ప్రేక్షకుడి సహనానికి పరీక్ష (డిస్కో రివ్యూ..)
దర్శకత్వం: హరి కె. చందూరి
నిర్మాత: అభినవ్ రెడ్డి, రామలింగారెడ్డి
సంగీతం: ఆనంద్
కథ, మాటలు: సతీష్ మల్లెంపాటి
సినిమాటోగ్రఫీ: జోషి
డిస్కో(నిఖిల్) ఓ అనాధ. ఖయ్యూం, విజయ్ సాయి, పైడితల్లి డిస్కో స్నేహితులు. అంతా గాలి తిరుగుళ్లు తిరిగే రకం. ఈక్రమంలో ఇంట్లో వాళ్లతో చివాట్లు తిన్న వారంతా ఉద్యోగం వేటలో పడతాడు. సూర్యభాయ్(ఎంఎస్ నారాయణ) వీరికి బ్యాంక్ రికవరీ ఆఫీసర్స్‌గా జాబ్ ఇప్పిస్తాడు. జాబ్ చేస్తూ డబ్బులు రికవరీ చేస్తుంటారు. షైనీ(సారా శర్మ) అనే అమ్మాయిపై మనసు పారేసుకున్న డిస్కో ఆమెకు తన ప్రేమను వ్యక్తీకరిస్తాడు. అయితే నిన్ను ప్రేమించాలంటే తన తండ్రిని ఒప్పించాలని చాలెంజ్ చేస్తుంది షైనీ. దీంతో తన ప్రేమను గెలుచుకోవడం కోసం ఫ్రెండ్స్‌తో కలిసి హీరో బ్యాంకాక్‌లో ల్యాండ్ అవుతాడు. అక్కడికి వెళ్లిన తర్వాత తెలుస్తుంది షైనీ ఫాదర్ లోకల్ డాన్ అషూభాయ్ (ఆశిష్ విద్యార్థి) కూతురని. ఈ క్రమంలో చిక్కుల్లో పడ్డ హీరో స్నేహమా? ప్రేమా? అనే క్లిష్ట పరిస్థితుల్లో ఇరుక్కుంటాడు....మరి హీరో ఏం చేశాడు? అనేది మిగిలిన కథ.
నిఖిల్ నటన పూర్తిగా పవన్ కళ్యాణ్, రవితేజలను అనుకరించినట్లు ఉండటంతో అతని పెర్ఫార్మెన్స్ వర్కౌట్ కాలేదనే చెప్పాలి. హీరోయిన్ సారా శర్మ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్. విలన్ పాత్రలో ఆశిష్ విద్యార్థి పెర్ఫార్మెన్స్ బాగోలేదు అనడం కన్నా అతన్ని సరిగా వాడుకోలేక పోయారని చెప్పొచ్చు. అయితే మహేష్ బాబును అనుకరిస్తూ సూర్య భాయ్ పాత్రలో ఎం.ఎస్.నారాయణ అలరించాడు. అలీ, రఘుబాబు ఫర్వాలేదనిపించారు. ఇతర నటీనటులు వారి వారి పరిధి మేరకు నటించారు.
పూరి జగన్నాథ్ శిష్యుడిగా దర్శకుడిగా పరిచయమైన హరి కె. చందూరి దర్శకత్వం పూర్‌గా ఉంది. కథలో కొత్తదనం లేదు, స్క్రీన్ ప్లే చెత్తగా ఉంది. లాజిక్ లేని సీన్లను ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తాయి. రీ రికార్డింగ్ కూడా సరిగా లేదు. ఆనంద్ సంగీతం పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చాలా చెత్తగా ఉంది. సతీష్ మల్లెంపాటి డైలాగులు ఫర్వా లేదు. సినిమాటోగ్రఫీ ఓకే.
మొత్తం మీద డిస్కో సినిమాకు వెళ్లడం అంటే....ప్రేక్షకుడి సహనానికి పరీక్షే అని చెప్పక తప్పదు.


Click it and Unblock the Notifications












