Diés Iraé Movie Review: డీఎస్ ఈరే తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.5/5

నటీనటులు: ప్రణవ్ మోహన్‌లాల్, సుస్మిత భట్, షైన్ టామ్ చాకో, అర్జున్ అజికుమార్, శ్రీధన్య, సైజు కురుప్ తదితరులు
రచన, దర్శకత్వం: రాహుల్ సదాశివన్
నిర్మాతలు: చక్రవర్తి, రామచంద్ర, ఎస్ శశికాంత్
సినిమాటోగ్రఫి: షెహనాద్ జలాల్
ఎడిటింగ్: షఫిక్ మహ్మద్ ఆలీ
మ్యూజిక్: క్రిస్టో జేవియర్
బ్యానర్: నైట్‌షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్
రిలీజ్ డేట్: 2025-11-07

సంపన్న కుటుంబానికి చెందిన రోహన్ (ప్రణవ్ మోహన్‌లాల్) ప్రొఫెషనల్‌గా ఇండొ అమెరికన్ ఆర్కిటెక్ట్. ఫ్రెండ్స్‌తో పార్టీలు చేసుకొంటూ లైఫ్‌ను జల్సాగా గడుపుతుంటాడు. ఫ్రెండ్స్‌తో పార్టీ జరుపుకొంటున్న సమయంలో తన క్లాస్‌మేట్ కణి (సుస్మిత భట్) సూసైడ్ చేసుకొని చనిపోయిందనే విషాద వార్త తెలుస్తుంది. దాంతో కణి ఇంటికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శిస్తాడు ఆ సందర్భంగా కణి రూమ్‌లో వస్తువులను చూస్తూ.. తనకు గుర్తుగా హెయిర్ క్లిప్ తెచ్చుకొంటాడు. అప్పటి నుంచి కణి ఆత్మ అతడిని వెంటాడుతూ ఉంటుంది.

Di  s Ira   Malayalam Movie Review

కణితో రోహన్‌‌కు ఉన్న సంబంధం ఏమిటి? కణి కేవలం క్లాస్‌మేటేనా? లేదా అంతకుమంది రిలేషన్ ఉందా? కణి గురించి ఆమె ఫ్యామిలీ ఫ్రెండ్ మధు సూదన్ (గిబిన్ గోపినాథ్)కు రోహన్ ఏం చెప్పాడు? కణి సోదరుడు కిరణ్‌ (అరుణ్ అజికుమార్)ను రోహన్ కలిసిన తర్వాత ఏం జరిగింది? కణిని ఫిలిప్ (షైన్ టామ్ చాకో) ఎందుకు వెంటడాడు? ఫిలిప్ మరణం వెనుక కారణం ఏమిటి? రోహన్, కిరణ్, ఫిలిప్‌ను కణి ఆత్మ ఎందుకు వెంటాడింది? కణి ఆత్మ నుంచి రోహన్ తప్పించుకోవడానికి ఏం చేశాడు? చివరకు కణి ఆత్మ సాగించిన వేట నుంచి రోహన్ తప్పించుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే డీఎస్ ఈరే (Dies Irae) సినిమా కథ.

Dies Irae మూవీ విషయానికి వస్తే.. రాహుల్ సదాశివన్ రాసుకొన్న కథ ఏమీ గొప్పగా ఉండదు. అద్బుతమైన డైలాగ్స్‌తో కట్టిపడే అంశాలు ఉండవు. కేవలం ఇద్దరు, లేదా ముగ్గురు క్యారెక్టర్ల మధ్య హారర్ ఎలిమెంట్స్‌తో కథను నడిపించిన విధానం ఓ మ్యాజిక్ అని చెప్పాలి. రెగ్యులర్ హారర్ థ్రిల్లర్‌లో ఉండే ట్విస్టులు, టర్నులు అసలే కనిపించవు. కానీ సినిమాటోగ్రఫి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సౌండ్ డిజన్ లాంటి అంశాలు సినిమాను పూర్తిగా డామినేట్ చేసి ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురి చేసి.. కొన్ని సందర్భాల్లో అతలాకుతలం చేస్తాయి. కొన్నీ సీన్లను డిజైన్ చేసిన విధానం. వాటికి సాంకేతిక విలువలు అద్దిన విధానమే ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందించింది. కేవలం స్క్రీన్ ప్లేతోనే రాహుల్ సదాశివన్ ప్రేక్షకులను సిల్వర్ స్క్రీన్‌కు అతుక్కుపోయేలా చేశాడు. సినిమా మొత్తం చూసిన తర్వాత గొప్ప అనుభూతితో బయటకు వస్తుంటే.. ఈ సినిమాకు మంచిగా అర్ధమయ్యే టైటిల్ పెట్టి ఉండే బాగుండేది. అదే ఒక మైనస్ అనిపించేలా చేస్తుంది.

