Ek Din Movie Twitter Review: ఏక్ దిన్ మూవీ ట్విట్టర్ రివ్యూ

లేడీ పవర్‌స్టార్ సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్లామర్ షోకు దూరంగా.. కథ, కథనాలకు, తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలే చేస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. దక్షిణాదిలో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న సాయిపల్లవి... హిందీ ఇండస్ట్రీపై కన్నేశారు. దీనిలో భాగంగా ఏక్ దిన్ మూవీతో ఆమె బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారు. నేచురల్ పర్ఫార్మెన్స్‌కు పెట్టింది పేరైన సాయిపల్లవి.. హిందీ సినిమాలో ఎలా నటిస్తారోనన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఏక్ దిన్ మూవీపై హైప్ నెలకొంది.

ఏక్‌దిన్‌లో బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నారు. కునాల్ కపూర్, కవిన్ దవే, ప్రగతి మిశ్రా, సాయి ఆద్య, మన్సూర్ ఖాన్, అమీర్‌ఖాన్, బల్లూ సలౌజా, రామ్ సంపత్‌లు ఇతర పాత్రల్లో నటించారు. అమీర్‌ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అమీర్‌ఖాన్, మన్సూర్ ఖాన్, అపర్ణా పురోహిత్‌లు ఏక్‌దిన్ మూవీని నిర్మించగా.. సునీల్ పాండే దర్శకత్వం వహించారు. మనోజ్ లోబో సినిమాట్రోగ్రాఫర్‌గా, బాలు సలూజ ఎడిటర్‌గా పనిచేశారు. రామ్ సంపత్ సంగీత దర్శకత్వం వహించారు. సమ్మర్ కానుకగా మే 1వ తేదీన ఏక్‌ దిన్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీపై నెటిజన్లు, క్రిటిక్స్ వెల్లడించిన ట్వీట్లు, వారి అభిప్రాయాలను పరిశీలిస్తే..

Ek Din Movie Twitter Review in Telugu  Is Sai Pallavi s Movie hits the bulls eye

జునైద్ ఖాన్, సాయిపల్లవిల చిత్రానికి ఆసక్తికరమైన కథాంశం, అందమైన జపాన్ దృశ్యాలు ఉన్నప్పటికీ.. వారి మధ్య బలహీనమైన కెమెస్ట్రీ, నిరాశపరిచే భావోద్వేగ ముగింపులు ఏక్ దిన్ సినిమాను వెనక్కి లాగుతున్నాయి. ఈ సినిమాకు నా రేటింగ్ 2/5 అని ఓ యూజర్ రివ్యూ ఇచ్చాడు.

నటనకు ప్రాధాన్యతనిచ్చే చిత్రాన్ని నటీనటుల ఎంపికే విజయవంతం చేయగలదని లేదా విఫలం చేయగలదని ఏక్‌దిన్ మరోసారి గుర్తుచేస్తుంది. అలాగే సాఫ్ట్ క్యారెక్టర్‌ని పోషించడం అంటే ప్రతి సన్నివేశాన్ని, ప్రతి సంభాషణను ఒకే రకమైన చులకన స్వరంతో చప్పగా మార్చేయడం కరెక్ట్ కాదు అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.

చక్కటి కథాంశం, బలమైన నటన, విలక్షణమైన తీపి- చేదు ముగింపుతో ఏక్ దిన్ ఎంతో హృద్యంగా ఉంది. జునైద్ ఖాన్, సాయిపల్లవి అద్భుతంగా నటించారు. దీనికి నా రేటింగ్ 3.5/5 .. తప్పక చూడమని ఓ అభిమాని పోస్ట్ చేశాడు.

ప్రేమ అంటే గౌరవం.. కేవలం అందం కాదు అనే ఈ స్వచ్ఛమైన, భావోద్వేగభరితమైన ప్రేమకథలో సాయిపల్లవి ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటుంది. ఇబ్బందిపడే ఇంట్రోవర్ట్ అబ్బాయిగా జునైద్ ఖాన్ అద్భుతంగా నటించాడు. ఏక్ దిన్ అంటేనే హృదయం, ఆరాటం, ఆశ.. ఏదేమైనా సంపూర్ణ పేమకథ తర్కానికి అతీతం అంటూ ఓ నెటిజన్ రివ్యూ పోస్ట్ చేశాడు.

ఏదైనా కాపీ చేయాలని అనుకుంటే దానిని హుందాగా చేయాలని అంటారు. కానీ ఇక్కడ ఏక్‌దిన్ నిర్మాతలు.. తమ చేతిలో పూర్తి స్క్రీన్‌ప్లే, కథాంశం ఉన్నప్పటికీ.. తమ వంతు అత్యుత్తమ ప్రయత్నం చేశారు. అయినా సరే అమీర్‌ఖాన్ తన లాల్ సింగ్ చద్ధా సినిమాకు ఏం చేశారో, వీళ్లు కూడా ఈ సినిమాకు అదే చేశారు. దాంతో ఏక్‌దిన్ సాధారణ చిత్రంగా మిగిలిపోయింది.

ఫస్టాఫ్ నుంచే జునైద్ ఖాన్ పేలవమైన నటనను, హవభావాలను మీరు భరించాల్సి ఉంటుంది. అతను అస్సలు యువకుడిలా కాకుండా 40 ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తూ వింతగా ప్రవర్తించాడు. నటనలో ఇది నమ్మశక్యం కానీ పేలవమైన ప్రదర్శన. ఇక సాయిపల్లవి విషయానికి వస్తే .. ఆమె అద్భుతంగా నటించి ఈ చిత్రానికి ప్రాణనాడిగా నిలిచింది. తన ఛార్మ్, అమాయకత్వంతో ఆమె సినిమాను తన భుజాలపై మోసింది.

ప్రారంభం బాగుంది. కానీ సినిమా ముందుకు సాగేకొద్దీ, వినోదం ఏమాత్రం లేక అనేక లోపాలతో చూడటానికి నీరసంగా, బాధాకరంగా మారుతుంది. స్క్రీన్ ప్లేను భారతీయీకరించారు కానీ అసలు సినిమా యొక్క నిజమైన సారాన్ని నిలబెట్టడంలో మాత్రం విఫలమయ్యారు. ఆ సినిమా కూడా పర్వాలేదనిపించేలా ఉన్నప్పటికీ దర్శకత్వం పేలవంగా ఉంది. స్కేల్ చాలా సాధారణంగా కనిపిస్తుంది.

ఇలాంటి సినిమాల స్థాయిని పెంచడంలో సంగీతం కీలకపాత్ర పోషిస్తుంది. కానీ ఇక్కడ పాటలన్నీ చెత్తగా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరీ దారుణంగా ఉంది. జునైద్ తప్పించి మిగతా అందరి నటన బాగుంది.. మిగతాదంతా జీరో ఎంటర్‌టైన్‌మెంట్‌తో నాసిరకమైన సినిమా అని ఓ యూజర్ విశ్లేషించాడు.

Read more about: sai pallavi junaid khan Ek Din
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X