For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దొరసాని మూవీ రివ్యూ అండ్ రేటింగ్

|
Dorasani Movie Review And Rating || దొరసాని మూవీ రివ్యూ అండ్ రేటింగ్ || Filmibeat Telugu

Rating:
2.5/5
Star Cast: ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్, వినయ్ వర్మ, శరణ్య, యష్ రంగినేని
Director: కేవీఆర్ మహేంద్ర

తెలంగాణ కథ, భాష, యాస నేపథ్యంగా రూపొందుతున్న సినిమాలకు ఆదరణ పెరుగుతున్న క్రమంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం దొరసాని. హీరో విజయ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవర కొండ, ప్రముఖ సినీ దంపతులు జీవితా రాజశేఖర్ కూతురు శివాత్మిక‌, దర్శకుడిగా కేవీఆర్ మహేంద్ర సినీ పరిశ్రమకు పరిచయం కావడంతో ఈ సినిమా స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. అంతేకాకుండా పూర్తిస్థాయి తెలంగాణ జీవితాల కథతో వస్తుందనే విషయం, రిలీజ్‌కు ముందు టీజర్లు, ట్రైలర్లు, ఆడియో కూడా ఆకట్టుకొనే విధంగా ఉండటంతో దొరసాని అందర్నీ ఆకర్షించింది. ఇలా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొత్త తరం నటీనటులు, దర్శకుడికి ఎలాంటి ఫలితాన్ని అందించిందనే విషయం తెలుసుకోవాలంటే దొరసానిని సమీక్షించాల్సిందే.

 దొరసాని మూవీ కథ

దొరసాని మూవీ కథ

వరంగల్ జిల్లాలోని భూస్వామి (వినయ్ వర్మ) కూతురు దేవకి (దేవకి). గడి జీవితం తప్ప బాహ్య ప్రపంచం తెలియని అమ్మాయి. అదే గ్రామంలోని పేద కుటుంబానికి చెందిన రాజు (ఆనంద్ దేవరకొండ) పట్నంలో చదువుకునే యువకుడు. బతుకమ్మ పండుగ సంబురాల్లో కలుసుకొన్న దేవకి, రాజు తొలిచూపులోనే ప్రేమలో పడుతారు. ఆ క్రమంలో దేవకి, రాజు ప్రేమ భూస్వామి దృష్టికి వస్తుంది.

 దొరసాని కథలో ట్విస్టులు

దొరసాని కథలో ట్విస్టులు

దేవకి, రాజు ప్రేమపై భూస్వామి ఎలా రియాక్ట్ అయ్యాడు? తన కూతురు ప్రేమను చెడగొట్టడానికి భూస్వామి ఎలాంటి అకృత్యాలకు దిగాడు? తమ ప్రేమను విడగొట్టడానికి ప్రయత్నించిన గడి పెద్దలను ఎదిరించాడా? తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమించిన దేవకి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకొన్నది. చివరకు భూస్వామి, ప్రేమికుల మధ్య పరువు, పంతాలు ఎక్కడికి దారి తీశాయి అనే ప్రశ్నలకు సమాధానమే దొరసాని చిత్రం కథ.

