For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  డిస్కోరాజా మూవీ రివ్యూ అండ్ రేటింగ్

  |

  Rating:
  2.5/5
  Star Cast: రవితేజ, పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, బాబీ సింహా, తాన్యా హోప్
  Director: వీఐ ఆనంద్

  టచ్ చేసి చూడు, నేల టిక్కెట్, అమర్ అక్బర్ ఆంటోని లాంటి చిత్రాలు చేసి సక్సెస్ కొట్టలేకపోయాడు మాస్ మహారాజా రవితేజ. కమర్షియల్ ఫార్మాట్ మార్చి..పూర్తిగా కొత్త ట్రాక్‌లోకి ఎక్కి వీఐ ఆనంద్ లాంటి దర్శకుడితో డిస్కోరాజా చేశాడు. తీసిన ప్రతీ సినిమాకు ఏదో ఒక కొత్త పాయింట్‌ను చూపించిన వీఐ ఆనంద్.. రవితేజతో పూర్తిగా డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. టీజర్, పాటలు, ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెంచేసిన చిత్రయూనిట్.. నేడు (జనవరి 24) సినిమాను విడుదల చేసింది. మరి ఈ చిత్రం ఇటు రవితేజకు, అటు వీఐ ఆనంద్‌కు ఏ మేరకు కలిసి వచ్చిందో ఓ సారి చూద్దాం.

  కథ

  కథ

  ఓ మనిషి హత్యకు గురవుతాడు. మెడికల్ స్టూడెంట్స్‌కు దొరికిన ఆ శవంపై ప్రయోగాలు చేస్తారు. చనిపోయిన మనుషులు బతికించే ఆ ప్రయోగాన్ని ప్రభుత్వం వద్దని చెప్పినా.. అనాథ శవం, ఎలాంటి సమస్య రాదని ప్రయోగం చేసి అతడ్ని బతికిస్తారు. జీవం అయితే పోశారు గానీ గతాన్ని మాత్రం తీసుకురాలేరు. గతం గుర్తుకు రావడానికి చేసిన ప్రయత్నాలు ఏంటి? చివరకు గతమెలా గుర్తించింది. చివరకు ఏం జరిగిందనేది కథ.

  కథలోని ట్విస్టులు..

  కథలోని ట్విస్టులు..

  చనిపోయి బతికిన ఆ మనిషి ఎవరు? డిస్కోరాజా గతం ఏంటి? ఈ కథలో వాసు (రవితేజ) పాత్రకు ఉన్న సంబంధం ఏంటి? డిస్కోరాజాపై సేతు (బాబీ సింహా) పగను ఎందుకు పెంచుకుంటాడు? డెబ్బై యేళ్లైనా డిస్కోరాజా యవ్వనంలోనే ఎందుకు ఉంటాడు? ఈ కథలో ఆంటోనీ దాస్ (సునీల్) క్యారెక్టర్, హెలెన్ (పాయల్ రాజ్‌పుత్)కు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే డిస్కోరాజా.

  ఫస్టాఫ్ అనాలిసిస్..

  ఫస్టాఫ్ అనాలిసిస్..

  లఢఖ్‌లో ఓ మనిషిని కిరాతకంగా చంపేయడం, మెడికల్ స్టూడెంట్స్‌కు అతను దొరకడం లాంటి సీన్స్‌తో ఫస్ట్ సీన్‌లోనే క్యూరియాసిటీ పెంచేలా ఉంది. ఆపై వాసు కుటుంబ కష్టాలు, నభా నటేష్ ఎంట్రీతో కథను ముందుకు వెళ్తుంది. చనిపోయిన వ్యక్తిపై ప్రయోగాలు చేయడం, మళ్లీ బతికించడం లాంటి సీన్స్‌తో కథలో వేగం పెరిగినట్టు అనిపిస్తుంది. అతనికి గతం గుర్తుకు రావడానికి ప్రయత్నించే సీన్స్, నభా నటేష్ సీన్స్, వాసును వెతుక్కుంటూ వెళ్లే వేరే గ్యాంగ్ ఇలా అంతా గజిబిజీగా సాగుతుండటంతో కాస్త గందరగోళం నెలకొన్నట్టు అనిపిస్తుంది. ప్రథమార్థం వచ్చే ఓ ట్విస్ట్ అందర్నీ థ్రిల్ చేసేలా ఉంటుంది. అయితే ఎక్కడా ఓ ఫ్లోలో వెళ్లినట్టు అనిపించకపోవడం, స్పీడ్ బ్రేకుల్లా ఉన్నట్లు అనిపించే కథనంతో ఫస్టాఫ్ పర్వాలేదనిపించేట్టు ఉంది.

