Dunki Twitter Review.. షారుక్ ఖాన్ కెరీర్‌లో బెస్ట్.. రాజ్ కుమార్ హిరాణి ఎలా తీశారంటే?
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, సెన్సేషనల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణి కాంబినేషన్‌లో వస్తున్న చిత్ర డంకీ. తాప్పీ పొన్ను, వికీ కౌశల్, బోమన్ ఇరానీ నటించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 21వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా అమెరికాలో ఒక రోజు ముందే ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈ సినిమాపై నెటిజన్ల అభిప్రాయం విషయానికి వస్తే..
రాజ్ కుమార్ హిరాణి మరోసారి తన టాలెంట్‌తో తానేంటో రుజువు చేసుకొన్నాడు. డంకీ సినిమా స్క్రిప్టు బాగుంది. నటీనటుుల యాక్టింగ్ బాగుంది. ఈ సినిమా హిందీలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా అని చెప్పగలను. డైరెక్షన్ విషయానికి వస్తే.. రాజ్‌కుమార్ హిరాణి కంటే గొప్పగా ఇంత బాగా తీస్తారని అనుకోవడం లేదు అని ఓ నెటిజన్ తన రివ్యూను పోస్టు చేశాడు.

డంకీ సినిమా మాస్టర్ పీస్. కథను చెప్పిన విధానం అద్బుతంగా ఉంది. సినిమాటోగ్రఫి స్టన్నింగా ఉంది. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ టాప్‌గా ఉంది. ఈ సినిమా స్టార్ అయినప్పటి నుంచి ఫినిష్ అయ్యే వరకు సీట్లకు అత్తుకుపోయి చూస్తారు అని కోమల్ నహతా ట్వీట్ చేశాడు.
డంకీ లాంటి సినిమాను ఇంతకు ముందు చూసి ఉండరు. మైండ్ బ్లోయింగ్ స్టోరి, యాక్షన్. రాజు హిరాణి స్టోరి, డైరెక్షన్ బాగుంది. ఫర్ఫెక్ట్ కాస్టింగ్. షారుక్ తన రోల్ అద్బుతంగా నటించారు. ఈ సిినిమా చూస్తే హార్డీ క్యారెక్టర్‌లో ప్రేమలో పడిపోతారు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఈ సినిమా ఫ్లాప్ అయితే నా ట్విట్టర్ అకౌంట్ డీయాక్టివేట్ చేస్తాను అని ఓ నెటిజన్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
డంకీ మూవీ అద్బుతమైన మూవీ. రాజ్‌కుమార్ హిరాణి రూపొందించిన సినిమాల్లో ఇదే బెస్ట్. నేను ఈ సినిమా చూసిన తర్వాత చాలా ఎమోషనల్ అయ్యాను. షారుక్ ఖాన్ నటించిన పఠాన్, జవాన్ సినిమాల కంటే బెటర్. ఈ సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. 1000 కోట్లు వసూళ్లు గ్యారంటీ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
డంకీ సినిమా బ్లాక్ బస్టర్. రాజ్ కుమార్ హిరాణి మాస్టర్ పీస్ తీయడమే కాకుండా ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలిగించాడు. ఎమోషన్స్ , మెలోడిని మిక్స్ చేసి అద్బుతంగా సినిమాను అందించాడు. ఈ సంవత్సరం షారుక్ ఖాన్ నామ సంవత్సరం. వికీ కౌశల్, తాప్సీ అద్బుతంగా నటించారు. ఈ సినిమాను మిస్ చేసుకోవద్దు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
డంకీ సినిమా మెగా బ్లాక్ బస్టర్. హార్డ్ కోర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. షారుక్ కెరీర్‌లో అద్బుతమైన సినిమా. షారుక్‌ను ఎవరూ చూపించని విదంగా రాజ్ కుమార్ హిరాణి చూపించాడు. ప్రేక్షకుల హృదయాలను కాకుండా బాక్సాఫీస్‌ను కూడా ఆకట్టుకొంటుంది అని తరుణ్ ఆదర్శ్ రివ్యూ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