Dies Irae సినిమాలో నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. కథాబలం, హీరోకు ఏ మాత్రం ఎలివేషన్స్ లేని సాదాసీదాగా ఉండే స్టోరిని ఒప్పుకోవడంతోనే ప్రణవ్ మోహన్ లాల్‌కు ఈ సినిమాపై ఉన్న విజన్ ఏమిటో అర్ధమవుతుంది. ఇక పూర్తిగా ప్రణవ్.. రోహన్‌లా తెరపైన జీవించాడు. పాత్ర డిమాండ్ మేరకు టోటల్‌గా బిహేవ్ చేశాడు. దాంతో ఈ సినిమా నెక్ట్స్ లెవెల్‌కు చేరేలా చేశాడు. షైన్ టామ్ చాకో చాలా డిఫరెంట్ క్యారెక్టర్. తెరపైన చూస్తే గానీ.. ఆ క్యారెక్టర్ ఇంటెన్సిటీ ఏమిటో తెలుస్తుంది. మిగితా పాత్రల్లో నటించిన వారంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

Dies Irae చిత్రం బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవడానికి, బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయల కనకవర్షం కురిపించడానికి కేవలం సాంకేతిక విభాగాల పనితీరే ప్రధానమైన కారణం. క్రిస్టో జేవియర్ మ్యూజిక్, షెహనాద్ జలాల్ సినిమాటోగ్రఫి, షఫిక్ మహ్మద్ ఆలీ ఎడిటింగ్, స్క్రీన్ ప్లే ఈ మూవీకి మూలస్థంబాలు, క్రిస్టో జేవియర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ మధ్య కాలంలో చాలా రేర్‌గా వినిపించిందనే ఫీలింగ్ కలిగింది. ఆడియెన్‌ను భయపెడుతూ.. కొత్త అనుభూతికి గురిచేసేలా బీజీఎం తన పాత్రను పోషించింది. సినిమాటోగ్రఫి ఈ సినిమాకు ఓ క్యారెక్టర్‌గా మారిపోయింది. ఎడిటింగ్ ఈ మూవీకి షో రన్నర్‌గా కనిపించింది. సినిమాను స్క్రీన్ ప్లే పరుగులు పెట్టింది. చక్రవర్తి, రామచంద్ర, ఎస్ శశికాంత్ అనుసరించిన నిర్మాణ విలువలు అద్బుతంగా ఉన్నాయి.

హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలంటే.. ఇప్పటి వరకు హోరెత్తించే మ్యూజిక్.. అనవసరమైన గ్రాఫిక్స్, కనిపించి వెంటాడే దెయ్యం లాంటి అంశాలే ముడిసరకు. కానీ Dies Irae విషయానికి వస్తే.. దెయ్యం కనిపించదు. సౌండ్ పొల్యూషన్ అసలే ఉండదు. అనవసరమైన ఫ్లాష్‌బ్యాక్‌లు ఏ మాత్రం ఉండవు. కేవలం పాత్రలకు ఎదురయ్యే సంఘటనలు, వాటికి ఆ క్యారెక్టర్లు బిహేవ్ చేసే తీరుతోనే సాగిపోతుంది. ఒక డిఫరెంట్, మంచి టెక్నికల్ వాల్యూస్ సినిమా చూశామనే మహా తృప్తి మీరు సినిమా థియేటర్ వదిలిన తర్వాత కూడా వెంటాడుతూనే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు ఆ అనుభూతిని పొందండి.. ఈ వారం మీరు చూడాలనుకొనే సినిమాల జాబితాలో వెంటనే ఈ మూవీని చేర్చుకొండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X