Do Patti Twitter Review: దో పత్తి ట్విట్టర్ రివ్యూ.. కాజోల్, కృతిసనన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతిసనన్, యువ రచయిత, దర్శకురాలు కనికా ధిల్లాన్ నిర్మాతలుగా మారి తెరకెక్కించిన చిత్రం దో పత్తి (Do Patti). యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు యువ డైరెక్టర్ శశాంక చతుర్వేది దర్శకత్వం వహించారు. కథా పిక్చర్స్, బ్లూ బటర్‌ఫ్లై ఫిల్మ్స్ సంయుక్తంగా నిరిస్తున్న ఈ చిత్రం నేరుగా ఓటీటీలో అక్టోబర్ 28వ తేదీన గ్రాండ్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవుతున్నది. ఈ మూవీని ముంబైలో సెలెబ్రిటీలకు ప్రివ్యూ షోను ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారి స్పందన ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..
దో పత్తి సినిమా ఎమోషనల్ మిస్టరీ చిత్రం. కనికా థిల్లాన్ స్క్రిప్టు అద్బుతంగా తీర్చిదిద్దింది. నటీనటుల ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. కృతిసనన్ ద్విపాత్రాభినయంతో మెప్పించారు. విభిన్నమైన నటనతో ఆకట్టుకొన్నారు. కాజోల్ స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. పోలీస్ ఆఫీసర్‌గా డిడికేటెడ్ యాక్టింగ్‌ను చూపించింది. కనిక థిల్లాన్ అద్బుతంగా కథను తెరకెక్కించింది అని నెటిజన్లు తెలిపారు.

దో పత్తి సినిమా కథ ఆకట్టుకొనేలా ఉంది. కాజోల్ , కృతిసనన్, హాహీర్ షేక్ నిజాయితీతో కూడిన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నారు. రైటింగ్, డైరెక్షన్‌లో లోపాలు ఉన్నాయి. పాత్రలను డెప్త్‌గా రాయడంలో విఫలమయ్యారు. కథలోని మలుపు మెప్పించలేకపోయాయి. ఈ సినిమా నన్ను డిజాపాయింట్ చేసింది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
దో పత్తి సినిమాను ప్రీమియర్‌లో చూశాను. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవుతున్న సినిమాకు సంబంధించిన కథ చెప్పిన విధానం బాగుంది. కాజోల్, కృతిసనన్ అద్బుతంగా నటించారు. కనిక థిల్లాన్ మేకర్‌గా బ్రిల్లియెంట్ సినిమాను అందించారు. ఈ సినిమా బాగుంది. తప్పకుండా చూడండి అంటూ నటి షీనా చోహాన్ ట్వీట్ చేశారు.
దో పత్తి గృహ హింస నేపథ్యంగా సాగే డ్రామా థ్రిల్లర్. ఈ సినిమాలో సన్నివేశాలు, ఇక ముందు ఏం జరుగబోతుందనే విషయం ముందుగానే ఊహించవచ్చు. కాకపోతే కృతిసనన్, కాజలో, షాహీర్ షేక్ తన నటనతో సినిమాను నిలబెట్టారు. కథ పాతదే. కానీ కొన్ని సీన్లు కొత్తగా ఉండటమే కాకుండా సినిమాలో లీనమయ్యేలా చేసింది. మీరు కాజోల్ అభిమాని అయితే తప్పకుండా నచ్చుతుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
దో పత్తి సినిమా చూశాను. తెర మీద కాజోల్ క్వీన్‌లా కనిపించింది. ద్విపాత్రాబినయంతో కృతిసనన్ నటన ఆమెతో ప్రేమలో పడేలా చేస్తుంది. షాహీర్ షేక్ కమ్ బ్యాక్ మూవీ. ఓటీటీలో మీరు తప్పుకుండా కొత్త అనుభూతిని పొందుతారు. ఇప్పటి వరకు ఈ సినిమా గురించి అంతే చెబుతాను అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
దో పత్తి సినిమా ప్రీమియర్ చూశాను. ఎమోషన్స్‌తో కూడిన రోలర్ కోస్టర్ రైడ్‌లా ఉంది. ట్విస్టులు, టర్నులు సినిమాను ఫీల్‌గుడ్‌లా మార్చాయి. ఈ సినిమా చూసిన తర్వాత నటీనటుల యాక్టింగ్ చాలా కాలం మిమ్మల్ని వెంటాడుతాయి. ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో మిస్ చేసుకోకండి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