 ఫస్టాఫ్ ఎనాలిసిస్

ఫస్టాఫ్ ఎనాలిసిస్

భూస్వామి కూతురు పేదింటి యువకుడు ప్రేమలో పడటం అనే కథతో బోలెడన్ని సినిమాలు తెలుగు తెరను తాకాయి. కాకపోతే ఈ సినిమాకు తెలంగాణ యాస, భాష, స్థానిక అంశాలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. తెలంగాణ సంస్క‌తి సంప్రదాయలతో సినిమా తొలి భాగం మొదలవుతుంది. ఇక భూస్వామి కూతురు సాధారణ యువకుడిని ఇష్టపడటం పడటం, వారి మధ్య ఆకర్షణ ప్రేమగా మారడం లాంటి అంశాలతో సినిమా రొటీన్‌గా నడుస్తుంది. కానీ తెలంగాన సామెతలు, భాష సన్నివేశాలను బాగా ఎలివేట్ చేయడం వల్ల కొంత ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తుంది. రకరకాల పాత్రల్లో కనిపించే మట్టి వాసన, గుమ్మడిపూలు, బతుకమ్మ లాంటి సన్నివేశాలు గుబాలిస్తాయి. ఈ సినిమా తొలిభాగంలో ఇవే ప్రత్యేకత. అంతకంటే ఫస్టాఫ్‌లో చెప్పుకోవడానికి ఏమీ కనిపించదు.

 సెకండాఫ్ అనాలిసిస్

సెకండాఫ్ అనాలిసిస్

ఇక అసలు కథ కోసం సెకండాఫ్ వరకు ఆగాల్సి రావడం ఈ సినిమాలో కొంత మైనస్‌గా అనిపిస్తుంది. ప్రేమ, ద్వేషం లాంటి అంశాలతో సెకండాఫ్ ఊపందుకొంటుంది. ఈ క్రమంలో నక్సలిజం లాంటి అంశాన్ని కథలో దూర్చడం కొత్తగా అనిపిస్తుంది. దొరసాని సినిమాకు క్లైమాక్స్‌లో ఓ ట్విస్టు మాత్రం సినిమాను మరోస్థాయికి తీసుకెళ్తుంది. దొరసానికి క్లైమాక్స్ అదనపు ఆకర్షణగా మారిందని చెప్పవచ్చు.

 దర్శకుడి పనితీరు

దర్శకుడి పనితీరు

తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపించే అతి సాధారణ కథను ఎంచుకోవడం దర్శకుడు కేవీఆర్ మహేంద్రకు ఓ సవాల్ అనే చెప్పాలి. అలాంటి కథకు సాంకేతిక బలాన్ని అద్ది తెర మీద కొత్త అనుభూతిని క్రియేట్ చేయడం ఆయన దర్శకత్వ ప్రతిభకు అద్దం పట్టింది. కాకపోతే రచయితగా గొప్పగా సన్నివేశాలను రాసుకోవడంలో విఫలమైంది. కథలోని సారాన్ని నింపాదిగా చెప్పడం ఓ స్టయిల్. డైలాగ్స్‌కు పెద్దగా స్కోప్ లేకుండా నటీనటుల హావభావాలతో సినిమాను నడిపించిన తీరు బాగుంది. ఎమోషనల్‌ ఫీల్ మిస్ అయినట్టు కనిపిస్తుంది. కాకపోతే కంటెంట్ మరింత బాగుంటే సినిమా రేంజ్ మరోలా ఉండేదనే ఫీలింగ్ కలిగేదని చెప్పవచ్చు. దర్శకుడిగా తాను నమ్ముకున్న కథకు పూర్తిగా న్యాయం చేకూర్చడంలో తన వంతు పాత్రను సమర్ధంగా నెరవేర్చాడని చెప్పవచ్చు.

 దొరసాని శివాత్మిక గురించి

దొరసాని శివాత్మిక గురించి

ఇక దొరసాని పాత్రలో దేవకిగా శివాత్మిక నటన బాగుంది. ఎక్కడా తొలి పరిచయమనే ఫీలింగ్ ఎక్కడా కనిపించదు. కళ్లతో పలికించిన హావభావాలు ఆకట్టుకొంటాయి. సెకండాఫ్‌లో భావోద్వేగమైన సన్నివేశాల్లో పరిణితితో కూడిన నటనను ప్రదర్శించింది. శివాత్మిక దుస్తులు, మేకప్ బాగా కుదిరాయి. అచ్చు దొరసాని అనే ఫీలింగ్ కలుగు చేసిందని చెప్పవచ్చు. నటనపరంగా కొన్ని లోపాలు సవరించుకొంటే మంచి నటిగా మారే అవకాశం ఉంది.

