twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కనులు కనులను దోచాయంటే మూవీ రివ్యూ అండ్ రేటింగ్

    |

    Rating:
    3.0/5
    Star Cast: దుల్కర్ సల్మాన్, రితూ వర్మ, రక్షన్, నిరంజనీ అహతియాన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్
    Director: దేసింగ్ పెరియాసామీ

    మహానటి చిత్రంతో తెలుగు ప్రేక్షకులు మరింత దగ్గరైన దుల్కర్ సల్మాన్, పెళ్లిచూపులతో ఆకట్టుకొన్న రీతూవర్మ నటించిన చిత్రం కనులు కనులను దోచాయంటే. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని వయకామ్ 18 స్టూడియోస్, ఆంటో జోసెఫ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ రూపొందించింది. ఫిబ్రవరి 28వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి దేసింగ్ పెరియాస్వామి దర్శకుడు. రొమాంటిక్ అంశాలతోపాటు థ్రిల్లర్ అంశాలు ప్రేక్షకులను మెప్పించాయా? అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    కథేంటంటే..

    కథేంటంటే..

    సిద్దు (దుల్కర్ సల్మాన్) యాప్ డెవలపర్ అని చెప్పుకుంటూ తన స్నేహితుడితో వైట్ కాలర్ నేరాలు చేస్తూ జీవితాన్ని గడిపేస్తుంటారు. ఆ క్రమంలో తొలి చూపులోనే మీరా అలియాస్ మధుమిత (రితూవర్మను చూసి సిద్దు ప్రేమలో పడిపోతాడు. కానీ ఓ దశలో మధుమిత ఇచ్చిన షాక్‌కు సిద్ధూ ద్వయానికి దిమ్మ తిరిగిపోతుంది. వైట్ కాలర్ నేరాలను పరిశోధించే ఆఫీసర్ ప్రతాప్ ( గౌతమ్ వాసుదేవ మీనన్) చేతికి సిద్ధూ ద్వయం దొరికిపోతారు.

    కథలో ట్విస్టులు

    కథలో ట్విస్టులు

    సిద్దూకు మధుమిత ఎలాంటి షాకిచ్చింది? ఆ షాక్ నుంచి తేరుకొని మధుమితకు ఎలాంటి గుణపాఠం చెప్పాలనుకొన్నాడు? పోలీస్ ఆఫీసర్ తన కేసును ఎలా పరిశోధించాడు? సిద్ధు, అతడి స్నేహితుడు ఎందుకు దొంగతనాలకు పాల్పడాలనుకొంటారు. ఈ కథలో మధుమిత, ఆమె స్నేహితురాలు (నిరంజనీ) పాత్రలు ఏంటి? సిద్ధును మధుమిత ఎందుకు మోసగించింది. ఈ స్టోరీలో సాఫ్ట్ విలన్ ( అనీష్ కురువిల్లా) ఎలాంటి ట్విస్టులు ఇచ్చాడనే ప్రశ్నలకు సమాధానమే కనులు కనులను దోచాయంటే సినిమా కథ.

    ఫస్టాఫ్ అనాలిసిస్

    ఫస్టాఫ్ అనాలిసిస్

    సిద్దూ, అతడి స్నేహితుడు అల్లరి చిల్లరి పనులు, దొంగతనాలతో కథ మొదలవుతుంది. ఎప్పుడైతే కథలోకి పోలీస్ ఆఫీసర్ ప్రతాప్ ఎంట్రీ ఇస్తుందో.. స్టోరిలో ట్విస్టులు ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తాయి. ఫస్టాఫ్‌లో సిద్ధూ ద్వయం చేసే వైట్ కాలర్ దొంగతనాలు కథను మరో మెట్టు ఎక్కించగా.. గౌతమ్ మీనన్ రోల్ కథను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తుంది. పోలీస్ ఆఫీసర్ ప్రతాప్‌గా గౌతమ్ మీనన్ తన నటనతో థ్రిల్‌కు గురిచేస్తుంటే కథలో లీనమవ్వడం ప్రేక్షకుల వంతైంది. ఇక ఇంటర్వెల్‌కు ముందు వచ్చే ట్విస్టుతో కథా స్వరూపం పూర్తిగా మారిపోతుంది.

