Drohi Movie Review న్యూ జోనర్‌తో మర్డర్ మిస్టరీ.. ద్రోహి మూవీ ఎలా ఉందంటే?
నటీనటులు: సందీప్ కుమార్ బొడ్డపాటి, దీప్తి వర్మ, షకలక శంకర్, మజిలీ శివ, మహేష్ విట్ట, డెబ్బి తదితరులు
నిర్మాతలు: రాజశేఖర్ రవి పూడి, శ్రీకాంత్ రెడ్డి దుగ్గెంపూడి.
దర్శకుడు: విజయ్ దాస్ పెందుర్తి
మ్యూజిక్: అనంత నారాయణ ఏజీ
ఎడిటింగ్: జానీ బాషా
డీఐ: రక్షిత్ గజ్జా
బ్యానర్: ప్లే వరల్డ్ క్రియేషన్స్, సాఫిరస్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్స్, గుడ్ ఫెల్లోస్ మీడియా
రిలీజ్ డేట్: 2023-11-03
అజయ్ (సందీప్) తన ఇద్దరు స్నేహితులతో కలిసి బిజినెస్ చేస్తుంటాడు. వ్యాపారంలో విఫలమైన అజయ్‌కు భార్య చంద్రిక (దీప్తి వర్మ) అండగా నిలుస్తూ మానసిక ధైర్యాన్ని అందిస్తుంటుంది. వ్యాపారంలో నష్టాలు రావడంతో అజయ్ డిప్రెషన్‌కు లోనవుతాడు. ఆ పరిస్థితుల్లో భార్య చంద్రిక అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తుంది. భార్య మృతి కేసులో అజయ్‌ను అనుమానించి పోలీసులు అరెస్ట్ చేస్తారు.

అజయ్ వ్యాపారంలో నష్టపోవడానికి కారణాలు ఏమిటి? ఇద్దరు స్నేహితులతో అజయ్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి? భార్య చంద్రిక మరణం అజయ్‌కి ఎలాంటి సమస్యలు తెచ్చిపెట్టింది? చంద్రిక మరణం కేసులో అరెస్టైన అజయ్ ఎలా బయటపడ్డారు? చంద్రిక మరణానికి అసలు కారణం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ద్రోహి.. ది క్రిమినల్ సినిమా కథ.
దర్శకుడు విజయ్ దాస్ పెందుర్తి ఎంచుకొన్న పాయింట్.. దాని చుట్టు అల్లుకొన్న స్క్రీన్ ప్లే బాగుంది. క్యారెక్టర్లను డిజైన్ చేసిన విధానం బాగుంది. మర్డర్ మిస్టరీలో జరిగే డ్రామాను గ్రిప్పింగ్‌గా చెప్పే ప్రయత్నం చేశారు. కొత్త వారితో ఫెర్ఫార్మెన్స్ రాబట్టుకొన్న విధానం అతడి ప్రతిభకు అద్దం పట్టింది. సాంకేతిక విభాగాల విషయానికి వస్తే..మ్యూజిక్, ఇతర విభాగాలు మెరుగైన ప్రతిభను చాటుకొన్నారు.

ఇక హీరోగా ప్రధాన పాత్రలో నటించిన సందీప్ కుమార్ తన క్యారెక్టర్‌లో ఒదిగిపోయారు. ఎమోషన్స్, యాక్షన్ సన్నివేశాల్లో మెప్పించారు.కీలక సన్నివేశాల్లో ఆయన చూపించిన పెర్ఫార్మెన్స్ నటనపై ఉన్న ఆయన తపనకు, అభిరుచికి అద్దంపట్టింది. నటనపరంగా ఇంకా మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఉంది. షకలక శంకర్ సరికొత్తగా.. భావోద్వేగమైన పాత్రలో ఒదిగిపోయాడు. దీప్తి వర్మ తన పాత్ర పరిధి మేరకు ఒకే అనిపించింది. ఇతర పాత్రల్లో నటించిన మహేష్ విట్టా, మజిలీ శివ, నీరజ్ పుచ్చ తమ పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించారు.
లవ్, ఎమోషన్స్‌తో కలిపి రూపొందించిన మర్డర్ మిస్టరీ ద్రోహి ది క్రిమినల్. కొత్తవాళ్లైనా తమ ప్రతిభను చాటుకోవాలనే తపన కనిపిస్తుంది. థ్రిల్లర్, సస్పెన్స్ జోనర్లను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











