'ఢాం' శ్రీను('డాన్ శీను' రివ్యూ)

By Srikanya
Don Seenu
Rating
-జోశ్యుల సూర్య ప్రకాష్
బ్యానర్: ఆర్.ఆర్.మూవీ మేకర్స్
చిత్రం: డాన్ శీను
నటీనటులు: రవితేజ, శ్రీహరి, శ్రియ, అంజనా సుఖానీ, శాయాజీ షిండే, మహేష్ ముంజ్రేకర్,
బ్రహ్మానందం, అలీ, వేణు మాధవ్, రఘు బాబు, కస్తూరి తదితరులు.
సంగీతం: మణి శర్మ
మాటలు: కోన వెంకట్
కూర్పు: గౌతమ్ రాజు
ఛాయా గ్రహణం: సమీర్ రెడ్డి
కథ, స్క్రిన్ ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాత: వెంకట్
విడుదల తేదీ: 06/08/2010

క్యాచీగా ఉండే టైటిల్, రవితేజ మార్కు కామిడీ, బ్రహ్మానందం సడెన్ ఎంట్రీ, హీరోయిన్ సెక్సీ డాన్స్ లు...కలిగలిపితే చాలు సినిమా సూపర్ హిట్టు...అన్న భ్రమతో తీసిన చిత్రం డాన్ శీను. కథను ప్రక్కన పెట్టి కామిడీ కోసం కథనాన్ని ఎలా కావాలంటే అలా మార్చుకుంటూ ఆల్రెడి వచ్చిన చిత్రాల సీన్స్ ను గుర్తు చేస్తూ వచ్చిన ఈ చిత్రం ఫస్టాఫ్ ఓకే అనిపించుకుంది కానీ సెకెండాఫ్ దారుణంగా మారిపోయింది. వరసగా నవ్వించటానికే అన్నట్లు అక్కడిక్కడ పంచ్ చూసుకుని అల్లిన స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు సహన పరీక్ష పెట్టి రవితేజ..ఖతర్నాక్ ని గుర్తు చేసింది. రవితేజ, కామిడీ ఉంటే సరిపోదు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసే కథ కూడా కావాలని నొక్కి చెప్పిన చిత్రం ఇది.

శీను(రవితేజ)కి చిన్నప్పటి నుంచీ అమితాబ్ సినిమా డాన్ అంటే విపరీతమైన పిచ్చి. దాంతో పెద్దయ్యాక తాను డాన్ అవ్వాలని..తనని అందరూ డాన్ శ్రీను అని పిలవాలని కోరుకుంటాడు. (అయితే ఎంత తింగరోడైనా పెద్దయ్యాక ఇలా సినిమాల్లో డాన్ లా అవ్వాలని ఎవరన్నా అనుకుంటాడా అని లాజిక్కు తీయకండి). ఆ కోరికను తీర్చుకోవటానికి మన శీను..సారి డాన్ శీను హైదరాబాద్ వస్తాడు. అతనొచ్చే సమయానికి హైదరాబాద్ ని మాచిరాజు(షాయాజీ షిండే), నర్సింగ్(శ్రీహరి) అనే ఇద్దరు డాన్ లు పాలిస్తూంటారు. ఇద్దరికీ ఒకరంటే మరొకరకి పడదు. ఇది గమనించిన శీను తన తెలివితో మాచిరాజుని ఆకర్షించి అతని గ్యాంగ్ లో చేరతాడు. అక్కడ మాచిరాజు..శీను షార్ప్ నెస్ చూసి తన రైవల్ అయిన నర్సింగ్ చెల్లెలుని ప్రేమలో పడేయ్యమని పని అప్పచెబుతాడు. నర్సింగ్ చెల్లెలు..జర్మనీలో ఉంది. అయితే ఆమెకు ఆల్రెడీ సూపర్ డాన్ దుగ్గల్ భాయ్(మహేష్ మంజ్రేకర్) కొడుకుతో పెళ్ళి సెట్ అయి ఉంటుంది. ఇక జర్మనీ వెళ్లిన శీను అక్కడ దీప్తి(శ్రియ)ని ప్రేమలో పడేస్తాడు. అయితే అతనికి తెలిసే విషయం ఏమిటంటే..దీప్తి..నర్సింగ్ చెల్లెలు కాదని...మాచిరాజు చెల్లెలని. అప్పుడు శీను ఏం చేసాడు. ఇద్దరు డాన్ లకు ఎలా బుద్ది చెప్పాడనేది మిగతా కథ.

