవీర్ సింగ్ బీస్ట్ మోడ్‌లో అదరగొట్టాడు. హమ్జాగా పెర్ఫార్మెన్స్ గురించి మాటల్లో చెప్పలేం. సంజయ్ దత్ సీన్లు చాలా ఫన్నీగా ఉన్నాయి. జమీల్ తన పాత్రతో ఆకట్టుకొన్నాడు. సెకండాఫ్‌లో ఏం చేస్తాడో అనే ఆసక్తికి నూటికి నూరు శాతం సంతృప్తిని కలిగించేలా సీన్లను తెరక్కించారు. కథను, సన్నివేశాలను చాలా ఎంగేజింగ్‌గా తీశారు. కొన్ని చోట్ల కొన్ని లోపాలు ఉన్నాయి. కానీ వాటిని అంతగా పట్టించుకోనవసరం లేదు అని నెటిజన్ కామెంట్ చేశాడు.

ధురంధర్ సినిమా చూశాను. ఇంటర్వెల్‌ ఎపిసోడ్ క్రేజీగా ఉంది. ఫస్ట్ పార్ట్‌ను బాగా కనెక్ట్ చేశాడు. ఫస్టాఫ్‌లో ఎమోషనల్ సీన్లు, కొన్ని సర్‌ప్రైజ్‌లు బాగున్నాయి. సబ్ టైటిల్స్ లేకపోవడం కొంత ఇబ్బందిగా ఉంటుంది అని నెటిజన్ అభిప్రాయపడ్డాడు. ఈ సినిమా చాలా గ్రేట్‌గా ఉంది అని నెటిజన్ అన్నాడు.

ధురంధర్ 2 సినిమా ప్యూర్‌గా పీక్స్‌లో ఉన్న సినిమా. 3 గంటల 49 నిమిషాల పాటు సాగే సినిమాలో ఒక్క సింగిల్ సీన్ కూడా బోర్‌గా ఉండదు. ట్విస్టులపై ట్విస్టులతో పీక్స్‌లోకి వెళ్తుంది. బీజీఎం చాలా బాగుంది. ఎడిటింగ్, స్క్రీన్ ప్లే షార్ప్‌గా ఉంది. ఎలివేషన్స్, రణ్‌వీర్ ఎలివేషన్స్ బాగున్నాయి. బాక్సాఫీస్ తుఫాన్ సూచనలు కచ్చితంగా కనిపిస్తున్నాయి. మరోసారి ఇండస్ట్రీ హిట్ ఇచ్చేందుకు రెడీగా ఉంది అని నెటిజన్ అన్నాడు.

ధురంధర్ సినిమా బ్యాంగ్‌తో మొదలవుతుంది. తొలి గంట సేపు తెరపైన ధమాకాగా ఉంటుంది. డ్రామాను బిల్డ్ చేసి కథను సెట్ చేసిన తీరు హైలెట్. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి యూనిక్ ఎక్స్‌పీరియెన్స్ ఏ సినిమా చూసినా కలుగలేదు. సెకండాఫ్ అదిరిపోయింది అని నెటిజన్ కామెంట్ చేశాడు.

ధురంధర్ ది రివెంజ్ సినిమాను దుబాయ్ సెన్సార్ సందర్భంగా చూశాను. ఈ సినిమా పైసా వసూలు చిత్రం. అడల్డ్ రేటెడ్ ఎంటర్‌టైనర్. అన్ని వర్గాల ప్రేక్షకులు, మాస్ ఆడియెన్స్ నచ్చే అంశాలు చాలా ఉన్నాయి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడం తథ్యం అంటూ దుబాయ్ క్రిటిక్ ఉమేర్ సంధూ ట్వీట్ చేశాడు.

హీరోగా నటించిన రణ్‌వీర్ సింగ్ పాత్ర బాగుంది. తన డైనమిక్ పెర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రజెన్స్‌తో కట్టిపడేసాడు. రణ్‌వీర్‌ కెరీర్‌కు ఈ సినిమా లైఫ్‌లైన్ అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఈ సినిమాకు తన నటనతో రణ్‌వీర్ ఆయువుపుట్టుగా మారారు. కథ, కథనాలకు బలం చేకూర్చారు. స్క్రీన్ మీద కనిపించిన ప్రతీసారి ఫైర్ క్రియేట్ చేశాడు. ఇంత మంచి పాత్రను ఇచ్చిన దర్శకుడు ఆదిత్య ధార్‌ను రణ్‌వీర్ జీవితంలో మరిచిపోడు. మరిచిపోలేనటు వంటి కమ్ బ్యాక్ ఇచ్చాడు. ధురంధర్ ది రివేజ్ సినిమాలో ఆయన లైఫ్‌టైమ్ పెర్ఫార్మెన్స్ చూడొచ్చు. ధురంధర్ 2 సినిమా ముందు పుష్ప, బాహుబలి సినిమాలు కూడా దిగదుడుపే. ఈ సినిమా విజయానికి, కలెక్షన్లకు ఆకాశమే హద్దు. ఈ చిత్రం 3000 కోట్లు వసూలు చేస్తుంది అని అని ఉమేర్ సంధూ జోస్యం చెప్పారు.

ధురంధర్ 2 సినిమా ఇప్పుడే చూశాను. రణ్‌వీర్ సింగ్ పైసా వసూలు చేసే పెర్ఫార్మెన్స్‌ను డెలివరీ చేశారు. హై ఆక్టేన్ యాక్షణ్ సీన్లు, ఇండియా వర్సెస్ పాకిస్థాన్ బ్యాక్ గ్రాప్ సీన్లు ఫైర్ పుట్టించాయి. ఈ సినిమాలో ఓ అతిథి పాత్ర అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తుంది. మీ మనసులను దోచుకొంటుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ధురంధర్ సినిమా పవర్ ప్యాక్ట్‌గా ఉంది. చాలా గ్రిప్పింగ్‌గా సినిమాను తెరకెక్కించారు. యాక్షన్ సీన్లు అదరగొట్టేలా ఉన్నాయి. స్టోరీ టెల్లింగ్ హై రేంజ్‌లో ఉంది. ప్రతీ ఫ్రేమ్ బిగ్ స్క్రీన్ ఫిల్మ్ మేకింగ్‌‌కు నిర్వచనం చెప్పేలా ఉంది. రణ్‌వీర్ యాక్టింగ్, యాక్షన్ డ్రామా అద్బుతంగా పండించాడు అని తన రివ్యూలో పేర్కొన్నారు.

More from Filmibeat

Read more about: aditya dhar ranveer singh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X