కామెడీ 'దొంగోడు'

By Staff

Dongodu
-జలపతి గూడెల్లి
చిత్రం: దొంగోడు
నటీనటులు: రవితేజ, కళ్యాణి, తనికెళ్ళ భరణి, తదితరులు
సంగీతం: విద్యాసాగర్‌
స్క్రీన్‌ ప్లే, నిర్మాత, దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు

ఒక దొంగోడు కథను హాస్యపూరితంగా చెప్పాలనుకున్న వైనం కొన్ని సార్లు బాగానే అలరిస్తుంది. కాకపోతే..మంచి కామెడీకి స్కోప్‌ ఉన్న ఈ కథలో ఇంకా కామెడీ అధికంగా ఉంటే బాగుండేది. పూర్తిగా రవితేజ మీదే ఆధారపడి చిత్రం ఫర్వాలేదన్న స్థాయిలో సాగుతుంది. కామెడీ బాగున్నా, డైలాగ్స్‌ చాలావరకు అర్థం కావు. మరీ అంత ఫాస్ట్‌ ఎందుకో? మలయాళ చిత్రం మీసమాధవన్‌ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం భీమనేని మరికాస్తా క్రియేటివ్‌ గా ఆలోచిస్తే...మంచి వినోదాత్మక చిత్రంగా మారి ఉండేది. కామెడీకి, మెలోడియస్‌ పాటలకు స్కోప్‌ ఉన్న చిత్రమైనప్పటికీ, దాన్ని దర్శకుడు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోయాడు.

తనికెళ్ళ భరణి, రవితేజల మధ్య సాగే 'కామేశ్వరి' పురాణం ఇదివరకు వంశీ చిత్రాలను గుర్తుకుతెస్తుంది. మలయాళం నుంచి తెలుగులోకి రీమేక్‌ చేసేటప్పుడు ఇలాంటివి దృష్టిలో పెట్టుకొని ఉంటే బాగుండేది. కొన్ని డైలాగ్స్‌ బాగున్నాయి. నేను..జస్టిస్‌ చౌదరిని, ప్రస్తుతం జస్ట్‌ చౌదరిని..అనే సునీల్‌ డైలాగ్‌ బాగా పండింది.

రవితేజ డైలాగ్‌ లు చెప్పడంలో ఇంకాస్తా నెమ్మదితనం పాటిస్తే బాగుండేది. సినిమా అంతా రవితేజ మీదే నడుస్తున్నప్పుడు, ఇది మరీ ముఖ్యం. కళ్యాణి ఓకే. కానీ, వీరిద్దరి మధ్య 'బిళ్ళంకోడు' డైలాగ్‌ లు పూర్తిగా బూతే. అలాగే సీటు..డిక్కీ..వంటి ఎపిసోడ్‌ లు కూడా అపహాస్యమైన సన్నివేశాలే.

విద్యాసాగర్‌ రెండు పాటలు చక్కగా అందించాడు. మిగతావన్నీ రోటిన్‌. భీమనేని ఇంకా మునుపటి (సుస్వాగతం, శుభాకాంక్షలు) 'ఫామ్‌'కి ఇంకా రాలేదనే చెప్పాలి.

కథ: రవితేజ పరిస్థితుల వల్ల దొంగోడు అవుతాడు. వాళ్ళ ఇళ్లు తనికెళ్ళ భరణి వద్ద తాకట్టు పెట్టి ఉంటుంది. దాన్ని విడిపించుకునేందుకు దొంగతనాలు చేస్తాడు. అలాగే, భరణి కూతురు కళ్యాణిని ప్రేమించినట్లు నాటకం వేస్తాడు. కానీ నిజంగానే ప్రేమిస్తాడు రెండు పాటల తర్వాత. చివరికి తన ప్రేమను, ఇళ్ళును ఎలా దక్కించుకుంటాడు అనేది క్లైమాక్స్‌. కథ చాలా చిన్న పాయింట్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X