twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఈ నగరానికి ఏమైంది? సినిమా రివ్యూ: ఫన్ అండ్ ఫ్రెండ్‌షిప్!

    టాలీవుడ్‌లోనే కాకుండా భారతీయ సినీ పరిశ్రమలో కూడా దర్శకుడు తరుణ్ భాస్కర్‌కు పెళ్లిచూపులు చిత్రం మంచి గుర్తింపు తెచ్చింది. తన రెండో చిత్రంగా తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది చిత్రాన్ని రూపొందించి జూన్ 28

    By Rajababu
    |

    Recommended Video

    Ee Nagaraniki Emaindi Movie Review ఈ నగరానికి ఏమైంద సినిమా రివ్యూ

    Rating:
    2.5/5
    Star Cast: విశ్వక్ సేన్, సాయి సుశాంత్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను, అనిషా అంబ్రోస్, సిమ్రాన్ చౌదరీ
    Director: తరుణ్ భాస్కర్

    టాలీవుడ్‌లోనే కాకుండా భారతీయ సినీ పరిశ్రమలో కూడా దర్శకుడు తరుణ్ భాస్కర్‌కు పెళ్లిచూపులు చిత్రం మంచి గుర్తింపు తెచ్చింది. ఆ చిత్రం ఆయనకు అవార్డులు, రివార్డులు సంపాదించి పెట్టింది. దాంతో తరుణ్ భాస్కర్‌పై భారీగా అంచనాలు పెరిగాయి. తన రెండో చిత్రంగా తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది చిత్రాన్ని రూపొందించి జూన్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంతో తరుణ్ భాస్కర్ ప్రేక్షకులు పెట్టుకొన్న అంచనాలను చేరుకొన్నారా? టాలీవుడ్‌లో ద్వితీయ విఘ్నాన్ని అధిగమించారా అని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

    ఈ నగరానికి ఏమైంది స్టోరి

    ఈ నగరానికి ఏమైంది స్టోరి

    వివేక్, కార్తీక్, ఉపేంద్ర, కౌశిక్ (విశ్వక్ సేన్, సాయి సుశాంత్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను) బాల్య స్నేహితులు. షార్ట్ ఫిలిం తీయడం ద్వారా నిర్మాతలను ఆకర్షించి బిగ్ మూవీస్ రూపొందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంటారు. ఈ క్రమంలో వివేక్ (విశ్వక్ సేన్)కు శిల్ప (సిమ్రాన్ చౌదరీ)తో బ్రేకప్ జరుగుతుంది. ఆ తర్వాత ఓ రకమైన అభద్రతాభావంలో వివేక్ మునిగిపోతాడు. యాటిట్యూడ్ పెరిగిపోతుంది. దాంతో వారు షార్ట్ ఫిలింస్ తీయడం ఆపేసి ఏదో పనిచేస్తూ జీవితంలో స్థిరపడాలనే ఉద్దేశంతో ముందుకెళ్తుంటారు. ఆ సమయంలో ఓ సమస్యలో ఇరుక్కుపోవడంతో కార్తీక్ ఐదు లక్షలు అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలో నలుగురు ఫ్రెండ్స్ మళ్లీ షార్ట్ ఫిలిం తీసి కార్తీక్‌ను ఆదుకోవాలని నిశ్చయించుకొంటారు.

    స్టోరిలో ట్విస్టులు ఇవే

    స్టోరిలో ట్విస్టులు ఇవే

    కార్తీక్ వచ్చిన సమస్య ఏమిటి? వివేక్ షార్ట్ ఫిలిం తీసి దర్శకుడిగా సక్సెస్ అవుతాడా? కౌశిక్ (అభినవ్ గోమటం) నటుడిగా స్థిరపడ్డారా? కార్తీక్ సినిమాటోగ్రఫర్‌గా సక్సెస్ అయ్యాడా? ఉపేంద్ర ఎడిటర్‌గా స్థిరపడ్డారా? వివేక్ లవ్ ఎందుకు బ్రేకప్ అయింది? షార్ట్ ఫిలిం తీసే క్రమంలో పరిచయమైన షెర్లీను ప్రేమను వివేక్ పొందాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ నగరానికి ఏమైంది చిత్ర కథ.

