For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రేమ లేని దిల్‌ !

    By Staff
    |

    Dil
    - జలపతి

    చిత్రం: దిల్‌

    నటీనటులు: నితిన్‌, నేహా, ప్రకాష్‌ రాజ్‌, సీత

    సంగీతం: ఆర్పీ పట్నాయక్‌

    నిర్మాత: రాజు, గిరి

    కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: వి.వి.వినాయక్‌

    దర్శకుడు వి.వి.వినాయక్‌ (ఆది, చెన్నకేశవరెడ్డి) ఎప్పటిలానే కథ మీద కన్నా కెమెరా టెక్నిక్‌ లు, సౌండ్‌ గిమ్మిక్కుల మీద అధికంగా ఆధారపడి రూపొందించాడు ఈ చిత్రాన్ని. ఈ చిత్రం అనేక సినిమాల నుంచి తీసుకొని రూపొందించిన సన్నవివేశాల మాళిక. ఆది, జయం, ఒక్కడు, రన్‌..ఇలా ప్రతి సినిమా నుంచి ఏదో ఒక సన్నివేశాన్ని లేపి..కెమెరా యాంగిల్స్‌, డాల్బీ సౌండ్‌ గిమ్మిక్కులతో సినిమాను నడిపించాడు.

    సినిమా పట్టుతప్పి పోతుందనుకున్న సమయంలో..అంటే క్లైమాక్స్‌ లో పూర్తి పట్టుతో రూపొందించడంతో సినిమా ఫర్వాలేదన్న భావన కల్గిస్తుంది. మామాలు సాధారణ ప్రేమకథా చిత్రం.

    నితిన్‌ కాలేజ్‌ విద్యార్థి. ఏ క్లాసో తెలియదు. మనకు అనవసరం. ఆవేశం ఎక్కువ. ఎవరైనా ఏదైనా వద్దంటే అదే పని చేసే మనస్థత్వం. క్లాస్‌ మేట్‌ నేహాతో కలిసి ఒక పాట పాడుతాడు ఒక ప్రోగ్రామ్‌ కోసం. ఆమె తండ్రి ప్రకాష్‌ రాజ్‌ ఊళ్లో పేరుమోసిన రౌడీ. ఆ అమ్మాయితో ఇక ముందు క్లోజ్‌ గా ఉండకూడదని అతని తండ్రి అనుచరుడు నితిన్‌ కు వార్నింగ్‌ ఇస్తాడు. వీడు వార్నింగ్‌ ఇచ్చాడు కదాని..ఆ అమ్మాయినే ప్రేమిస్తానని ప్రేమిస్తాడు.

    దీనికోసం..ఆదిలో ఎన్టీఆర్‌ జూనియర్‌ చేసిన ఫీట్స్‌ నే ఇందులో మళ్లీ కొన్ని చేసి బుట్టలో పడేస్తాడు. బుట్టలో పడ్డ భామామణి..రెండు పాటలు పాడుకుంటుంది. ఈలోపు ప్రకాష్‌ రాజ్‌ కు విషయం తెలుస్తుంది. హీరో ను బెదరిస్తాడు. నితిన్‌ మరింత రెచ్చిపోయి..నేహానే పెళ్ళిచేసుకుంటానని శపథం చేస్తాడు. ప్రకాష్‌ రాజ్‌ కూతురను తీసుకెళ్ళి నిజాంపేట్‌ అనే గ్రామంలో ఉన్న తన మామ ఇంట్లో దాచిపెడుతాడు. హీరో చివరికి పవర్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ ఏమిటో చూపించి పెళ్ళి చేసుకోవడమే దిల్‌ కథ సారాంశం.

    సినిమా పూర్తయిపోయిన తర్వాత ఫర్వాలేదు..ఓకే అనే ఫీలింగ్‌ కలిగినా.. ఈ సినిమా అతి సాధారణమైన చిత్రమే అని చెప్పాలి. ఇంకా మీసాలు కూడా రాని నితిన్‌ తో యాక్షన్‌ సన్నివేశాలు చేయించడం బాగాలేదు. నేహా అటు అందాల ప్రదర్శన చేయలేదు. ఇటు నటించినూ లేదు. ప్రకాష్‌ రాజ్‌ ఓకే. సినిమా అంతా వినాయక్‌, కెమెరామెన్‌ విజయ్‌ గిమ్మిక్కులతోనే సాగుతుంది. ఆర్పీ సంగీతం యావరేజ్‌.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X