     సెకండాఫ్ అనాలిసిస్

    సెకండాఫ్ అనాలిసిస్

    ఫస్టాఫ్‌లో ఇచ్చిన ట్విస్టుతో సెకండాఫ్‌పై ప్రేక్షకుల అంచనాలు పెరగడం చాలా కామన్ అని చెప్పవచ్చు. సెకండాఫ్‌ మొదలైనప్పటి గ్రిప్పింగ్‌గా ఉండే స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ప్రతీ మలుపులో థ్రిల్‌కు గురిచేస్తుంది. దాంతో సినిమా ఫీల్‌గుడ్‌తో మంచి సాగుతుంది. అనీష్ కురువిల్లా పాత్ర ఎంట్రీ తర్వాత కథలో మలుపులు, ఆసక్తికరమైన అంశాలు దండిగా కనిపిస్తాయి. ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే సన్నివేశాలు అదిరిపోయేలా ఉండటమే కాకుండా భావోద్వేగానికి గురిచేస్తాయి. చివర్లో వచ్చే సన్నీ వేశాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతాయి.

     దర్శకుడి పనితీరు

    దర్శకుడి పనితీరు

    తొలి చిత్ర దర్శకుడిగా సినీ రంగానికి పరిచయమైన దేసింగ్ పెరియాసామి రాసుకొన్న కథనే సినిమాకు ఆయువు పట్టు అని చెప్పవచ్చు. ఇక కథను నడిపించిన తీరు చూస్తే బాగా అనుభవం ఉన్న దర్శకుడిలా అనిపిస్తాడు. కథ, కథనాల్లో ఎలాంటి తడబాటు కనిపించదు. స్క్రిప్టులో వెతికినా లోపాలు కనిపించవు. కాకపోతే తనకు ఉన్న స్వేచ్చను వాడుకొని కథను తనకు అనుకూలంగా మలుచుకోవడం చాలా సింపుల్‌, రొటీన్‌గా అనిపిస్తాయి. డైలాగ్స్, సన్నివేశాల్లో అంతర్లీనంగా ఉండే కామెడీ సినిమాకు బలంగా మారాయని చెప్పవచ్చు.

    దుల్కర్ యాక్షన్, రొమాన్స్

    దుల్కర్ యాక్షన్, రొమాన్స్

    దుల్కర్ సల్మాన్ విషయానికి వస్తే.. తెర మీద సిద్ధూలా కనిపించడానికి ప్రయత్నించి సఫలమయ్యాడని చెప్పవచ్చు. పాత్రలో ఒదిగిపోవడమే కాకుండా భావోద్వేగం, వినోదంతో కూడిన సన్నివేశాల్లో తన మార్కును చూపించాడు. కొన్ని సన్నివేశాల్లో దుల్కర్ చూపించిన హావభావాలు నటనలో ఆయన పరిణితిని సూచిస్తాయి. కథలో ఉండే ఇంటెన్సిటీని గ్రహించి స్వయంగా నిర్మాతగా మారడం ఆయన విజన్‌కు, సినిమాపై ఉన్న అభిరుచిని తెలియజేస్తాయి.

    రీతూ వర్మ ఫెర్ఫార్మెన్స్

    రీతూ వర్మ ఫెర్ఫార్మెన్స్

    హీరోయిన్ రీతూ వర్మ పలు రకాల వేరియేషన్లు ఉన్న పాత్రలో మెరిసింది. గ్లామర్ పరంగానే కాకుండా యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్రలో మెప్పించింది. ముఖ్యంగా దొంగతనం సీన్‌లో రీతూ వర్మ యాక్టింగ్ చాలా బాగుంటుంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను సులభంగా పండించింది. ఇక ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ఫ్రెండ్‌గా నటించిన రక్షన్ తన మార్క్ యాక్టింగ్‌తో నవ్విస్తాడు. ఇక రీతూ వర్మ స్నేహితురాలిగా నిరంజనీ కూడా తన పాత్రతో సినిమాకు బలంగా మారింది.

