Dunki Review గుండెను భారంగా మార్చే డంకీ.. షారుక్ ఫెర్ఫార్మెన్స్ , హిరాణి టేకింగ్ ఎలా ఉందంటే?

Rating:
3.0/5

పంజాబ్‌లోని లల్టూ గ్రామంలో పేదరికంతో బాధపడుతున్న మను రంధ్వా (తాప్సీ పన్ను), బుగ్గు (విక్రమ్ కొచ్చర్), బల్లి(అనిల్ గ్రోవర్), సుఖి (వికీ కౌశల్) లండన్‌కు వెళ్లాలనే ప్రయత్నాల్లో ఉంటారు. చదువు, డబ్బు, ఇతర అర్హతలు లేకపోవడం వల్ల వీసా రిజెక్ట్ అవుతుంది. ఆ సమయంలో ఆ గ్రామానికి హర్ దయాళ్ సింగ్ ధిల్లాన్ అలియాస్ హర్డి (షారుక్ ఖాన్) ఓ పని మీద వస్తాడు. వీసా లేకుండా అక్రమంగా లండన్‌కు వెళ్లాలని మను, హర్డీ టీమ్ నిర్ణయించుకొంటారు.

Recommended Video

Salaar కి Shah Rukh Khan డంకీ పోటీ ఇస్తుందా | Dunki Review | Telugu Filmibeat

లల్టూ గ్రామానికి హార్డి ఎందుకు వచ్చాడు? మను, బుగ్గు, బల్లికి తన కుటుంబంలో ఎదురైన ఆర్థిక సమస్యలు ఏమిటి? సుఖి ఎందుకు లండన్ వెళ్లాలని ప్రయత్నిస్తుంటాడు. తనకు వీసా లభించకపోవడం వల్ల సుఖి తీసుకొన్న నిర్ణయం ఏమిటి? సుఖి తీసుకొన్న నిర్ణయం ప్రభావం మను, హర్డీపై ఎలా పడింది? లండన్‌కు అక్రమంగా డంకీ అనే ప్రయాణం ఎలా సాగింది? లండన్ చేరుకొనే క్రమంలో వారికి ఎదురైన ప్రాణాంతక సంఘటనలు ఏమిటి? లండన్‌కు వెళ్లిన తర్వాత మనును వదిలేసి హార్డి ఎందుకు ఇండియాకు వచ్చాడు? 25 ఏళ్లు తర్వాత మను, తన స్నేహితులతో ఇండియాకు ఎందుకు రావాలని ప్రయత్నించింది. ఇండియాకు రావడానికి వారికి వీసా ఎందుకు లభించలేదు. మనుతోపాటు తన స్నేహితులను స్వదేశానికి రప్పించడానికి హార్డీ చేసిన ప్లాన్ ఏమిటి? వారు క్షేమంగా భారత్‌కు చేరుకొన్నారా? అనేది సినిమా కథ.

Dunki Review and Rating: Shah Rukh Khans migrants emotional drama

లండన్‌తో మను (తాప్సీ)పై ఎమోషనల్ సీన్‌తో డంకీ కథ మొదలవుతుంది. హార్డి (షారుక్)ను మను టీమ్ దుబాయ్‌కి రమ్మని చెబుతుంది. ఆ సీన్‌తో అసలు కథ లల్టూ గ్రామంలో ఫన్నీగా మొదలవుతుంది. వినోదం, భావోద్వేగాలను కలిపి రాజ్‌కుమార్ హిరాణి తరహా సినిమాను చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. గ్రామంలో రిలేషన్స్, ఆర్థిక కష్టాలు లాంటి సీన్లు ఆడియెన్స్‌ను కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. ఇంగ్లీష్ భాషను నేర్చుకోవడమనే సన్నివేశాలు కాస్త ఎక్కువైనా మంచి వినోదాన్ని పండించాయి. వీసా రిజెక్ట్ కావడంతో సుఖి ( వికీ కౌశల్) తీసుకొన్న నిర్ణయం ప్రేక్షకుల హృదయాలను భారంగా మారుస్తుంది. డంకీ విధానం ద్వారా లండన్ ప్రయాణం మొదలు కావడంతో ఫస్టాఫ్ కొంత ఎమోషనల్‌గా, మరికొంత ఫన్‌గా ముగుస్తుంది.

