Eesha Movie Review: ఈషా మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Rating: 2.75/5

నటీనటులు: హెబ్బా పటేల్, త్రిగుణ్, అఖిల్ రాజ్, సిరి హన్మంతు తదితరులు
దర్శకత్వం: శ్రీనివాస్ మన్నె
సమర్పణ: కేఎల్ దామోదర్ ప్రసాద్
నిర్మాత: పోతుల హేమ వెంకటేశ్వరరావు
మ్యూజిక్: ఆర్ఆర్ ధృవన్
సినిమాటోగ్రఫి: సంతోష్ సనామోని
ఎడిటర్: వినయ్ రామస్వామి వీ
బ్యానర్: హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్
రిలీజ్ డేట్: 2025-12-25

నయన (హెబ్బా పటేల్), అపర్ణ (సిరి హన్మంతు), కల్యాణ్ (త్రిగుణ్), వినయ్ (అఖిల్ రాజ్) క్లోజ్ ఫ్రెండ్స్. దెయ్యాలు, ఆత్మలు అంటూ ప్రజలను మభ్యపెట్టే దొంగ స్వామిజీలు, నకిలీ బాబాల గుట్టును రట్టు చేస్తుంటారు. వినయ్‌ను పెళ్లి చేసుకొన్న అపర్ణ గర్బవతిగా అవుతుంది. ఈ సంతోష సమయంలో పార్టీ చేసుకొందామని బయలుదేరిన వారికి డాక్టర్ ఆదిదేవ్ బాబా (బబ్లూ పృథ్వీరాజ్) స్వామిజీగా మారిన విషయం తెలుస్తుంది. డాక్టర్ ఆదిదేవ్ నిజస్వరూపాన్ని బయటపెట్టాలని ప్లాన్ వేస్తారు. ఆ ప్రయాణంలో వారి కారుకు భారీ యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్‌లో దిచక్రవాహనంపై వెళ్లే దంపతుల్లో భార్య చనిపోతుంది.

Eesha Movie Review

నలుగురు ఫ్రెండ్స్ తమ లైఫ్‌ను ఎలా జాలీగా ఎంజాయ్ చేశారు? నకిలీ బాబాలు, స్వాముల భరతం పెట్టే విషయంలో ఏం చేశారు? డాక్టర్ ఆదిదేవ్ ఎందుకు స్వామిగా మారాడు? ఆదిదేవ్ ఆశ్రమంలో జరుగుతున్న వ్యవహారం ఏమిటి? ఆదిదేవ్ ఆశ్రమంలోకి వెళ్లిన తర్వాత ఈ నలుగురు ఫ్రెండ్స్‌కు ఏం తెలిసింది? రోడ్డు యాక్సిడెంట్ తర్వాత మరణించిన మహిళ ఆత్మ ఏం చేసింది? ఆదిదేవ్ నిజమైన స్వామినా? దొంగ బాబానా? ఈ నలుగురు ఆదిదేవ్ నుంచి తెలుసుకొన్న భయంకరమైన నిజం ఏమిటి? అనేది ఈషా సినిమా కథ.

క్రైమ్, హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాల్లో బలమైన కథ, అంతకంటే బలమైన సన్నివేశాలు ఉంటే గానీ ప్రేక్షకుడిని ఓ అనుభూతికి గురి చేయడం కష్టం. హారర్ థ్రిల్లర్ సినిమాలు ఆడియెన్స్‌ను థ్రిల్ చేయాలంటే పెద్ద ఛాలెంజ్‌గానే చెప్పుకోవాలి. అలాంటి సవాల్‌ను స్వీకరించిన దర్శకుడు శ్రీనివాస్ మన్నె చేసిన అటెంప్ట్ ఈషా. ఈ చిత్రం కోసం దర్శకుడు ఎంచుకొన్న పాయింట్‌లో కొత్దదనం ఏమీ లేదు. కాకపోతే సస్సెన్స్ ఎలిమెంట్ ఆడియెన్‌ను కొంత మేరకు థ్రిల్ చేస్తుంది. కానీ ఆ పాయింట్‌ను ఇంపాక్ట్‌ఫుల్‌గా చెప్పలేకపోవడం.. తాను నమ్ముకొన్న కథను తెరమీదకు తీసుకు రావడంలో కొంత తడబాటు కనిపిస్తుంది. పాత్రల డిజైన్ విషయంలో క్లారిటీ కనిపించదు. అయితే కొన్ని సన్నివేశాలు మాత్రం నిజంగా కొత్త అనుభూతిని కలిగిస్తాయి. సినిమాలో అలాంటి సీన్లు ఇంకా కొన్ని ఉంటే.. డెఫినెట్‌గా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ప్రమోషనల్‌లో చెప్పినట్టు తెలుగులో అద్బుతమైన థ్రిల్లర్ అయి ఉండేదనే ఫీలింగ్ కలుగుతుంది.

