Dilruba Movie Review: దిల్ రూబా మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Rating: 2.75/5
నటీనటులు: కిరణ్ అబ్బవరం, రుక్సర్ దిల్లాన్, క్యాథీ డేవిసన్, సత్య, ఆడుకాలమ్ నరేన్, జాన్ విజయ్ తదితరులు
దర్శకత్వం: విశ్వ కరుణ్
నిర్మాతలు: రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ
మ్యూజిక్: సామ్ సీఎస్
సినిమాటోగ్రఫి: డేనియల్ విశ్వాస్
ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్
బ్యానర్: శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ, ఏ యూడ్లీ ఫిలిం
రిలీజ్ డేట్: 2023-03-14
సిద్దార్థ్ రెడ్డి అలియాస్ సిద్దూ (కిరణ్ అబ్బవరం) ఎవరైనా తనకు మంచి చేసినా థ్యాంక్యూ చెప్పడు.. తాను ఎవరికైనా మేలు చేయకపోయినా సారీ చెప్పడు. ఓ ఎమోషనల్ పాయింట్ కారణంగా మ్యాగీ (క్యాథీ డేవిసన్), సిద్దూ లవ్ అఫైర్ బ్రేకప్ అవుతుంది. ఆ తర్వాత ఓ కాలేజీలో చేరిన సిద్దూ.. తన తోటి స్టూడెంట్ అంజలి (రుక్సర్ థిల్లాన్)ను ఓ విషయంలో విక్కీ నుంచి కాపాడుతాడు. దాంతో సిద్దూని అంజలి ప్రేమించడం మొదలుపెడుతుంది. కానీ అంజలి ప్రేమను నిరాకరిస్తాడు.

సిద్దూ థ్యాంక్యూ, సారీ చెప్పకపోవడానికి బలమైన కారణం ఏమిటి? సిద్దూ జీవితంలో ఎదురైన చేదు అనుభవం ఏమిటి? దాని వల్ల మ్యాగీ, సిద్దూ ఎందుకు విడిపోయారు? విక్కీ నుంచి అంజలికి ఎదురైన ముప్పు ఏమిటి? ఆ ముప్పును సిద్దూ ఎలా తప్పించాడు? అంజలి ప్రేమను ఎందుకు నిరాకరించాడు? విక్కీ వల్ల సిద్దూకు వచ్చిన సమస్యలు ఏమిటి? ఈ కథలో జోకర్ (జాన్ విజయ్) ఎవరు? జోకర్ వల్ల కలిగిన ఇబ్బందులు ఏమిటి? బ్రేకప్ చేసుకొన్న మ్యాగీ మళ్లీ సిద్దూ జీవితంలోకి ఎందుకు వచ్చింది? మ్యాగీ వచ్చిన తర్వాత సిద్దూ లైఫ్‌లో జరిగిన సంఘటనలు ఏమిటి? ఇంతకు మ్యాగీ, అంజలీలో ఎవరి ప్రేమను సిద్దూ అంగీకరించాడు? అనే ప్రశ్నలకు సమాధానమే దిల్ రూబా సినిమా కథ.