    ఫస్టాఫ్ అనాలిసిస్

    ఫస్టాఫ్ అనాలిసిస్

    ఈ నగరానికి ఏమైంది చిత్ర మొదటి భాగంలో నలుగురు హీరోల క్యారెక్టర్ పరిచయం, వారి మధ్య ప్రేమ, ఈసడింపులతో చకచకా గడిచిపోతుంది. మాటల తూటాలు పేలడంతో కొన్ని సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉంటాయి. వివేక్ బ్రేకప్ తర్వాత కథ సీరియస్ మోడ్‌లోకి వెళ్తుంది. అయితే స్టోరి ట్రావెలింగ్‌లో అభినవ్ డైలాగ్స్ కొంత రిలీఫ్ కలుగుతుంది. షేర్లీ (అనిశా అంబ్రోస్) పాత్ర ద్వారా ఫ్లాష్ బ్యాక్ సీన్లను చెప్పడం ద్వారా ప్రేక్షకుడికి కొత్త అనుభూతి కలుగుతుంది. అయితే కథ గమనంలో బలమైన పాయింట్ లేకపోవడం, ఎమోషన్ ఎస్టాబ్లిష్ కాకపోవడంతో సగం భాగంలో కేవలం వినోదంతోనే సర్దిపెట్టుకోవాల్సి వస్తుంది.

    సెకండాఫ్‌ అనాలిసిస్

    సెకండాఫ్‌ అనాలిసిస్

    ఇక రెండో భాగంలో కథ గోవాకు షిష్ట్ అవుతుంది. గోవాలోని సుందర ప్రదేశాల మధ్య స్టోరి కొత్త మలుపు వైపు తిరుగుతుంది. షేర్లీ సెకండాఫ్ ఎంట్రీ ఇవ్వడం రొటీన్ సీన్లకు బ్రేక్ పడుతుంది. ఐదు లక్షలు సంపాదించేందుకు షార్ట్ ఫిలిం తీసే ప్రాసెస్ షెర్లీ భాగమవ్వడం, ఆతర్వాత వివేక్‌ ఆకర్షణకు గురికావడం కొంత ఫ్రెష్ నెస్ కనిపిస్తుంది. కాకపోతే సెకండాఫ్‌లో సీన్లన్నీ అతికించినట్టుగా, ఆర్టిఫిషియల్‌గా అనిపిస్తాయి. చివరకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్‌తో స్టోరికి ముగింపు కార్డు పడుతుంది.

    తరుణ్ భాస్కర్ డైరెక్షన్

    తరుణ్ భాస్కర్ డైరెక్షన్

    పెళ్లిచూపులు చిత్రంతో దర్శకుడిగా తరుణ్ భాస్కర్ అందరి మన్ననల్ని పొందారు. తన తొలి చిత్రానికి భిన్నంగా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌తో ముందుకొచ్చారు. విడుదలకు ముందే రొమాంటిక్ కామెడీ అనే ఫీలింగ్ కలుగజేశారు. దాంతో అంచనాలు భారీగా పెరుగకపోయినా సినిమా ఆసక్తికలుగజేశారు. పాత్రల తీరును రాసుకొన్న తీరు ఆయన ప్రతిభకు మరోసారి అద్దం పట్టింది. బలమైన సన్నివేశాలు లేకపోయినా ప్రేక్షకులను అలరించేందుకు అభినవ్ గోమటం పాత్రను మలిచిన విధానం శభాష్ అనిపించేలా ఉంటుంది. అయితే మిగితా పాత్రల్లో అంత భావోద్వేగం లేకపోవడంతో తేలిపోయినట్టు కనిపిస్తాయి. ఇతర పాత్రలను మరింత ప్రభావవంతంగా మలిచితే మరో మంచి చిత్రంగా మార్కులు సంపాదించే అవకాశం ఉండేది.

    అభినవ్ గోమటం ఫెర్ఫార్మెన్స్

    అభినవ్ గోమటం ఫెర్ఫార్మెన్స్

    నలుగురు స్నేహితులుగా విశ్వక్ సేన్, సాయి సుశాంత్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను కనిపించారు. వీరిలో విశ్వక్ సేన్ రెగ్యులర్‌గా సినిమాలను ఫాలో అయ్యేవారికి కొంత పరిచయం ఉంది. వెళ్లిపోమాకే చిత్రం ద్వారా విశ్వక్ సేన్ ఓ వర్గం ప్రేక్షకులకు సుపరిచితులు. ఇక మిగితా వారంతా కొత్తవారే. ఈ నలుగురిలో అభినవ్ గోమటం నటనలో ఓ ప్రత్యేకమైన శైలి కనిపించింది. అతని డైలాగ్స్‌లో టైమింగ్, పంచ్ కరెక్ట్‌గా పడింది. మిగితా పాత్రలను పోషించిన వారు తమ పరిధి మేరకు న్యాయం చేశారు.