ఫస్టాఫ్ విషయానికి వస్తే.. నలుగురు ఫ్రెండ్స్ జర్నీని ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు కాస్త సమయన్ని ఎక్కువగానే తీసుకోవడం వల్ల ఈ సినిమా స్లోగా, నత్తనడకన సాగుతుందనే ఫీలింగ్ ఆరంభంలో కలుగుతుంది. ఎప్పడైతే యాక్సిడెంట్ సీన్ తెరపైకి వచ్చిందో.. స్టోరి ఎమోషనల్‌గాను, అలాగే మిస్టీరియస్ ఎలిమెంట్స్‌తో ఆసక్తిని రేపుతుంది. కథలోని కొన్ని సన్నివేశాలు సినిమాకు కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. సెకండాఫ్‌లో కూడా ఆదిదేవ్ చుట్టు అల్లుకొన్న సన్నివేశాలు రొటీన్‌గా, రెగ్యులర్‌గానే ఉంటాయి. అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు నడిచే డ్రామాతో దర్శకుడు తన ప్రతిభను చాటుకొనే ప్రయత్నం చేశారు. దాంతో ఈ సినిమాపై బెటర్ ఫీలింగ్ ఏర్పడటానికి కారణమవుతుంది.

నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమాలోని నలుగురిలో హెబ్బా పటేల్ లీడ్ తీసుకొని కథను నడిపించింది. సీనియర్ హీరోయిన్‌ కావడంతో సినిమా భారన్నంత తన భుజాలపై మోసిందనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే త్రిగుణ్ బెటర్ పెర్ఫార్మర్.. ఆయన పాత్రను ఇంకాస్త పెంచి.. ఇంపార్టెన్స్ ఇచ్చి... ఎలివేట్ చేసి ఉంటే.. ఇంకా బెటర్ కంటెంట్ తెరపైన కనిపించేది. సిరి హన్మంతు ఎమోషనల్ క్యారెక్టర్‌లో కనిపించడమే కాకుండా తన వంతుగా ఈ సినిమాకు ప్లస్ అయింది. అఖిల్ రాజ్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. డాక్డర్ ఆదిదేవ్‌గా బబ్లూ పృథ్వీరాజ్ గెటప్ బాగుంది. ఇంకాస్త రోల్‌లో వైవిధ్యం చూపించాల్సింది.

సాంకేతిక విభాగాల విషయానికి వస్తే.. హారర్ మూవీకి ఎంత కావాలో.. అంతగా.. అలాగే కొన్ని సీన్లను ధృవన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో బాగా ఇంప్రూవ్ చేశారు. పాటలు పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయాయి. సంతోష్ సనామోని సినిమాటోగ్రఫి బాగుంది. లొకేషన్లు, సన్నివేశాల కోసం వాడుకొన్న లైటింగ్ స్టోరీ మూడ్‌ను ఎలివేట్ చేసింది. వినయ్ రామస్వామి తన కత్తెరకు ఇంకాస్త పదును పెట్టాల్సింది. ఈ సినిమాకు సౌండ్ డిపార్ట్‌మెంట్ వర్క్ ప్లస్ పాయింట్. కొన్ని సీన్లలో సౌండ్‌తో బయటపెట్టించారు. నిర్మాత హేమ వెంకటేశ్వరరావు, హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ అనుసరించిన నిర్మాణ విలువలు బేషుగ్గా ఉన్నాయి. మీడియం బడ్జెట్‌లో మంచి క్వాలిటీతో సినిమాను రూపొందించారు. హారర్, థ్రిల్లర్ జోనర్‌లో వచ్చే సినిమాలను చూడటానికి ఇష్టపడే వారు ఈ సినిమాను థియేటర్లలో ఎంజాయ్ చేయడానికి పుష్కలంగా కొన్ని అంశాలు ఉన్నాయి. ఈ వారం ఈ సినిమాను మీ చూడటానికి ఇష్టపడే సినిమాల జాబితాలో చేర్చుకోవచ్చు.

More from Filmibeat

Read more about: eesha hebah patel thrigun
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X