Drishyam 3 Movie Review: దృశ్యం 3 మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating:
3.0/5

సినిమా: దృశ్యం 3
నటీనటులు: మోహన్‌లాల్, మీనా, అన్సిబా హాసన్, ఎస్తేర్ అనిల్, సిద్దిఖీ, ఆషా శరత్, మురళీ గోపి, ఆంటోని పెరంబవూర్, శ్రీకాంత్ మురళీ తదితరులు
దర్శకత్వం: జీతూ జోసెఫ్
బ్యానర్: ఆశీర్వాద్ సినిమాస్
నిర్మాత: ఆంటోని పెరంబవూర్
సినిమాటోగ్రఫి: సతీష్ కురుప్,
ఎడిటింగ్: వీఎస్ వినాయక్,
మ్యూజిక్: అనిల్ జాన్సన్
రిలీజ్ డేట్: 2026-05-21

సినిమా థియేటర్ ఓనర్ అయిన జార్జ్ కుట్టి (మోహన్ లాల్) ఏకంగా సినిమా నిర్మాతగా మారుతాడు. కూతురు అంజు అన్సిబా హాసన్)‌కు సంబంధించిన హత్య కేసు నుంచి కోర్టు ఆదేశాలతో బయటపడిన తర్వాత తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమాను నిర్మిస్తాడు. ఆ సినిమా హిట్ కావడం, మానసిక సమస్యల నుంచి బయటపడిన కూతురు అంజుకు పెళ్లి చేయాలని భార్య రాణి జార్జ్ (మీనా)తో జార్జ్ నిర్ణయిస్తారు. అయితే అంజు కేసు కారణంగా సస్పెండ్ అయిన సహదేవన్ అనే పోలీస్ ఆఫీసర్ ప్రతీకారంతో రగిలిపోతూ మర్డర్ కేసు మళ్లీ రీ ఓపెన్ చేసేందుకు కుట్ర పన్నుతాడు. ఈ క్రమంలో మృతుడు వరుణ్ తండ్రి ప్రభాకరన్ (సిద్దిఖీ)తో చేతులు కలుపుతాడు. అంజు పెళ్లి రోజే అరెస్ట్ చేయడానికి పథకం వేస్తారు.

Drishyam 3 Movie Review

నిర్మాతగా మారిన జార్జి కుట్టి తన సినిమా హిట్‌ను ఫ్యామిలీతో ఎలా ఎంజాయ్ చేశాడు? సహదేవ్ తన కుట్రలను ఎలా కొనసాగించాడు? సహదేవ్ కుట్రలను తెలుసుకొన్న జార్జ్ ఎలాంటి ఎత్తులు వేశాడు? కూతురు అంజు పెళ్లికి రాణితో కలిసి జార్జి ప్లాన్ చేశాడు? అంజు పెళ్లి రోజే తన కూతురును అరెస్ట్ చేయడానికి ప్రభాకరన్ రచించిన పథకాన్ని ఎలా తిప్పి కొట్టేందుకు ప్లాన్ చేశాడు? సహదేవ్‌ కుట్రలను ఎదుర్కొని పోలీసుల కేసును నీరుగార్చాడు. కూతురు అంజును రక్షించుకోవడానికి జార్జి ఎలాంటి సాహసం చేశాడు? ప్రభాకరన్‌కు ఎలాంటి గుణపాఠం నేర్పాడు అనే ప్రశ్నలకు సమాధానమే దృశ్యం సినిమా కథ.

దృశ్యం ఫ్రాంచైజీకి మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో దృశ్యం 3 వస్తుందనే వార్తతో ఆడియెన్స్‌లో భారీగా క్యూరియాసిటీ పెరిగింది. అయితే ఆ క్యూరియాసిటీతో వెళ్లిన ప్రేక్షకులకు దర్శకుడు జీతూ జోసెఫ్ పూర్తి స్థాయిలో సంతృప్తిని కలిగించలేకపోయాడనే చెప్పాలి. ఫస్టాఫ్‌లో కథను, పాత్రలను, సన్నివేశాల్లోని డ్రామాను ఎస్టాబ్లిష్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవడం ఈ సినిమాకు మైనస్‌గా అనిపిస్తుంది. అలాగే సన్నివేశాల్లో కొత్తదనం లేకపోవడం, కథలో వేగం లేకపోవడం వల్ల సహనానికి పరీక్ష పెట్టారా? అనే ఫీలింగ్ కలుగుతుంది. కొంచెం నిరాశ నిస్పృహలతో ఫస్టాఫ్ ముగిసిందనే పీలింగ్ కలుగుతుంది.