 ఆనంద్ దేవరకొండ యాక్టింగ్

ఆనంద్ దేవరకొండ యాక్టింగ్

ఇక రాజు పాత్రలో ఆనంద్ దేవరకొండ బాగా సూట్ అయ్యాడు. నటన పరంగా ఇంకా మెచ్చురిటీ కనిపించాల్సింది. అయితే తొలి చిత్ర హీరోగా ఫర్వాలేదనిపించాడు. అమాయకత్వం, చలాకీతో కూడిన సన్నివేశాల్లో ఆకట్టుకొన్నాడు. సన్నివేశాల్లో బలం లేకపోవడం వల్ల ఆనంద్ నటనను ఎలివేట్ కాలేకపోయింది. ప్రతిభ విషయంలో తప్పు పట్టడానికి అవకాశం లేదనే చెప్పాలి.

 మిగితా పాత్రల్లో

మిగితా పాత్రల్లో

మిగితా పాత్రల్లో వినయ్ వర్మ దొరగా డాబు, దర్పం చూపించాడు. ఎమోషనల్ సీన్లలో కొత్తరకం నటన కనిపిస్తుంది. ఇక రాజు స్నేహితులుగా నటించిన ముగ్గురు సినిమాకు మరో ఆకర్షణ. రాజు పాత్రకు ఈ ముగ్గురు సపోర్ట్‌గా నిలిచి ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌కు కారణమయ్యారని చెప్పవచ్చు. మిగితా పాత్రల్లో కనిపించిన ప్రతీ ఒక్కరు తమ మేరకు ఆకట్టుకొన్నారు. శరణ్య పాత్ర మరోసారి గుర్తుండి పోతుంది.

 సాంకేతిక విభాగాల పనితీరు

సాంకేతిక విభాగాల పనితీరు

దొరసాని సినిమాలో సాంకేతిక విలువలు పుష్కలంగా కనిపిస్తాయి. సినిమాకు ఇవే బలంగా మారాయని చెప్పవచ్చు. సన్ని కొర్రపాటి అందించిన సినిమాటోగ్రఫి బాగుంది. తెలంగాణలోని లోకేషన్లను అందంగా చూపించారు. ప్రశాంత్ విహారి అందించిన మ్యూజిక్ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. రీరికార్డింగ్ అద్భుతంగా ఉంది. జేకే మూర్తి నేతృత్వంలో పనిచేసిన ఆర్ట్ విభాగం పనితీరును ముందుగా ప్రశంసించాలి. ఎడిటింగ్ ఇంకా స్కోప్ ఉంది. తొలిభాగంలో కొన్ని సీన్లను తగ్గిస్తే కథలో కొంత వేగం పెరిగే అవకాశం ఉంది.

 ఫైనల్‌గా

ఫైనల్‌గా

తెలంగాణ యాస, భాష, సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పడమే కాకుండా.. భూస్వాముల దౌర్యన్యాన్ని కళ్లకు కట్టినట్టు చూపించిన చిత్రం దొరసాని. ఉత్తమ సాంకేతిక విలువలు సినిమాకు అదనపు బలంగా మారాయి. బీ, సీ సెంటర్లలోనే కాకుండా అర్బన్ ప్రేక్షకులను ఆకట్టుకొంటే సినిమా మంచి రేంజ్‌తో వసూళ్లను రాబట్టే సత్తా ఉంది. నైజాంలో ఈ సినిమా ప్రేక్షకులకు చేరువైతే మంచి విజయం మధుర శ్రీధర్, యష్ రంగినేని ఖాతాలో చేరడం ఖాయం.

English summary
Shivatmika Rajasekhar and Anand Devarakonda's Dorasani Set to release on July 12th. KVR Mahendra is director. Madhura Sridhar is the producer for the movie. This movie released on July 12th. In this occassion, Telugu filmibeat brings exclusive review.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more