   సెకండాఫ్ అనాలిసిస్..

  సెకండాఫ్ అనాలిసిస్..

  డిస్కోరాజా గతం మొదలవడం, దొంగతనాలు చేస్తూ గ్యాంగ్ స్టర్‌గా ఎదిగే వైనం.. ఇంతకు ముందు చాలా సినిమాల్లో చూసేసిన ఫీలింగే కలుగుతుంది. అయినా సత్య, సునీల్ చేసే కామెడీ, రవితేజ ప్రజెన్స్ అన్నీ కొత్తగా ఉండటంతో ఎక్కడా బోర్ అనిపించకపోవడంతో సెకండాఫ్ అలా ముందుకు సాగుతుంది. సేతు ఎంట్రీ ఇవ్వడం, వైరం మొదలవ్వడం, డిస్కోరాజా బిర్యానీ వండటం వంటి సీన్స్‌తో సెకండాఫ్ మరో లెవెల్‌కు వెళ్లినట్టు అనిపిస్తుంది. హెలెన్ (పాయల్ రాజ్‌పుత్) పాత్ర ఎంట్రీ ఇవ్వడం, ఆమెతో ఉండే లవ్ సీన్స్, ఆమె అప్పీయరెన్స్ అన్నీ ఫ్రెష్‌గా అనిపిస్తాయి. ఇదీ ఒక సాధారణ రివేంజ్ స్టోరీలానే అనిపించడం కాస్త మైనస్ అయితే.. చివర్లో వచ్చే ట్విస్ట్‌కు తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా థ్రిల్ అవ్వడం కలిసొచ్చే అంశం. మొత్తానికి సెకండాఫ్‌ రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను మెప్పించే అవకాశం ఉంది.

  నటీనటుల పర్ఫామెన్స్

  నటీనటుల పర్ఫామెన్స్

  డిస్కోరాజాగా రవితేజ నటన ఇది వరకెన్నడూ చూడని విధంగా ఉంటుంది. డైలాగ్ డెలివరీలో గానీ, లుకింగ్ గానీ, ఆటిట్యూడ్ గానీ, స్టైల్ గానీ ఇలా అన్నింటిలో వేరే లెవెల్ అనిపిస్తాడు. ఫుల్ ఎనర్జీగా నటించిన మాస్ మహారాజా అభిమానులనే కాదు.. సగటు సినీ ప్రేక్షకుడిని సైతం అలరించేలానే ఉన్నాడు. ఈ కథలో డిస్కోరాజా తరువాత సేతు, హెలెన్, ఆంటోనీ దాస్ పాత్రల గురించి చెప్పుకోవాలి. సేతు పాత్రలో విలనిజం పండించడంలో బాబీ సింహా పాస్ అయ్యాడు. హెలెన్ పాత్రలో పాయల్ కొత్తగా అనిపిస్తుంది.. చెవిటి, మూగ పాత్రను పోషించిన పాయల్.. లుక్స్‌తోనే ఆకట్టుకుంది. ఇక ఆంటోనీ దాస్ పాత్రలోనూ సునీల్ అందరినీ షాక్‌కు గురి చేస్తాడు. వెన్నెల కిషోర్, సత్య వంటి వారితో కావాల్సినంత ఫన్‌ను క్రియేట్ చేశారు. నభా నటేష్, తాన్యా హోప్‌లు కనిపించింది కొద్ది సేపే అయినా.. ప్రేక్షకులను ఆకట్టుకునేలానే ఉన్నారు. సత్యం రాజేశ్, జబర్దస్త్ మహేష్ , అన్నపూర్ణ ఇలా మిగిలిన వారంతా తమ పరిధి మేరకు నటించారు.

  దర్శకుడి పనితీరు..

  దర్శకుడి పనితీరు..

