twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భేష్‌ అన్నవారు 'ఎవరులేని మనిషి'

    By Staff
    |

    Eduruleni Manisi
    చిత్రం: ఎదురులేని మనిషి
    తారాగణం: నాగార్జున(ద్విపాత్రాభినయం), సౌందర్య, షెహనాజ్‌, యుమున, అచ్యుత్‌
    సంగీతం:ఎస్‌.ఎ.రాజ్‌ కుమార్‌
    నిర్మాత: డి.శివప్రసాద్‌ రెడ్డి
    దర్శకత్వం: జొన్నలగడ్డ శ్రీనివాసరావు

    సహజత్వానికి దగ్గరగా ఉండే చిత్రాలే హిట్‌ అవుతున్న రోజులివి. వీటికి అతీతంగా ఆరు పాటలు, 5 ఫైట్లు, కొన్ని కామెడీ సీన్స్‌, మరికొన్ని సెంటిమెంట్‌ సీన్స్‌...ఇలా అన్ని కలబోసిన చిత్రాలు కూడా వస్తుంటాయి. వాటిలో ట్విస్ట్‌ లు బాగుండి, సబ్జెక్ట్‌ లైన్‌ బాగుంటే హిట్‌ అవుతాయి. కానీ తలాతోక లేని కథ, 16 రీళ్ళలో 16 ట్విస్ట్‌ లు పెట్టి తీసే మూస చిత్రాల జాబితాలో నాగార్జున తాజా చిత్రం- ఎదురులేని మనిషి కూడా చేరుతుంది. ఆ సినిమాలో కొంత, ఈ సినిమాలో కొంత సీన్స్‌ ఎన్నుకొని కథను అల్లిన ఈ సినిమాలో నటీనటుల పెర్ఫర్మెన్స్‌ తప్ప మిగతా అంతా రోటీన్‌.

    సూర్యమూర్తి ఓ గ్రామానికి మకుటం లేని మహారాజు. ఆయన చెప్పిందే వేదం అక్కడ. అతని తమ్ముడు సత్య(నాగార్జున). సత్య అన్నా, అన్న కూతురు అన్నా సూర్యమూర్తికి ప్రాణం. తండ్రిలేని ఆ పాపకు అన్నీ తనే అయి పెంచుతాడు. సత్య తెలుగురాని షెహనాజ్‌ ప్రేమలో పడుతాడు. పెళ్ళికాకుండా ఉండిపోయిన సూర్యమూర్తికి మంచి సంబంధాన్ని వెతుకుతాడు సత్య. సౌందర్య తన అన్నకు బాగా సూటవుతుందని భావిస్తాడు. తన అక్క(యమున) చావుకు కారణం సూర్యమూర్తి అని భావించిన సౌందర్య పగతీర్చుకునేందుకు ఈ పెళ్ళికి ఒప్పుకుంటుంది.

    అయితే పెళ్ళి అయ్యాక సౌందర్య ఎత్తుగడలు గ్రహించిన సత్య అసలు విషయం చెపుతాడు. యుమున తన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకోవడం కాకుండా తన అన్న అచ్యుత్‌ చావుకు కారకురాలు అయిందని వివరిస్తాడు. పాపకోసమే సూర్యమూర్తి ఇన్నాళ్ళూ పెళ్ళి చేసుకోకుండా ఉన్నాడని చెప్పుతాడు. నిజం తెలుసుకున్న సౌందర్య మారుతుంది. నిజం తెలియక ముందు సౌందర్య ఓ తప్పు చేస్తుంది. ఇంట్లో ఉన్న నగల్ని తీసి తమ్ముడు వేణుమాధవ్‌ కు ఇచ్చి అమ్మమని చెపుతుంది. నగలు అమ్ముతుండగా వేణుమాధవ్‌ పట్టుబడుతాడు.

    దాంతో వదినను కాపాడేందుకు సత్య తనే నేరం చేశానని అంటాడు. దాంతో అన్నతమ్ముల మధ్య గొడవ ప్రారంభమవుతుంది. ఆస్తి పంపకాలు జరుగుతాయి. ఇదే అదనుగా చూసుకొని విలన్‌ గ్రూప్‌ విజృభించడంతో కథ క్లైమాక్స్‌ కు చేరుతుంది.

    కథాగమనంలో ఎన్నో లొసుగులు ఉన్నాయి. అందులో అసలు అతకనిది యమున పోషించిన పాత్ర. అలాగే విలన్స్‌ ఉండాలి కాబట్టి విలన్‌ గ్రూప్‌ ను పెట్టినట్లుగా ఉంది. కథలో వారి పాత్ర అనవసరం. సౌందర్య తన పాత్రకు తనే డబ్బింగ్‌ చెప్పుకొంది. ఏ మాత్రం నప్పని డబ్బింగ్‌. షెహనాజ్‌ వీజేయింగ్‌ చేసుకోవడమే బెటర్‌. నాగార్జున పెర్ఫార్మెన్స్‌ మాత్రం చెప్పుకోదగ్గ అంశం. సూర్యమూర్తి పాత్రలో హుందాగా ఉన్నాడు. అయితే కాస్తా లావుగా ఉండేట్లు గెటప్‌ ఉంటే బాగుండేది. పేలవమైన కథతో దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు పరిచయం అయ్యాడు. ఎస్‌.ఎ.రాజ్‌ కుమార్‌ సంగీతం మరీ పేలవం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X