Dream Catcher Movie Review: డ్రీమ్ క్యాచర్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Rating: 2.5/5
నటీనటులు: ప్రశాంత్ కృష్ణ, అనీషా ధామ, శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య హోలక్కల్, నాగరాజు, తదితరులు
రచన, దర్శకత్వం: సందీప్ కాకుల
ఎడిటర్: ప్రీతమ్ గాయత్రి
డీవోపీ: ప్రణీత్ గౌతమ్ నందా
మ్యూజిక్: రోహన్ శెట్టి
ట్రైలర్ మ్యూజిక్: వెంకటేష్ వుప్పాల, సిద్ధార్థ్ కాకుల
డైలాగ్స్: గుహన్ జాస్తి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ రవివర్మ
వీఎఫ్ఎక్స్ క్రియేటివ్ ప్రొడ్యూసర్: శ్రీకాంత్ శాఖమూరి
స్టంట్స్: శివరాజ్
కలరిస్ట్: అఖిల్ కాతోజు
మిక్సింగ్: సంతోష్ కుమార్
సౌండ్ డిజైన్: శ్రీ మిత్ర
బ్యానర్: సీయోల్ మోషన్ పిక్చర్స్
రిలీజ్ డేట్: 2025-01-03
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే యువకుడు దేవ్ ( ప్రశాంత్ కృష్ణ) తన ప్రేయసి రియాతో బ్రేకప్ జరుగుతుంది. తల్లి ఆకస్మిక మరణంతో మద్యానికి, డ్రగ్స్‌కు బానిస అవుతాడు. తన కంపెనీలో పనిచేసే సహ ఉద్యోగి, మిత్రుడు కార్తీక్‌తో రూమ్ షేర్ చేసుకొని ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆఫీస్‌లో తనకు వస్తుందనుకొన్న భారీ ప్రాజెక్టు మిస్ అవుతుంది. ఈ నేపథ్యంలో విచిత్రమైన కలలు వెంటాడుతుంటాయి. తనను నలుగురు వ్యక్తులు వెంటాడుతున్నట్టు డ్రీమ్స్ రావడంతో టెన్షన్‌లో పడిపోతాడు. ఇలాంటి కన్‌ఫ్యూజన్ కండిషన్స్‌లో తనకు చేరువైన తోటి ఉద్యోగి ఆత్మికను దూరంగా పెట్టే ప్రయత్నం చేస్తాడు.
లవర్‌తో దేవ్‌కు ఎందుకు బ్రేకప్ అయింది? దేవ్ తల్లి ఎలా చనిపోయింది? తన స్నేహితుడు కార్తీక్‌పై ఎందుకు అనుమానాలు పెంచుకొన్నాడు? ఆత్మిక ప్రేమకు దేవ్ దూరంగా ఉండాలని అనుకొన్నాడు? కలల్లో వెంటాడే నలుగురు ఎవరు? తన చుట్టు ఉన్న వారిలో నిజంగా దేవ్‌పై ఎవరికి నిజమైన ప్రేమ ఉంది? తన వెంటాడుతున్న కలల విషయంలో దేవ్‌కు లభించిన పరిష్కారం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే డ్రీమ్ క్యాచర్ సినిమా కథ.

డ్రీమ్ క్యాచర్ టైటిల్‌కు తగినట్టుగానే స్టోరిని పాయింట్‌గా చూస్తే చాలా ఎమోషనల్‌గా, ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. దర్శకుడు సందీప్ కాకుల రాసుకొన్న పాయింట్ కొత్తగా ఉందనిపిస్తుంది. కానీ దానిని పూర్తిస్థాయి కథగా.. ఓ సక్సెస్‌ఫుల్ ఫార్ములాకు కావాల్సిన అంశాలను పూర్తిస్థాయిలో దట్టించలేకపోయారనిపిస్తుంది. కానీ అంతా కొత్తవారితో నటనను రాబట్టుకొన్న విధానం, సినిమా అవుట్ పుట్ చూస్తే కొత్త డైరెక్టర్ అని ఎక్కడా అనిపించదు. కొన్ని సీన్లను చాలా మెచ్యురిటీతో తీసినట్టు అనిపిస్తుంది.
దేవ్‌గా ప్రశాంత్ కృష్ణ, కార్తీక్‌గా శ్రీనివాస్ రామిరెడ్డి తన పాత్రల్లో జీవించారు. ఈ సినిమా భారన్నంతా ప్రశాంత్ కృష్ణ తన భుజాలపై వేసుకొని సినిమాను ముందుకు నడిపించారు. కీలక సన్నివేశాల్లో మెచ్యురిటీతో కూడిన నటనను ప్రదర్శించారు. ఆత్మికగా అనీషా ధామ, రియాగా ఐశ్వర్య హోలక్కల్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఆత్మిక చాలా ఈజ్‌తో నటించి మెప్పించే ప్రయత్నం చేసింది. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, మ్యూజిక్, గ్రాఫిక్ వర్క్ సినిమాకు ప్లస్ పాయింట్. హైదరాబాద్‌లోని కొన్ని ప్రదేశాలను ప్రణీత్ చాలా అద్బుతంగా తెరకెక్కించారు. అలాగే రోహన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా ప్రొఫెషనల్‌గా ఉంది. సీయోల్ మోషన్ పిక్చర్స్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
లవ్, మదర్ సెంటిమెంట్, సైకాలజికల్ డ్రామా, ఎమోషనల్అంశాలతో రూపొందించిన న్యూ ఏజ్ సినిమా డ్రీమ్ క్యాచర్. క్లాస్ ఆడియెన్స్, మల్టీప్లెక్స్ ప్రేక్షకులను టార్గెట్‌గా తీసిన సినిమాగా చెప్పుకోవచ్చు. దర్శకుడు విజన్ బాగుంది. కథ, కథనాలపై మరింత దృష్టిపెట్టి ఉంటే ఇంకా బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేదనిపిస్తుంది. న్యూ ఏజ్ సినిమా కాన్సెప్ట్స్, కాన్సెప్ట్ బేస్ట్ సినిమాలను ఆదరించే వారికి నచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











