twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Dirty Hari మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    3.0/5
    Star Cast: శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహానీ శర్మ
    Director: ఎంఎస్ రాజు

    ఉద్యోగ అవకాశాల కోసం సిటీకి వచ్చిన హరి (శ్రవణ్ రెడ్డి) చెస్ ప్లేయర్. ఓ క్లబ్‌లో చెస్ కోచ్‌గా ఉద్యోగంలో చేరుతాడు. అక్కడే వసుధ (రుహాని శర్మ) కుటుంబంతో పరిచయం ఏర్పడుతుంది. వసుధతో పరిచయం ప్రేమగా ఆ తర్వాత పెళ్లి వరకు వెళ్తుంది. ఈ క్రమంలోనే వసుధ సోదరుడి ప్రియురాలు జాస్మిన్ (సిమ్రత్ కౌర్)‌తో శ్రవణ్ ఆకర్షణలో పడుతాడు. వసుధతో పెళ్లి తర్వాత కూడా జాస్మిన్‌తో హరి పీకల్లోతు ప్రేమలో మునిగి పోతాడు. దాని ఫలితంగా జాస్మిన్ ప్రెగ్నెంట్‌గా మారుతుంది.

    డర్టీ హరి కథలో ట్విస్టులు

    డర్టీ హరి కథలో ట్విస్టులు

    వసుధతో హరి రిలేషన్ ఎలా ఉంది? ఓ వైపు వసుధతో ప్రేమలో ఉంటూనే జాస్మిన్‌కు ఎలా దగ్గరయ్యాడు? వసుధను పెళ్లి చేసుకోవడానికి హరి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు. వసుధ సోదరుడికి జాస్మిన్‌కు ఎందుకు బ్రేకప్ జరుగుతుంది. బ్రేకప్ తర్వాత జాస్మిన్‌కు ఎలా చేరువ అయ్యాడు. జాస్మిన్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత హరికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే ప్రశ్నలకు సమాధానమే డర్టీ హరి.

    ఫస్టాఫ్ రివ్యూ

    ఫస్టాఫ్ రివ్యూ

    హరి అనే సాధారణ యువకుడు ఓ కంపెనీకి అధినేతగా మారిన క్రమంలో అతడి జీవితంలో చోటుచేసుకొన్న కొన్ని విషయాలు ఎలాంటి పరిస్థితులకు దారి తీసాయనే అంశాల కూర్పే డర్టీ హరి. ముఖ్యంగా హరి, జాస్మిన్ రెండు పాత్రల మధ్య జరిగే సంఘర్షణ, లవ్, రొమాన్స్, థ్రిల్లింగ్ విషయాలు సినిమా ప్రథమార్థంలో ఆసక్తికరంగా సాగుతాయి. ముఖ్యంగా యూత్‌‌ను విపరీతంగా ఆకట్టుకొనేలా ఉంటాయి. సున్నితమైన రిలేషన్స్ ఓ వైపు కొనసాగిస్తునే.. మరోవైపు క్లిష్టమైన బంధాలను చూపించడంలో దర్శకుడు ఎంఎస్ రాజు సక్సెస్ అయ్యాడు.

    సెకండాఫ్ రివ్యూ

    సెకండాఫ్ రివ్యూ

    ఇక సెకండాఫ్‌లో చోటుచేసుకొనే హరి, జాస్మిన్, వసుధ మధ్య చోటుచేసుకొన్న కథ, కథనాలు, సన్నివేశాలు సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి కైమాక్స్ తెర మీద కనిపించే సన్నివేశాలు ప్రేక్షకుడిని కొత్త అనుభూతిని కలిగించడమే కాకుండా థ్రిల్లింగ్ అనిపిస్తాయి. ముఖ్యంగా చివరి అరగంట సినిమా అద్భుతమైన ఫీలింగ్‌కు గురిచేస్తుంది.

    దర్శకుడిగా ఎంఎస్ రాజు

    దర్శకుడిగా ఎంఎస్ రాజు

    నిర్మాతగా, దర్శకుడిగా ఎంఎస్ రాజు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ గత కొద్ది సంవత్సరాలుగా వచ్చిన గ్యాప్‌ను ఫిల్ చేసుకోవడానికి ఎంఎస్ రాజులో ఉన్న కసిని, ఛాలెంజ్‌ను డర్టీ హరి రూపంలో చూసుకోవచ్చు. సక్సెస్ మళ్లీ చేజిక్కించుకోవడానికి భారీ పంజానే విసిరాడా అనిపిస్తుంది. ఆయన వయసును పక్కన పెడితే.. యూత్ తగినట్టు రాసుకొన్న కథ, కథనాలు షాకింగ్‌గా ఉంటాయి. ఒక్కో దశలో ఇది ఎంఎస్ రాజు తీసిన సినిమానేనా అనే ఫీలింగ్ కలుగుతుంది. డర్టీ హరి ఆయనకు కమ్ బ్యాక్ మూవీ అని ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. సినిమాకు సంబంధించిన అన్ని విభాగాల్లో ఎంఎస్ రాజు టేస్ట్ కనిపిస్తుంది.

    శ్రవణ్ రెడ్డి యాక్టింగ్

    శ్రవణ్ రెడ్డి యాక్టింగ్

    హరి పాత్రలో శ్రవణ్ రెడ్డి చక్కగా ఒదిగిపోయాడు. నటనలోనే కాకుండా హావభావాలు చక్కగా పలికించాడు. హరి పాత్రకు కావాల్సిన పరిణితిని సునాయసంగా చూపించాడు. కీలక సన్నివేశాల్లో అనుభవం ఉన్న హీరోగా నటించడం హరి పాత్రకు పాజిటివ్‌గా మారిందని చెప్పవచ్చు. రొమాంటిక్ సీన్లలో హరి అద్భుతంగా నటించాడు. చివరి అరగంటలో శ్రవణ్ రెడ్డి నటన హైలెట్‌గా మారింది.

    సిమ్రత్ కౌర్ ఫెర్ఫార్మెన్స్

    సిమ్రత్ కౌర్ ఫెర్ఫార్మెన్స్

    ఇక డర్టీ హారి సినిమాలో జాస్మిన్, వసుధ పాత్రలు పోటాపోటిగా ఉన్నాయి. జాస్మిన్‌గా సిమ్రత్ అద్భుతంగా తన రొమాన్స్‌ను పండించింది. బోల్డ్ పాత్రలో ఒదిగిపోయింది. శ్రవణ్ రెడ్డితో తెరమీద కెమిస్ట్రీ ఇరగదీసింది. యాక్టింగ్ పరంగా కూడా మెప్పించింది. ఇక రుహాని శర్మ విషయానికి వస్తే భారమైన పాత్రను తనదైన శైలిలో పోషించింది. రకరకాల ఎమోషన్స్, సెన్సిబుల్‌గా ఉండే వసుధ పాత్రతో రుహాని అందర్నీ ఆకట్టుకోవడం గ్యారంటి. భావోద్వేగంతో కూడిన పాత్రకు 100 శాతం న్యాయం చేసింది.

    టెక్నికల్‌ విభాగాల పనితీరు

    టెక్నికల్‌ విభాగాల పనితీరు

    సాంకేతిక విభాగాల పనితీరుకు వస్తే.. సినిమాకు మార్క్ కే రాబిన్ మ్యూజిక్ అదనపు ఆకర్షణ. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ఇక సినిమాటోగ్రఫి చాలా నీట్‌గా ఉంది. సినిమాటోగ్రాఫర్ ఎంఎన్ బాల్‌రెడ్డి సన్నివేశాలను చిత్రీకరించిన విధానం బాగుంది. జునైద్ సిద్ధిఖీ ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది.

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ఎస్‌పిజే క్రియేషన్స్ పతాకంపై గూడూరు శివరామకృష్ణ, గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్, హై లైఫ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి , వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మించారు. నటీనటులు, టెక్నిషియన్స్ ఎంపిక బాగుంది. సినిమాను ప్రతీ ఫ్రేమ్‌ను చాలా రిచ్‌గా అందించిన తీరు చూస్తే సినిమా నిర్మాణంపై వారికి ఉన్న అభిరుచి కనిపిస్తుంది. ఈ సినిమా కోసం ఉపయోగించిన లొకేషన్లు చాలా బాగున్నాయి.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    ఇక ఓవరాల్‌గా చెప్పాల్సి వస్తే.. డర్టీ హరి ఇటీవల కాలంలో వచ్చిన అద్భుతమైన రొమాంటిక్, సస్పెన్స్ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు అత్యంత ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా ఇది యూత్‌కు విశేషంగా నచ్చతుంది. కొంత అడల్ట్ కంటెంట్ తప్పిస్తే.. మిగితా విషయాలన్నీ ఇటీవల కాలంలో జరిగే సంఘటనలుగా మనకు నిత్యం కనిపిస్తుంటాయి. రొమాంటిక్, థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రతీ ఒక్కరికి కొత్త అనుభూతిని పంచుతాడు ఈ డర్టీ హరి.

    English summary
    Dirty Hari movie review and Rating: Dirty Hari movie first talk: Sunil, Ajay Bhupati reviews romantic thriller. Hero Sravan Reddy about dirty hari and Bold scenes shoot with Simrat Kaur. Shravan Reddy said that, He was born and brought up in hyderabad. its was nice experience to work with MS Raju and different movie like dirty hari.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X