డంకీ సెకండాఫ్ విషయానికి వస్తే.. లండన్‌లో తాప్సీ పెళ్లి సీన్ సందర్భంగా షారుక్ పలికించిన సీన్లు చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. అలాగే లండన్ కోర్టులో హార్డి తన దేశభక్తిని నిరూపించుకొనే సన్నివేశాలు గుండెను భారంగా మారుస్తాయి. షారుక్ ఖాన్ హావభావాలు భావోద్వేగానికి గురిచేస్తాయి. కథ దుబాయ్‌కి చేరిపోయిన తర్వాత పూర్తిగా డ్రాప్ అవ్వడం, డాక్యుమెంటరీ మాదిరిగా సాగడంతో కొంత అసహనంగా అనిపిస్తుంది. తాప్సికి సంబంధించిన ఎమోషనల్ డ్రామా, గ్రామస్థులతో ఫన్ సీన్లతో రాజకుమార్ హిరాణి సినిమా ముగించిన విధానం కన్విన్స్‌గా అనిపించదు.

Dunki Review and Rating: Shah Rukh Khans migrants emotional drama

నటీనటులు ఫెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. పఠాన్, జవాన్ సినిమాలతో పోల్చుకొంటే డంకీలోని హార్డీ పాత్ర చాలా డిఫరెంట్. హార్డిగా రెండు షేడ్స్ ఉన్న పాత్రను పోషించాడు. యంగ్ షారుక్ ఖాన్‌గా మంచి ఎనర్జీ కనిపించింది. వృద్దుడిగా ఆయన కనెక్ట్ కాలేకపోతాడు. కానీ ఇరాన్ బోర్డర్, లండన్ కోర్టు సీన్ లాంటి సీన్లలో షారుక్ చెలరేగిపోయాడు. క్లైమాక్స్ సీన్‌లో కూడా ఆయన ఫెర్ఫార్మెన్స్ ఉద్వేగభరితంగా ఉంటుంది. మను పాత్రలో ఇంతకు ముందు చూసిన తాప్సీ వేరు కనిపించదు. చాలా ఎమోషనల్‌లో ఒదిగిపోయి నటించింది. గ్లామర్, డీ గ్లామరైజ్డ్ పాత్రలో ఆకట్టుకొన్నది. వికీ కౌశల్ పాత్ర చిన్నదైనా గుర్తుండిపోవడమే కాకుండా కంటతడి పెట్టించేలా నటించాడు. విక్రమ్ కోచర్, అనిల్ గ్రోవర్ తమ పాత్రలకు న్యాయం చేశారు. బోమన్ ఇరాని, ఇతర పాత్రలు ఫర్వాలేదనిపిస్తాయి.

డంకీ సినిమా విషయానికి వస్తే.. రాజ్ కుమార్ రైటింగ్, స్క్రీన్ ప్లే చూస్తే.. మరోసారి ఆయన తన క్రాఫ్ట్‌లో మాస్టర్ అని మరోసారి రుజువు చేస్తారు. కానీ క్లైమాక్స్ విషయంలో ఆయన తడబాటు కనిపిస్తుంది. ఆయన గత సినిమాల్లో క్లైమాక్స్ ప్రేక్షకుడిని వెంటాడుతుంటాయి. ఈ సినిమాలో అది మిస్ అయినట్టు అనిపిస్తుంది. ఇక సినిమాటోగ్రఫి, మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

Dunki Review and Rating: Shah Rukh Khans migrants emotional drama

డంకీ మూవీ గురించి ఫైనల్‌గా చెప్పాలంటే.. షారుక్, తాప్సీ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు హైలెట్. రాజ్ కుమార్ హిరాణి మూవీలో ఉండే స్టాండర్డ్స్ మెప్పిస్తాయి. ఫన్, ఎమోషన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్ అంశాలు భావోద్వేగానికి గురిచేస్తాయి. కానీ హిరాణీ సినిమాలో ఉండే మ్యాజిక్ ఈ సినిమాలో కనిపించదు. కానీ ఓసారి తప్పకుండా చూడాలనిపించేలా ఉంటుంది. ఎక్కువ అంచనాలు పెట్టుకొని వెళ్తే కొంత నిరాశకు గురి అయ్యే అవకాశం లేకపోలేదు. ఇది ఓ డిఫరెంట్ సినిమా.. ఆ కోణంలో చూస్తే తప్పకుండా నచ్చుతుంది. సో.. ఫీల్ ది ఎక్స్‌పీరియెన్స్ ఇన్ డంకీ థియేటర్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X