  ఎక్కడికి పోతావు చిన్నివాడా, ఒక్క క్షణం లాంటి డిఫరెంట్ చిత్రాలను తెరకెక్కించిన వీఐ ఆనంద్ నుంచి ఓ సినిమా వస్తుందంటే అందరూ ఏదో ఒక కొత్త పాయింట్, కొత్త దనం ఉంటుందని భావిస్తారు. అయితే చనిపోయిన మనిషిని బతికించడం అనే ఒక్క పాయింట్ తప్పా.. డిస్కోరాజాలో కొత్తదనం ఎక్కడా కనిపించదు. ఎప్పుడో అరిగిపోయిన గ్యాంగ్ స్టర్ రివేంజ్ స్టోరీని మళ్లీ డిస్కోరాజా రూపంలో ప్రేక్షకులకు అందించాడు. ఇద్దరు గ్యాంగ్ స్టర్‌లు, వారిద్దరి మధ్య పోటీ, హీరోకు ఓ ప్రేమ వ్యవహారం, హీరోయిన్ కోసం మంచిగా మారడం, హీరోయిన్‌ను ఎవరో చంపేయడం, చివరకు హీరో వచ్చి అందర్నీ మట్టుబెట్టడం. ఇదే కథను కొత్త సైంటిఫిక్‌ టర్మినాలజీ ఉపయోగించి వీఐ ఆనంద్ చెప్పాడు. అయితే ఈ కథకు అది అవసరం లేకుండా అయినా చెప్పొచ్చు. మొదటి నుంచి ఆసక్తి రేకెత్తించేలా టీజర్, ట్రైలర్ కట్ చేయడంతో ఇదేదో సైంటిఫిక్ ఫిక్షన్ సినిమా అనుకున్న ప్రేక్షకుడికి నిరాశ కలిగి అవకాశం ఉంది. అయితే ఇది వరకెన్నడూ చూడని రవితేజను చూపించడంలో, ఆయన ఫ్యాన్స్‌ను మెప్పించడంలో వీఐ ఆనంద్ సక్సెస్ అయ్యాడనే చెప్పవచ్చు.

  నటీనటులు..

  నటీనటులు..

  నటీనటులు : రవితేజ, పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, బాబీ సింహా, తాన్యా హోప్ తదితరులు
  దర్శకత్వం : వీఐ ఆనంద్
  నిర్మాత : రామ్ తాళ్లూరి
  బ్యానర్ : ఎస్.ఆర్.టీ ఎంటర్టైన్మెంట్
  మ్యూజిక్ : తమన్
  సినిమాటోగ్రఫి : కార్తీక్ ఘట్టమనేని
  ఎడిటింగ్ : నవీన్ నూలీ

  ప్లస్ పాయింట్స్

  ప్లస్ పాయింట్స్

  రవితేజ
  సంగీతం
  సినిమాటోగ్రఫీ

  మైనస్ పాయింట్స్
  కథలో కొత్తదనం లేకపోవడం
  గజిబిజీగా అనిపించే కథనం

  సాంకేతిక నిపుణుల పనితీరు..

  సాంకేతిక నిపుణుల పనితీరు..

  డిస్కోరాజా విషయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సంగీతం, సినిమాటోగ్రఫీ. తమన్ తన పాటలతో, నేపథ్య సంగీతంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. పాటలు ఎంత వినసొంపుగా అనిపిస్తాయో.. వాటిని అంతే అందంగా చూపించడంలో కార్తీక్ ఘట్టమనేని కెమెరాపనితం కనిపిస్తుంది. సినిమా ప్రారంభంలో వచ్చే లఢఖ్ సీన్స్‌ను అద్భుతంగా చూపించడంలోనూ, రవితేజను కొత్తగా చూపించడంలోనూ కార్తీక్ పనితనం కనిపిస్తుంది. ఓ ఫ్లో మిస్ అయినట్టు ఉండటంతో ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త దృష్టి పెడితే బాగుండేదేమోనన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆర్ట్ విభాగం, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి.

  Disco Raja Highlights || Disco Raja Twitter Review
  ఫైనల్‌గా..

  ఫైనల్‌గా..

  వరుస చిత్రాలతో అపజయాలు చవిచూస్తు వస్తోన్న రవితేజకు.. డిస్కోరాజా ఉపశమనం కలిగించేలానే ఉంది. ఇంతకు ముందెన్నడూ కనిపించని ఎనర్జీతో నటించడంతో మాస్ మాహారాజా అభిమానులకు కన్నులపండుగలా అనిపిస్తుంది. అయితే కమర్షియల్‌గా డిస్కోరాజా ఏ రేంజ్‌కు వెళ్తుందో ఇప్పుడే చెప్పలేం.

  English summary
  Disco Raja is an Telugu language Scientic Fiction And Emotional Drama written and directed by VI Anand. The film stars Raviteja, Payal Rajput, Nabha Natesh And Bobby Simha. This movie released on January 24th 2020.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X