Ustaad Bhagat Singh Celebrity Review: ‘ఉస్తాద్’పై స్టార్ డైరెక్టర్ రివ్యూ.. ఇక పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలే!
Ustaad Bhagat Singh Celebrity Review: పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ'ఉస్తాద్ భగత్ సింగ్'. పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సినీ లవర్స్ కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. గౌతమీ, చమ్మక్ చంద్ర, అశుతోష్ రాణా, నవాబ్ షా,నర్రా శ్రీను, నాగ మహేష్, చమ్మక్ చంద్ర, రెడిన్ కింగ్స్ లే, టెంపర్ వంశీ నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలవగా, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా మారుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
ఇక ఈ సినిమాకు సినిమాటోగ్రఫి ఆయనంకా బోస్ అందించగా, ఎడిటింగ్ బాధ్యతలను కార్తీక్ శ్రీనివాస్ నిర్వహించార. ఈ సినిమా ఉగాది పండుగను పురస్కరించుకొని మార్చి 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. అంచనాలు అమాంతం పెంచేసింది. దీంతో ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో
డైరెక్టర్ సముద్రఖని ఫిల్మీ బీట్ తెలుగు కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఉస్తాద్ భగత్ సింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా గురించి అభిమానుల్లో ఉన్న అంచనాలను మరింత పెంచేలా ఆయన మాట్లాడారు.

పవన్ కళ్యాణ్ కెరీర్‌లో 'ఉస్తాద్ భగత్ సింగ్' మరో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలుస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ను అభిమానులు చాలా కాలం తర్వాత మరోసారి క్లాసిక్ వింటేజ్ లుక్‌లో చూడబోతున్నారని చెప్పారు. పవర్ స్టార్ స్టైల్, మేనరిజం, యాక్షన్ అన్ని కలిసి ప్రేక్షకులకు థియేటర్లలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వబోతాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ ఈ చిత్రంలో మరో లెవెల్‌లో ఉండబోతుందని చెప్పుతూ అభిమానుల్లో మరింత హైప్ క్రియేట్ చేశారు. పవర్ స్టార్ అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉండబోతుందని సముద్రగని పేర్కొన్నారు.
ఇక మరోవైపు Bro సినిమాకు సీక్వెల్‌గా వచ్చే అవకాశం ఉన్న "బ్రో 2" గురించి కూడా సముద్రగని క్లారిటీ ఇచ్చారు. ఈ విషయంపై మాట్లాడుతూ, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్పకుండా 'బ్రో 2'ప్రారంభమవుతుందని తెలిపారు. ఆ సినిమాకు సంబంధించిన కథ ఇప్పటికే సిద్ధంగా ఉందని, ఈ విషయాన్ని తాను త్రివిక్రమ్ గారితో చర్చించినట్లు వెల్లడించారు. అయితే 'బ్రో 2' నిజంగా తెరకెక్కుతుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పడం కష్టం అని కూడా ఆయన స్పష్టం చేశారు. త్రివిక్రమ్ గారి నుంచి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ వస్తేనే సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా 'బ్రో' సినిమాలోని ప్రసిద్ధ డైలాగ్‌ను గుర్తు చేస్తూ సముద్రగని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'టైం కరెక్ట్‌గా ఉంటే జరిగేది జరుగుతుంది' అనే భావనతోనే ఆ సినిమా కూడా రూపొందిందని చెప్పారు. మొదట్లో బ్రో సినిమా కోసం పెద్దగా ముందస్తు ప్లానింగ్ ఏమీ లేదని, అనుకోకుండా కథ వచ్చిన తర్వాతే సినిమా తెరకెక్కిందని ఆయన గుర్తు చేసుకున్నారు. మొత్తానికి సముద్రగని చేసిన ఈ వ్యాఖ్యలతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు మరింత పెరిగాయి. అదే సమయంలో బ్రో 2 కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందనే సంకేతాలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఇక ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయడానికి అత్యంత భారీ స్థాయిలో ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగే ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ స్వయంగా హాజరవుతుండటంతో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా కేవలం వాలిడ్ పాస్‌లు ఉన్న వారికి మాత్రమే ఎంట్రీ ఉంటుందని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది. మరోవైపు మార్చి 19న సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో, అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా సాగుతోంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్-హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