డాన్ శీను గా రవితేజ ఎప్పటిలాగే తన పూర్తి ఎనర్జీతో అదరకొట్టాడనే చెప్పాలి. అయితే కథ సహకరించకపోవటంతో కొంత ఇబ్బంది పడ్డాడు. డాన్ అవుదామని హైదరాబాద్ వచ్చిన వ్యక్తి ఆ పనిలో ఉండక..లోకల్ గా ఉన్న డాన్ చెప్పాడని...తన లక్ష్యం మరిచిపోయి...ఓ అమ్మాయిని ప్రేమలో పడేయటానికి జర్మనీ బయిలుదేరటంతోనే కథ ప్రక్క దారి పట్టింది. విలన్ చెప్పినట్లు చేయటానికి అతను కమిట్ అవటంతోనే హీరో పాత్ర ప్యాసివ్ గా మారిపోయింది. సిటీలో ఆల్రెడీ ఇద్దరు డాన్ లు ఉన్నారని తెలిసినప్పుడు వారిని లొంగతీసి వారితో తానే పెద్ద డాన్ అనిపించుకోవాలనే ప్రయత్నాలు చేయకుండా ప్రేమలో మునిగితేలటం, సెకెండాఫ్ లో ప్రేమ నాటకాలాడటం చేస్తాడు. దాంతో డాన్ శ్రీను అనే టైటిల్ చూసి..హీరో డాన్ అవటానికి ఏమేం కష్టాలు పడ్డాడో అని హాస్యంగా చెప్పి ఉంటారనుకుని ఊహించుకుని వెళ్ళిన సగటు ప్రేక్షకుడుకి నిరాశే ఎదురవతుంది. ఇదంతా కథని అనుకున్న పాయింట్ వైపుకి నడపకపోవటంతో వచ్చిన సమస్య.

నిజానికి ఈ కథకి అమితాబ్ చూసి ప్రేరణ పొంది డాన్ అవుదామనే కోరిక ఉన్న కుర్రాడి అవసరమే లేదు. అలాగే ఈ కథకి కోన వెంకట్ స్క్రీన్ ప్లే సమకూర్చటం వలనే ఏమో గానీ రెడీ లాంటి అతని గత చిత్రాలు ఛాయలు బాగా కనపిస్తాయి. ఇక దర్శకుడుగా కొత్తగా పరిచయమైన గోపిచంద్ మలినేని చేసిందేమీ కనపించదు. టేకింగ్ కూడా చాలా సాదా సీదాగా ఉంటుంది. డైలాగులు విషయానికి వస్తే కొన్ని చోట్ల బాగానే పేలాయి. ఆర్టిస్టులలో శ్రీహరి తన రెగ్యులర్ ఢీ నాటి డైలాగులు,మ్యానరిజమ్ తో ఆకట్టుకోవాలని చూస్తాడు. షాయాజీ షిండే అయితే ఎప్పుడే అదే ఎక్సప్రెషన్స్. అలాగే శ్రేయ మేకప్ సమస్య ఏమో గానీ వయస్సు మీద పడిందని అనిపిస్తుంది. ఇక కెమెరా, ఎడిటింగ్ కథకు తగ్గట్లే ఉన్నాయి. వీటికి తోడు మణిశర్మ పాటలు పెద్దగా కిక్ ఇవ్వలేదనే చెప్పాలి.

ఫైనల్ గా అల్లరి నరేష్ చేయాల్సిన కథను రవితేజ చేస్తే చూసిన ఫీలింగ్ వస్తుంది. కొత్తదనం మచ్చుకైన కనపడని ఈ చిత్రాన్ని...సినిమా అంటే అప్పుడప్పుడూ నవ్వుకోవటమే కదా..అంతకుమించి ఏముంటుంది అని ఫిక్సయితే చూసిరావచ్చు. లేకుంటే..ఇబ్బందే అనిపిస్తుంది. అలాగే రవితేజ అభిమానులకు సైతం ఓ మాదిరిగా అనిపించే ఈ చిత్రం నిలబడటం కష్టమే అనిపిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X