ఫస్టాఫ్‌ ముగిసిన తర్వాత బోర్‌గా ఫీలైన ఆడియెన్స్ అసలు విందును జీతూ జోసెఫ్ పెట్టారు. సెకండాఫ్‌ను తీర్చి దిద్దిన విధానం, కథలోకి తీసుకొచ్చిన డ్రామా, టెన్షన్, టెంపో, ఎమోషన్స్, ట్విస్టులన్నీ చక్కగా కుదిరాయి. సెకండాఫ్‌ను ట్విస్టులతో పరుగులు పెట్టించాడు. దాంతో అనుక్షణం కథలో డ్రామా సీరియస్‌గా సాగడం వల్ల ఏం జరుగబోతుందనే క్యూరియాసిటీని బాగా హైప్ చేశాడు. చివరి 20 నిమిషాలపాటు సాగిన టెంపోతో మళ్లీ మంచి సినిమా చూశామనే ఫీలింగ్‌ను ఆడియెన్ కలిగించేలా దర్శకుడు జీతూ సక్సెస్ అయ్యాడని చెప్పాలి.

నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఎప్పటి లానే మోహన్ లాల్ ఈ సినిమాకు వెన్నముకగా నిలిచాడు. సినిమా ఆద్యంత వన్ మ్యాన్ షో పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొన్నాడు. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి సన్నివేశం వరకు మోహన్ లాల్ జార్జి క్యారెక్టర్ చూపించిన యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంది. తన నటనతో మరోసారి అభిమానులను మోహన్ లాల్ మెస్మరైజ్ చేశారనే చెప్పాలి. మీనా తన పాత్ర పరిధి మేరకు ఫర్వాలేదనిపించారు. సహదేవ్, ప్రభాకరన్ పాత్రల్లో నటించిన వారు సినిమా కథను రక్తి కట్టించేలా నటించారు. ఈ చిత్రంలో నటించిన వారంతా తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. ఈ సినిమాకు మ్యూజిక్, సినిమాటోగ్రఫి అసెట్. అలాగే ఎడిటింగ్ విభాగం పనితీరు ఓ మ్యాజిక్‌లా అనిపిస్తుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోరుకు ఫస్టాఫ్‌లో అంతగా స్కోప్ లేకపోయింది. కానీ ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ వరకు రీరీకార్డింగ్‌తో సన్నివేశాలు బాగా హైలెట్ అయ్యాయి. కేరళ అందాలను ఎప్పటిలానే సినిమాటోగ్రాఫర్ కెమెరాలో చక్కగా ఒడిసిపట్టుకొన్నారు. ఆశీర్వాద్ సినిమాస్, ఆంటోని పెరంబవూర్ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

దృశ్యం సినిమా ఫ్రాంచైజీలో ఒకే రకమైన పాయింట్, స్క్రీన్ ప్లేతో సాగే మర్డర్ మిస్టరీ. మిగితా రెండు సినిమాల్లో మాదిరిగానే డ్రామాపైనే ఆధారపడి సాగే సినిమా అనిచెప్పాలి. ఈ సినిమా కథ, కథనాల పరంగా స్లో పాయిజన్ లాంటింది. మెల్లమెల్లగా దర్శకుడు సన్నివేశాలను ఆడియెన్స్ మెదడులోకి ఎక్కించే ప్రయత్నమే కనబడుతుంది. గత రెండు పార్టులతో పోల్చుకొంటే దృశ్యం 3 సినిమాలో ఎమోషన్స్ కొంత తగ్గాయనే చెప్పాలి. మోహన్ లాల్, జీతూ జోసెఫ్ సినిమాలను ఇష్టపడే వారికి దృశ్యం 3 ఎలాగు నచ్చుతుంది. ట్విస్టులతో సాగే థ్రిల్లర్‌ను ఇష్టపడే వారికి కూడా ఈ సినిమా నచ్చడానికి అంశాలు ఉన్నాయి. రెగ్యులర్, ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాను ఈ వారం చూడాలనుకొన్న చిత్రాల జాబితాల్లో హ్యాపీగా చేర్చుకోవచ్చు. భారీ అంచనాలతో కాకుండా నార్మల్‌గా వెళితే మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది.

Read more about: Drishyam 3 mohanlal meena
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X