Drishyam 3 Twitter Review: దృశ్యం 3 మూవీ ట్విట్టర్ రివ్యూ

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన తాజా చిత్రం దృశ్యం 3 సినిమా రిలీజ్‌కు సిద్దమైంది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ మీనాతోపాటు అన్సిబా హాసన్, ఎస్తేర్ అనిల్, సిద్దిఖీ, ఆషా శరత్, మురళీ గోపి, ఆంటోని పెరంబవూర్, శ్రీకాంత్ మురళీ తదితరులు నటించారు. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. దృశ్యం మూవీ ఫ్రాంచైజీలో వస్తున్న మూడో సినిమాను ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత ఆంటోని పెరంబవూర్ నిర్మించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. సినిమాటోగ్రఫి: సతీష్ కురుప్, ఎడిటింగ్: వీఎస్ వినాయక్, మ్యూజిక్: అనిల్ జాన్సన్ తమ బాధ్యతలను నిర్వర్తించారు. మే 21వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా కథ ఏమిటి? ఈ చిత్రం గురించి క్రిటిక్స్ ఎలా రియాక్ట్ అయ్యారు? సోషల్ మీడియాలో నెటిజన్ల స్పందన ఎలా ఉంది? ఈ సినిమాపై కామన్ ఆడియెన్స్ రివ్యూ, కామెంట్స్ ఎలా ఉన్నాయనే వివరాల్లోకి వెళితే..

Drishyam 3 Twitter Review

జార్జ్ కుట్టి (మోహన్‌లాల్), రాణి జార్జి (మీనా) దంపతులు తమ కూతుళ్లు అంజు (అన్సిబా హాసన్), అను (ఎస్తేర్ అనిల్)తో కలిసి హ్యాపీగా జీవిస్తుంటారు. అయితే సంతోషంగా సాగుతున్న జీవితం ఒక్కసారిగా కుదుపుకు లోనవుతుంది. తప్పని పరిస్థితిలో భార్య రాణి హత్య కేసులో ఇరుక్కొంటుంది. అయితే చట్టంలోని లోసుగులు వాడుకొని జార్జ్ తన కుటుంబాన్ని ఎలా కాపాడుకొనే ప్రయత్నం చేశారనేది ఈ సినిమా కథ.

గత దృశ్యం సిరీస్ టెంప్లేట్ లాగే.. దృశ్యం 3లో ఉత్కంఠభరితంగా, ఉద్విగ్నభరిత క్షణాలు ఉన్నాయి, సంగీతం కూడా చాలా బాగుంది. జార్జ్‌కుట్టిగా మోహన్‌లాల్ ఎప్పటిలాగే మరో అద్భుతమైన ప్రదర్శన చేశారు. 2026లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో దృశ్యం 3 ఇంటర్వెల్ బ్యాంగ్ ది బెస్ట్ అని ఓ అభిమాని కామెంట్ చేశాడు.

దృశ్యం 3 ఒక సర్‌ప్రైజ్‌తో ప్రారంభమై.. సర్‌ప్రైజ్‌తో ఎండ్ అయ్యింది. ఎప్పటిలాగే జీతూ టేకింగ్ బాగుంది. ఆసక్తికరమైన ఇంటర్వెల్ బ్లాక్‌తో కథనం మాత్రం నెమ్మదిగా సాగుతోంది. జార్జ్ కుట్టిగా మోహన్‌లాల్ ఇరగదీశాడని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

దృశ్యం 3 ఫస్టాఫ్.. టైట్ ఇంటర్వెల్ బ్లాక్‌తో చాలా ఉత్కంఠభరితంగా ఉంది. జార్జ్‌కుట్టి ఎమోషన అంతా దృశ్యం మొదటి, రెండో భాగం మాదిరిగానే ఉంటుంది. ఇంటర్వెల్‌కు ముందు ఎమోషనల్ ఎంగేజ్‌మెంట్ బాగుంది. సెకండాఫ్‌లో ఏదో పెద్ద రచ్చే జరగబోతున్నట్లుగా ఉందని ఓ అభిమాని రాసుకొచ్చాడు.

