Dirty Hari movie's first talk: క్లైమాక్స్ చించేసింది.. రొమాంటిక్ థ్రిల్లర్‌పై ప్రముఖుల ప్రశంసలు..

టాలీవుడ్‌కు బ్లాక్ బస్టర్లు అందించిన నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వంలో శ్రవణ్ రెడ్డి‌ను తెలుగులో హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన చిత్రం డర్టీ హరి. ఎస్.పి.జె క్రియేషన్స్ పతాకంపై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ మరియు హై లైఫ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై కేదార్ సెలగంశెట్టి , వంశీ కారుమంచి ఈ చిత్రాన్ని నిర్మించారు. సస్పెన్స్‌, రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం ఈ నెల 18న ఫ్రైడే మూవీస్ ATT యాప్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నది.

 సినీ ప్రముఖులకు ప్రత్యేక షో

సినీ ప్రముఖులకు ప్రత్యేక షో

బాలీవుడ్ పలు షోలలో నటించిన శ్రవణ్ రెడ్డి, పరిచయం మూవీ ఫేమ్ సిమ్రత్ కౌర్, రుహాని శర్మ ఇందులో హీరోయిన్లు గా నటించారు. ఈ సినిమాను ఇటీవల చిత్ర ప్రముఖులకు ప్రత్యేక షోను ప్రదర్శించారు. హీరో, కమెడియన్ సునీల్, దర్శకుడు అజయ్ భూపతి ఇతర ప్రముఖులు ఈ ప్రీమియర్‌కు హాజరయ్యారు.

కమెడియన్ సునీల్ ట్వీట్ చేస్తూ..

కమెడియన్ సునీల్ ట్వీట్ చేస్తూ..

డర్టీ హారి చిత్రాన్ని చూసిన తర్వాత నటుడు సునీల్ ట్వీట్ చేస్తూ.. ఎంఎస్ రాజు రూపొందించిన డర్టీ హరి చూశాను. సినిమా చూసినంత సేపు మైండ్ బ్లాక్ అయింది. ప్రతీ సీన్‌లోను లీనమైపోయాను. ప్రతీక్షణాన్ని ఆస్వాదించాను. సినిమా ముగింపు అద్భుతంగా ఉంది. తెలుగు సినిమా ప్రేక్షకులకు ఇది కొత్త ఎక్సీపిరియెన్స్ అవుతుంది. ఇంతకు ముందు డర్టీ హరి చూసిన తర్వాత కలిగిన ఫీలింగ్ ఎప్పుడూ కలుగలేదు అని సునీల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

 మిస్ చేసుకోవద్దు అంటూ సునీల్ ట్వీట్

మిస్ చేసుకోవద్దు అంటూ సునీల్ ట్వీట్

డర్టీ చిత్రాన్ని మిస్ చేసుకోకండి. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో అలాంటి ఫీలింగ్ మీకు కలుగుతుందనే గ్యారెంటీ ఇస్తాను. సినిమా చూసిన తర్వాత నా గొంతు పెగల్లేదు. సినిమా ఎండింగ్‌ విసయాన్ని మాటల్లో చెప్పలేకపోయాను. నిర్మాత, దర్శకుడు ఎంఎస్ రాజుకు ఈ చిత్రం కమ్ బ్యాక్ మూవీ అవుతుంది. ఈ సినిమా ఫ్రైడేమూవీ ఏటీటీ‌ యాప్‌లో డిసెంబర్ 18వ తేదీన ప్రీమియర్ అవుతుంది. తప్పకుండా చూడండి అంటూ సునీల్ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

యూత్‌ను విశేషంగా ఆకట్టుకొంటుందంటూ..

యూత్‌ను విశేషంగా ఆకట్టుకొంటుందంటూ..


డర్టీ హరి సినిమా చూసిన దర్శకుడు అజయ్ భూపతి ట్విట్టర్‌లో స్పందించాడు. డర్టీ హరి మూవీ చూశాను. సినిమా చూసిన తర్వాత మొత్తం మీ మైండ్‌లో ఉండిపోతుంది. యూత్‌కు విశేషంగా ఆకట్టుకొంటుంది. రొమాంటిక్, థ్రిల్లర్ మూవీని తప్పకుండా చూడండి. ఎంఎస్ రాజు ఆయన టీమ్ సభ్యులందరికీ ఆల్ ది బెస్ట్ అంటూ అజయ్ భూపతి ట్వీట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X