క సినిమా తర్వాత పెరిగిన అంచనాలను పక్కన పెట్టి కిరణ్ అబ్బవరం ఎమోషనల్ అంశాలతో చేసిన పక్కా కమర్షియల్ సినిమా. అయితే ఇప్పటి వరకు చూసిన కిరణ్ వేరు.. దిల్ రూబా సినిమాలో కనిపించే కిరణ్ వేరు అనే విధంగా తొలి చిత్ర దర్శకుడు విశ్వ కరుణ్ రాసుకొన్న పాయింట్‌లో కొత్తదనం పెద్దగా కనిపించదు కానీ.. కథనం, డైలాగ్స్, హీరో క్యారెక్టరైజేషన్, బాడీ లాంగ్వేజ్ అన్నీ కొత్తగా ఉంటాయి. కథను నడిపించిన విధానం చూస్తే అనుభవం ఉన్న దర్శకుడిలా టేకింగ్ ఉంది. కొన్ని చోట్ల భావోద్వేగంతో కూడిన ఎపిసోడ్స్, డైలాగ్స్ సినిమాకు హైలెట్‌గా అనిపిస్తాయి. ముగ్గురి మధ్య జరిగే ప్రేమ కథలో ఓ పాయింట్‌ను నావెల్టీగా డీల్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
దర్శకుడిగా మైనస్ పాయింట్ల విషయానికి వస్తే.. ఇంకా కథపై వర్క్ చేయాల్సి ఉందనిపిస్తుంది. మాజీ ప్రేయసి పాయింట్ చుట్టు అల్లుకొన్న పాయింట్‌లో మంచి హిట్ కొట్టడానికి కావాల్సిన బలం కనిపించదు. అలాగే ఫ్లాష్ బ్యాక్ ఇంకాస్త బెటర్ చేసి ఉండే దర్శకుడిగా ఇంకా మంచి మార్కులు సాధించే వారనిపిస్తుంది. కాకపోతే కమర్షియల్ అంశాలను ఆధారంగా చేసుకొని పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా మలిచే ప్రయత్నం చేశారు.
ఇక కిరణ్ అబ్బవరం విషయానికి వస్తే.. అతడి నటన, పెర్ఫార్మెన్స్, ఫైట్స్ గురించి కొత్తగా బేరీజు వేయడం అవసరం లేదనే చెప్పాలి. నటుడిగా, పెర్ఫార్మర్‌గా కిరణ్ ఇప్పటికే తనకంటూ ఓ గుర్తింపును, సెట్ ఆఫ్ ఆడియెన్స్ సొంతం చేసుకొన్నాడు. తన నుంచి ఆశించే అభిమానులు, ప్రేక్షకులకు కొత్తదనం చూపించే విషయంలో బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలీవరిలో చాలా డిఫరెంట్‌గా కనిపిస్తాడు. కొన్ని సీన్లలో పూరీ మార్క్ హీరోలా విజృంభిస్తాడు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే.. రుక్సర్ ఫుల్ గ్లామర్‌గా మంచి మార్కులు కొట్టేసింది. కొన్ని కీలక సీన్లలో పెర్ఫార్మెన్స్ కూడా బాగా చేసింది. క్యాథీ డేవిసన్ కూడా ఫర్వాలేదనిపిస్తుంది. సత్య కామెడీ అక్కడక్కడా భారీగా పేలింది. జాన్ విజయ్, నరైన్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు.
టెక్నికల్ అంశాల విషయానికి వస్తే.. ఈ సినిమాలో క్వాలిటీ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. సీఎస్ సామ్ మ్యూజిక్ సినిమాకు హైలెట్. పాటలతోపాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. డేనియరల్ విశ్వాస్ సినిమాటోగ్రఫి కూడా బాగుండటమే కాకుండా విజువల్ పరంగా ఆకట్టుకొంటుంది. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ ఫర్వాలేదనిపిస్తుంది. ఈ సినిమాకు మరో అదనపు ఆకర్షణ ప్రొడక్షన్ వాల్యూస్. రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫాదర్ సెంటిమెంట్, లవ్, ఎమోషనల్ అంశాలను మేళవించి రూపొందించిన పక్కా కమర్షియల్ సినిమా దిల్ రూబా. కిరణ్ అబ్బవరం మార్క్, డిఫరెంట్ పాయింట్ డీల్ చేసే చిత్రంలో సాంకేతిక అంశాలు, నటీనటుల ఫెర్ఫార్మెన్స్ బలంగా కనిపిస్తాయి. కథ ఇంకాస్త బెటర్‌గా చెప్పగలిగితే ఈ సినిమా ఫలితం మరింత బెటర్‌గా ఉండేదనిపిస్తుంది. విభిన్నమైన ప్రేమకథలను ఆశించే వారికి, పూరీ తరహా హీరోయిజాన్ని ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వెళితే మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఈ వారం మాస్, లవ్ స్టోరీని చూడాలనుకొనే వారికి దిల్ రూబా ఈ వారం మంచి ఆప్షన్.


Click it and Unblock the Notifications