    యూత్‌కు నచ్చేలా వివేక్ సాగర్

    యూత్‌కు నచ్చేలా వివేక్ సాగర్

    ఈ నగరానికి ఏమైంది చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందించారు. వెస్ట్రన్ టచ్ ఉండటం వల్ల శబ్దాల హోరు ఎక్కువగా వినిపించింది. ఆగి ఆగి, మారే కాలాలే పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. కాకపోతే ఓ వర్గం తెలుగు ఆడియెన్స్‌కు అభిరుచికి ట్యూన్ లేకపోవడం మైనస్ అనిచెప్పవచ్చు. అలాగే యూత్‌ను టార్గెట్ చేసి ఆల్బమ్‌ను రూపొందించారనే ఫీలింగ్ కలుగుతుంది.

    ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ

    ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ

    ఈ నగరానికి ఏమైంది చిత్రానికి సంబంధించిన సాంకేతిక విభాగాల పనితీరు గురించి చెప్పుకోవాలంటే సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. నికేత్ బొమ్మిరెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. గోవాలో తన కెమెరాకు పూర్తిస్థాయిలో పనిచెప్పాడు. విజ్వువల్‌గా ఆడియెన్స్‌కు ట్రీట్ ఇచ్చారని చెప్పవచ్చు. ఎడిటర్ గురిజాల కత్తెరకు ఇంకా పదను పెట్టాల్సిన అవసరం కనిపించింది. కొన్ని సీన్లలో లెంగ్తీగా ఉండటం వల్ల ప్రేక్షకుడికి కథపై గ్రిప్ సడలే ప్రమాదం కనిపించింది.

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రొడక్షన్ వ్యాల్యూస్

    ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ నగరానికి ఏమైంది చిత్రం రూపొందింది. నిర్మాణ విలువల పరంగా ఈ బ్యానర్‌లో ఎలాంటి లోటుపాట్లు కనిపించవు. ఈ సినిమాలో కూడా నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. సాంకేతిక నిపుణుల ఎంపిక విషయంలో వారి చాయిస్ బాగుందని చెప్పవచ్చు. ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్ సతీమణి లతా తరుణ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరించారు.

    ఫైనల్‌గా

    ఫైనల్‌గా

    ఈ నగరానికి ఏమైంది చిత్రం ఓ సెక్షన్ ఆడియెన్స్‌ను టార్గెట్‌గా చేసుకొని రూపొందించినట్టు కనిపిస్తుంది. పెళ్లిచూపులు ప్రభావంతో సినిమాకు వెళ్లితే పూర్తిగా నిరాశే. కథ, కథనాలు ఈ చిత్రానికి అతిపెద్ద మైనస్. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్ కెళ్లితే వినోదాన్ని ఆస్వాదించవచ్చు. పూర్తిగా ఇది మల్టీప్లెక్స్ సినిమా అని కూడా చెప్పలేం. ఇక సీ సెంటర్ ఆడియెన్స్‌ను పూర్తిగా వదిలేస్తే.. బీ సెంటర్ ప్రేక్షకులకు ఏమాత్రం ఎక్కినా ఈ నగరానికి ఏమైంది ఓ రేంజ్ సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంది. ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ చిత్ర నిలబడితే మంచి విజయాన్ని చేజిక్కించుకొనే ఛాన్స్ ఉంది.

    బలం, బలహీనతలు

    బలం, బలహీనతలు

    ప్లస్ పాయింట్స్
    తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం
    డైలాగ్స్
    వివేక్ సాగర్
    ప్రొడక్షన్ వాల్యూస్

    మైనస్ పాయింట్స్
    కథ, కథనం
    స్లో నేరేషన్
    ఎమోషన్స్ లేకపోవడం

    తెర వెనుక, తెర ముందు

    తెర వెనుక, తెర ముందు

    నటీనటులు: విశ్వక్ సేన్, సాయి సుశాంత్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను, అనిషా అంబ్రోస్, సిమ్రాన్ చౌదరీ తదితరులు
    దర్శకుడు: తరుణ్ భాస్కర్
    నిర్మాత: డి సురేష్ బాబు
    సినిమాటొగ్రఫి: నికేత్ బొమ్మిరెడ్డి
    మ్యూజిక్: వివేక్ సాగర్
    ఎడిటింగ్: రవితేజ గిరిజాల
    బ్యానర్: సురేష్ ప్రొడక్షన్

    English summary
    After Pellichupulu huge success, Director Tharun Bhascker coming with Ee Nagaraniki Emaindi. Suresh Babu is the producer. Starring Vishwak Sen, Sai Sushanth, Abhinav Gomatam, Venkatesh Kakumanu, Anisha Ambrose and Simran Chowdary in lead roles, the film that features music by Vishwak Sen will release on June 29. The film was recently also certified U/A. This movie slated to release on June 29th. In this occasssion, Telugu filmibeat brings exclusive review.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X