     మిగితా పాత్రల్లో

    మిగితా పాత్రల్లో

    ఇక కనులు కనులను దోచాయంటే చిత్రానికి హైలెట్‌గా నిలిచిన పాత్రల్లో ఒకటి గౌతమ్ వాసుదేవ మీనన్, మరోకటి అనీష్ కురవిల్లా ప్రముఖంగా చెప్పుకోవాలి. పోలీస్ ఆఫీసర్‌గా గౌతమ్ ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారనే చెప్పవచ్చు. డైలాగ్ డెలివరీలోను, ఎమోషన్స్ పలికించడంలోను గౌతమ్ మెచ్యురిటీ బ్రహ్మండంగా ఉంటుంది. అలాగే సాఫ్ట్ విలన్‌గా అనీష్ కురువిల్లా పాత్ర సినిమాను మలుపు తిప్పేలా ఉంటుంది. ఈ పాత్రలో అనీష్ పూర్తిగా మార్కులు కొట్టేశారని చెప్పవచ్చు.

    టెక్నికల్ టీమ్ ఎలా పనిచేసిందంటే

    టెక్నికల్ టీమ్ ఎలా పనిచేసిందంటే

    సాంకేతిక విభాగాల్లో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సి వస్తే.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ముందుగా చెప్పుకోవాలి. సన్నివేశాలను ఎలివేట్ చేయడంలో హర్షవర్ధన్ రామేశ్వర్ బీజీఎం అద్భుతంగా పనిచేసింది. ఇక మసాల కాఫీ అందించిన మ్యూజిక్, పాటలు సందర్భోచితంగా బాగున్నాయి. కేఎం భాస్కరన్ సినిమాటోగ్రఫి, ఎడిటర్ ప్రవీణ్ ఆంథోని పనితీరు బాగుంది. మణిపూర్, ఢిల్లీ లాంటి ప్రదేశాల్లోని లొకేషన్లు, యాక్షన్ సీన్లు ఆకట్టుకొనేలా ఉంటాయి.

     ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    కనులు కనులను దోచాయంటే సినిమా టైటిల్ వింటే ఏదో ప్రేమ కథలా ఉందే అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ పక్కా యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్‌తోపాటు మంచి రొమాంటిక్ కామెడీ చిత్రమని అని చెప్పవచ్చు. కథలో ట్విస్టులు సినిమాకు ప్రాణంగా నిలిచాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాకు మరో పాజిటివ్ అంశమని చెప్పుకోవాలి. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అందరికి కొత్త అనుభూతిని, వినోదాన్ని పంచే చిత్రమని చెప్పవచ్చు. బీ, సీ సెంటర్లలో సినిమా ప్రేక్షకులకు చేరవేయ గలిగితే కనులు కనులను దోచాయంటే మంచి సక్సెస్‌ను అందుకోవడం ఖాయం.

     బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్
    నటీనటులు ఫెర్ఫార్మెన్స్
    దుల్కర్ సల్మాన్, రితూ వర్మ కెమిస్ట్రీ
    సినిమాటోగ్రఫి
    బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
    కథలో ట్విస్టులు
    స్క్రీన్ ప్లే

    మైనస్ పాయింట్స్
    పరభాషా నటులు
    సెకండాఫ్‌ నిడివి

    Recommended Video

    Dulquer Salmaan Says "I Beg You. Please Don't Do That" హీరో సంచలన లేఖ | Filmibeat Telugu
    తెర ముందు, తెర వెనుక

    తెర ముందు, తెర వెనుక

    నటీనటులు: దుల్కర్ సల్మాన్, రితూ వర్మ, రక్షన్, నిరంజనీ అహతియాన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్
    నిర్మాతలు: వయకామ్ 18 స్టూడియోస్, ఆంటో జోసెఫ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
    మ్యూజిక్: మసాలా కాఫీ
    సినిమాటోగ్రఫి: కేఎం భాస్కరన్
    బ్యాక్‌‌గ్రౌండ్ స్కోర్: హర్షవర్ధన్ రామేశ్వర్
    ఎడిటర్: ప్రవీణ్ ఆంథోని
    స్టంట్స్: ఆర్‌కే ఉమాశంకర్
    దర్శకత్వం: దేసింగ్ పెరియాసామీ
    పీఆర్‌వో: నాయుడు సురేంద్ర కుమార్, ఫణి కందుకూరి

    English summary
    'Kanulu Kanulanu Dochayante', starring Dulquer Salmaan in the lead, hits the screens this Friday (February 28). Starring Ritu Varma of 'Pelli Choopulu' fame as the heroine, the romantic thriller is written and directed by Desingh Periyasamy. The film is coming in the production of Viacom 18 Studios and Anto Joseph Film Factory. KFC Entertainments has acquired the Telugu version's rights of this Dulquer's 25th movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X