దృశ్యం 3 సినిమా కథలో చాలా ట్విస్టులు, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సోషల్ మీడియాలో వాటిని మీరు షేర్ చేయకండి. థ్రిల్ మూమెంట్స్‌ను స్పాయిల్ చేయకండి. ప్రతీ ఒక్కరికి 100 శాతం ఫ్రెష్ ఎక్స్‌పీరియెన్స్‌ను పొందేలా చూడండి అంటూ చిత్ర యూనిట్, హీరో మోహన్ లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ వేడుకొన్నారు.

దృశ్యం 3 సినిమా చూసేటప్పుడు కొన్ని రూల్స్ మీ మైండ్‌లో పెట్టుకోండి. ఏదైనా సీన్ అర్ధాంతరంగా కట్ అయితే.. ఆ సీన్ అయిపోయిందని అనుకోకండి. మీ కళ్లను, మైండ్‌ను దారి తప్పించేలా స్క్రీన్ ప్లే రాశారనే విషయాన్ని గుర్తుపెట్టుకొండి. అలాగే చాలాసార్లు కథ సాగే తీరు చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేకపోవచ్చు. జార్జి కుట్టి (మోహన్ లాల్) చెప్పే అబద్దాలు మీకు థ్రిల్లింగ్ మూమెంట్స్ అందిస్తాయి అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


దృశ్యం 3 సినిమా ఇండస్ట్రీ హిట్ కావడం గ్యారెంటీ. ఈ సినిమాలోని ట్విస్టులను బహిర్గతం చేయకండి. స్పాయిలర్లకు స్కోప్ ఇవ్వకండి. ఈ సినిమా కలిగించే అనుభూతిని చెడగొట్టకండి. ఇతరులు కూడా ఈ సినిమాను ఎంజాయ్ చేసేలా సహకరించండి అంటూ మోహన్ లాల్ రిక్వెస్ట్ చేశారు.

దృశ్యం 3 సినిమా మరో నెటిజన్ ట్విట్టర్‌లో ఇచ్చిన రివ్యూ వైరల్‌గా మారింది. దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సిరీస్‌తో ఎప్పటిలాగే నిరాశపరచలేదని ఆయన ప్రశంసించాడు. అయితే, గత రెండు పార్ట్స్‌లా భారీ ట్విస్ట్‌లు ఆశించకూడదని స్పష్టం చేశాడు. ఈసారి సినిమా ట్విస్ట్‌ల కంటే ఎమోషనల్ డ్రామాపై ఎక్కువ ఫోకస్ పెట్టిందని పేర్కొన్నాడు. 'సాటిస్ఫైయింగ్ వాచ్... తప్పకుండా చూడొచ్చు' అంటూ 5లో 3.75 రేటింగ్ ఇస్తూ పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు.

దృశ్యం 3పై ఓ నెటిజన్ ట్విట్టర్‌లో ఇచ్చిన రివ్యూ కూడా వైరల్‌గా మారింది. ఈ సినిమా "విజేత" అంటూ కొనియాడాడు. ప్రత్యేకంగా మోహన్‌లాల్ నటనపై ప్రశంసలు కురిపిస్తూ, "లాలెట్టన్ మరోసారి తాను ఎందుకు సరిపోలలేదు అని నిరూపించారు" అని ట్వీట్‌లో పేర్కొన్నారు. జార్జ్‌కుట్టి పాత్రలో ఆయన మైండ్ గేమ్, ప్రెజెన్స్ ప్రేక్షకులు ఆకట్టుకుంటారని అభిప్రాయపడ్డారు. ఇంకా ఈ సినిమా రైటింగ్ అద్భుతంగా ఉందని, ఎడ్జ్-ఆఫ్-ది-సీట్ మూమెంట్స్‌తో కథ ఉత్కంఠగా సాగుతుందని చెప్పారు. అదే సమయంలో ఇది కేవలం థ్రిల్లర్ మాత్రమే కాకుండా, పర్ఫెక్ట్ ఫ్యామిలీ మూవీ అని కూడా సూచిస్తుంది. ముఖ్యంగా "క్లైమాక్స్ అదిరిపోయింది" అని హైలైట్ చేశారు.

Read more about: Drishyam 3 mohanlal meena
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X