Dirty Fellow Review ట్విస్టులతో సాగే యాక్షన్ డ్రామా.. డర్టీ ఫెలో ఎలా ఉందంటే?
నటీనటులు: శాంతిచంద్ర, దీపిక సింగ్, సిమ్రిత్, నికిష రంగ్ , సత్యప్రకాష్,నాగి నిడు, ఎఫ్ ఎమ్ బాబాయ్, కుమరన్, జయశ్రీ, సురేంద్ర తదితరులు
నిర్మాణ సంస్థ: రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత: జియస్ బాబు
దర్శకత్వం: ఆడారి మూర్తి సాయి
సంగీతం: డాక్టర్ సతీష్ కుమార్ పి
సినిమాటోగ్రఫీ: రామకృష్ణ యస్
ఎడిటర్ : జేపీ
రిలీజ్ డేట్: 2024-05-24
జేపీ (నాగినీడు), శంకర్ నారాయణ (సత్య ప్రకాశ్) తిరుగులేని మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరిస్తారు. మంచి స్నేహితులు కావడంతో వారిద్దరి కలిసే మాఫియా వ్యవహారాలు చక్కబెడుతుంటారు. అయితే తమ మాఫియా సామ్రాజ్యం నుంచి జేపీని తప్పించాలని శంకర్ నారాయణ కుట్ర చేస్తాడు. ఆ కుట్రలో భాగంగా శంకర్ నారాయణ కొడుకు మరణిస్తాడు. దాంతో జేపీపై మరింత పగ పెరిగి ప్రతీకారం తీర్చుకోవాలనుకొంటాడు శంకర్ నారాయణ. తన కొడుకు మరణానికి శత్రు అలియాస్ డర్టీఫెలో (శాంతి చంద్ర)ను తుదముట్టిస్తానని జేపీకి వార్నింగ్ ఇస్తాడు.

ప్రాణ మిత్రులుగా ఉన్న జేపీ, శంకర్ నారాయణ మధ్య విభేదాలు రావడానికి కారణం ఏమిటి? శంకర్ నారాయణ కొడుకు ఏ పరిస్థితుల్లో చనిపోతాడు? డర్టీఫెలోను చంపేందుకు ప్లాన్ చేసిన శంకర్ నారాయణకు ఎదురైన సవాళ్లు ఏమిటి? చివరకు శంకర్ నారాయణ ప్రతీకారం తీర్చుకొన్నాడా? జేపీ, శంకర్ నారాయణ మాఫియా కార్యక్రమాలు సజావుగా సాగాయా? పిద్దు ఎవరు? డర్టీఫెలోకి, సిద్దుకు సంబంధమేమిటి? సిద్దును ప్రేమించిన రాగ (దీపికా సింగ్) ఎవరు? సిద్దూపై చిత్ర (సిమ్రితి) ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకొన్నది అనే ప్రశ్నలకు సమాధానమే డర్టీఫెలో సినిమా కథ.
ఫ్రెండ్ షిప్, మాఫియా కాన్సెప్ట్‌తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ డర్టీఫెలో కథలో పాత్రల ఎలివేషన్స్‌కు మంచి స్కోప్ ఉంది. అయితే మీడియం బడ్జెట్‌తో కథను, పాత్రలను మలిచిన విధానం బాగుంది. సిద్దూ, డర్టీఫెల్లో క్యారెక్టర్లను తెరపైన చూపించిన విధానం బాగుంది. కథను, పాత్రలను ఎస్టాబ్లిష్ చేయడంలో సినిమా వేగం కొంత మందగించినట్టు అనిపిస్తుంది. ఫస్టాఫ్ కథను ఓ రేంజ్‌కు మించి నడవదు. కానీ సెకండాఫ్ తర్వాత కథ, కథనాలు, స్టోరీలో మలుపు మూవీని మరో రేంజ్‌కు తీసుకెళ్లాయనే ఫీలింగ్ కలుగుతుంది. డర్టీఫెలో, సిద్దూ క్యారెక్టర్లను డిజైన్ చేసిన తీరులో క్యూరియాసిటీ కనిపిస్తుంది. స్విమ్మింగ్ ఫూల్ సీన్, క్లైమాక్స్ తదితర అంశాలు ప్రేక్షకులను థ్రిల్‌కు గురి చేస్తాయి.

ఇండియన్ నేవీలో పనిచేసిన సోల్జర్ శాంతి చంద్ర హీరోగా సిద్దూ, డర్టీఫెల్లో రెండు పాత్రల్లో చూపించిన వేరియేషన్స్ చూస్తే..నటనపై ఆయనకు ఉన్న తపన కనిపిస్తుంది. ఫైట్స్, రొమాంటిక్ సీన్లలో ఆకట్టుకొన్నాడు. జేపీగా నాగినీడు, శంకర్ నారాయణగా సత్యప్రకాశ్ తమ పాత్రలకు జీవం పోశారు. దీపిక సింగ్, సిమ్రిత్, నిఖిషా రంగ్ గ్లామర్ పంటపండించారు. పోతురాజు పాత్ర ఆకట్టుకొనేలా ఉంటుంది. మిగితా పాత్రల్లో నటించిన వారు తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు.
ఇక సాంకేతిక విభాగాల పనితీరు విషయానకిి వస్తే.. మ్యూజిక్, సినిమాటోగ్రఫి కీలకంగా ఉన్నాయి. సతీష్ కుమార్ అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్. జీఎస్ బాబు అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటర్‌గా సన్నివేశాలను జీవి కట్ చేసిన తీరు బాగుంది.
మాఫియా, రివేంజ్ డ్రామాగా డర్టీ ఫెలో సినిమా తెరకెక్కినప్పటికీ.. ఫ్రెండ్ షిప్, లవ్, యాక్షన్ అంశాలు సినిమాకు ప్లస్‌గా అనిపిస్తాయి. ఇక బలమైన సన్నివేశాలు, ఎమోషన్స్ ఇంకా జొప్పించి ఉంటే సినిమా స్వరూపమే మరోలా ఉండేదనిపిస్తుంది. ఏది ఏమైనా యాక్షన్, మాఫియా సినిమాలను ఆదరించే వారికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఈ వారాంతంలో యాక్షన్ లవర్స్ ఎంజాయ్ చేయడానికి ఈ సినిమాను ఎంపిక చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications











