Eagle Movie Review హాలీవుడ్ స్టైల్‌లో స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్.. రవితేజ హిట్టు కొట్టాడా? ఈగిల్ మూవీ రివ్యూ

Rating: 2.75/5

సహదేవ్ (రవితేజ) కాంట్రాక్ట్ కిల్లర్. జయ్ (నవదీప్)తో కలిసి నక్సలైట్లు, పాక్ టెర్రరిస్టులు, ఇతర సంఘ విద్రోహ శక్తులకు ఆయుధాలు అందుకుండా ఆపరేషన్స్ నిర్వహిస్తుంటాడు. తలకొన ప్రాంతంలో స్థావరాన్ని ఏర్పరుచుకొని పత్తి రైతులకు అండగా ఉంటూ, దేశ సమగ్రతకు ముప్పు వాటిల్లకుండా తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకొంటాడు.

తలకొనలో పత్తి రైతులకు సహదేవ్‌కు సంబంధం ఏమిటి? చేనేత రైతులకు ఎలాంటి ఉపకారం చేశాడు? ఆయుధాల అక్రమ రవాణాను ఎలా అడ్డుకొన్నాడు. తలకొనలో నిర్మించుకొన్న వెపన్ ఫెసిలిటీని ఎలా ఉపయోగించుకొన్నాడు? సహదేవ్‌ను వెతుక్కొంటూ ఢిల్లీకి చెందిన జర్నలిస్టు నళినిరావు (అనుపమ పరమేశ్వరన్) ఎందుకు తలకొనకు వచ్చింది? రచన (కావ్య థాపర్)కు సహదేవ్‌కు రిలేషన్ ఏమిటి? తన సామ్రాజ్యాన్ని టార్గెట్ చేసిన ఇండియన్ ఆర్మీని సహదేవ్ ఎలా ఎదుర్కొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే ఈగిల్ సినిమా కథ.

 Eagle Movie Review In Telugu and Rating: Ravi Tejas Stylish Action Thriller

ఢిల్లీలో తలకొన చేనేత రైతులకు సంబంధించిన ఓ వార్తతో కేంద్ర ప్రభుత్వంలో అలజడి రేపడమనే ఎసిసోడ్‌తో సినిమాను ఓ రేంజ్‌లో మొదలుపెట్టి.. ఏదో కొత్త సబ్జెక్ట్ చూడబోతున్నామనే ఫీలింగ్ కల్పించాడు దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. ఆ తర్వాత చేనేత విషయాన్ని వదిలేసి.. ఆయుధాలు, నక్సలైట్లు, పాక్ టెర్రరిస్టులు అనే విషయాలను పట్టుకొచ్చి కథను మరింత కంగాళీ చేశాడు. ఫస్టాఫ్‌లో సాగదీత, క్లారిటీ లేని సీన్లతో కథలో ఏం జరుగుతుందనే కన్‌ఫ్యూజన్‌ను క్రియేట్ చేశాడు. ఫస్టాఫ్ ఏదో జరిగిపోయింది.. సెకండాఫ్‌లో ఏం చేస్తాడో అనే ఆశాభావంతో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 Eagle Movie Review In Telugu and Rating: Ravi Tejas Stylish Action Thriller

ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. కథలో ఉన్న రకరకాల వేరియేషన్స్‌కు సంబంధించిన డీటైల్స్‌ను చెప్పడం ప్రారంభించడంతో కొంత బెటర్‌గా అనిపిస్తుంది. అనవసర విషయాలపై అతిగా శ్రద్దపెట్టడం వల్ల కథలో ఉండే స్ట్రాంగ్ ఎమోషన్స్ పక్కదారి పట్టాయనిపిస్తుంది. సినిమాకు బలంగా అనిపించే చేనేతల పాయింట్‌ను సైడ్ ట్రాక్ చేశాడనిపిస్తుంది. అయితే సినిమాను విజువల్ ట్రీట్‌గా మలిచే క్రమంలో కథను పక్కన పెట్టాశారా అనే ఫీలింగ్ కలుగుతుంది. కానీ చివరి 20 నిమిషాల్లో కథను బలంగా చెప్పడం వల్ల అప్పటి వరకు నీరసంగా సాగిన మూవీలో కొత్త జోష్ కనిపిస్తుంది. ఓవరాల్‌గా హాలీవుడ్ స్థాయి యాక్షన్ థ్రిల్లర్‌ను అందించడంలో సఫలమయ్యారనే ఫీలింగ్ కలుగుతుంది. డైరెక్టర్ ఎత్తుకొన్న పాయింట్ బాగుంది. కానీ దానిని ఎగ్జిక్యూట్ చేయడంలో తడబాటు పడ్డారనిపిస్తుంది.

ఇక నటీనటులు విషయానికి వస్తే.. ఈగిల్ మూవీలో రవితేజ వన్ మ్యాన్ షో. మొదటి సీన్ నుంచి చివరి సీన్ వరకు ఎలివేషన్స్, బిల్డప్ షాట్స్‌తో ఫ్యాన్స్‌కు ఫెస్టివల్ వాతవారణాన్ని తెచ్చాడని చెప్పవచ్చు. ఇక డైలాగ్ డెలీవరి కూడా కొత్తగా ఉంది. గెటప్, కారెక్టర్‌కు సంబంధించిన యాటిట్యూడ్‌తో రవితేజ కేక పెట్టించాడు. ఇక రవితేజ పక్కన నవదీప్ మంచి క్యారెక్టర్‌లో మెప్పించాడు. అనుపమ రోల్ కథను నడిపించడానికి ఉపయోగపడింది. కావ్య థాపర్ పాత్ర ఆటలో అరటిపండులా ఉంటుంది. మధుబాల, అవసరాల, వినయ్ ఇతర పాత్రలు జస్ట్ ఒకే అనిపిస్తాయి.

సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, మ్యూజిక్, డైలాగ్స్ ఈగిల్ సినిమాకు బ్యాక్ బోన్‌లా మారాయి. డైలాగ్స్‌లో పవర్ ఉన్నప్పటీకి సన్నివేశాల్లో పస లేకపోవడంతో వాటిని ఎలివేట్ చేయడంలో బీజీఎం పూర్తిగా సహకరించింది. ఎడిటింగ్ విభాగం కథను క్లారిటీగా చెప్పే విషయంపై దృష్టిపెట్టాల్సిందనిపిస్తుంది. తెలుగు సినిమాను కాకుండా హాలీవుడ్ సినిమాను చూస్తున్నామా? అనేంతగా ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు టాప్ క్లాస్ రేంజ్‌లో ఉన్నాయి.

 Eagle Movie Review In Telugu and Rating: Ravi Tejas Stylish Action Thriller

యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలకు తోడుగా కొంత ఎమోషన్స్ ‌తో కలిపి చేసిన చిత్రం ఈగిల్. డైరెక్టర్ ఎంచుకొన్న పాయింట్ బాగుంది. కానీ ఆ పాయింట్ చుట్టూ కథను నడిపి ఉంటే మరో రేంజ్‌లో సినిమా ఉండేదనిపిస్తుంది. కథలో అసలు విలన్ లేకపోవడం వల్ల హీరో రవితేజ చేసిన ఆపరేషన్స్, , ఎలివేషన్స్, బిల్డప్ షాట్స్ పెద్దగా వర్కవుట్ కాలేదనిపిస్తుంది. ఫస్టాఫ్ స్లోగా.. సెకండాఫ్ రేసీగా చేసి మూవీని బ్యాలెన్స్ చేశాడు. రవితేజ, బ్యాక్ గ్రౌండ్, ప్రొడక్షన్ వాల్యూస్ ప్లస్ పాయింట్స్. స్టోరి,నేరేషన్ పరంగా కొన్ని లోపాలు పక్కన పెడితే.. డీసెంట్ యాక్షన్, థిల్లర్ మూవీ. సీరియస్‌గా సాగే యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా బాగా నచ్చుతుంది. థియేటర్‌లో కొత్త అనుభూతిని పొందేందుకు ఈగిల్ చూడొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X