Drishyam 3 First Review: దృశ్యం 3 మూవీ ఫస్ట్ రివ్యూ
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన తాజా చిత్రం దృశ్యం 3 సినిమా రిలీజ్‌కు సిద్దమైంది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ మీనాతోపాటు అన్సిబా హాసన్, ఎస్తేర్ అనిల్, సిద్దిఖీ, ఆషా శరత్, మురళీ గోపి, ఆంటోని పెరంబవూర్, శ్రీకాంత్ మురళీ తదితరులు నటించారు. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. దృశ్యం మూవీ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో సినిమాను ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత ఆంటోని పెరంబవూర్ నిర్మించారు.
ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. సినిమాటోగ్రఫి: సతీష్ కురుప్, ఎడిటింగ్: వీఎస్ వినాయక్, మ్యూజిక్: అనిల్ జాన్సన్ తమ బాధ్యతలను నిర్వర్తించారు. మే 21వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొన్నది. ఈ సినిమాపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికెట్ (CBFC) ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఏమిటి? ఈ చిత్రానికి లభించిన సర్టిఫికెట్ ఏమిటి? ఈ సినిమా రన్ టైమ్ ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

జార్జ్ కుట్టి (మోహన్‌లాల్), రాణి జార్జి (మీనా) దంపతులు తమ కూతుళ్లు అంజు (అన్సిబా హాసన్), అను (ఎస్తేర్ అనిల్)తో కలిసి హ్యాపీగా జీవిస్తుంటారు. అయితే సంతోషంగా సాగుతున్న జీవితం ఒక్కసారిగా కుదుపుకు లోనవుతుంది. తప్పని పరిస్థితిలో భార్య రాణి హత్య కేసులో ఇరుక్కొంటుంది. అయితే చట్టంలోని లోసుగులు వాడుకొని జార్జ్ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకొనే ప్రయత్నం చేశారనేది ఈ సినిమా కథ.
మర్డర్ మిస్టరీ, ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్, థ్రిల్లింగ్, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రాన్ని సెన్సార్ బోర్డు అధికారులు, ప్రతినిధులు రివ్యూ చేశారు. అయితే ఈ చిత్రంలో పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయడానికి కంటెంట్ పరంగా స్కోప్ లేకపోవడంతో ఎలాంటి ఆంక్షలు, పరిమితులు లేకుండా కొన్ని స్వల్ప మార్పులో ఈ చిత్రానికి క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చారు. దాంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ సినిమా రిలీజ్ అయిందని చిత్ర యూనిట్ వెల్లడించింది.
దృశ్యం 3 చిత్రం ఫ్యామిలీ ఎలిమెంట్స్, క్రైమ్ అంశం చుట్టూ కథ బేస్ కావడంతో ఈ చిత్రానికి యూఏ (UA13+) సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సర్టిఫికెట్ ప్రకారం.. 16 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరు ఈ మూవీని ఎలాంటి అభ్యంతరం లేకుండా చూడొచ్చు. అంతకంటే తక్కువ వయసు ఉన్న వారు మాత్రం తల్లిదండ్రుల గైడెన్స్‌లో చూడాల్సి ఉంటుందని సర్టిఫికెట్‌లోని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. తమ సినిమాకు యూఏ 13+ సర్టిఫికెట్ జారీ చేశారు అని మోహన్ లాల్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో అది వైరల్ అయింది.
ఈ చిత్రం మర్డర్ మిస్టరీ కావడంతో పలు ట్విస్టులతో కథ ఆసక్తికరంగా సాగడానికి స్కోప్ ఉండటంతో నిడివి కూడా కొంత పెరిగింది. ఈ సినిమా నిడివి 2 గంటల 39 నిమిషాలు. అంటే ఈ చిత్రానికి 159 నిమిషాల రన్‌టైమ్ ఫిక్స్ చేసినట్టు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాలో మోహన్ లాల్ ఫెర్ఫార్మెన్స్ మరోసారి హైలెట్ కానున్నది. మీనా ఫీల్ గుడ్ ఫెర్పార్మెన్స్‌పై సెన్సార్ ప్రశంసలు గుప్పించింది. జీతూ జోసెఫ్ మరోసారి తన కథ, కథనంతో మ్యాజిక్ చేసే అవకాశం ఉంది. ఎమోషన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ ఆడియెన్స్ కనెక్ట్ అయితే మరోసారి దృశ్యం సిరీస్ భారీ హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications


